
నాగార్జున, రష్మిక, ధనుష్ నటించిన కుబేర సినిమా జూన్ 20న విడుదలవుతోంది. 1600 స్క్రీన్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిర్మాతలు సినిమా విశేషాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Key Points
నాగార్జున గారి నటన అద్భుతమైనది, ఆ పాత్రకు ఆయన తప్ప మరొకరు లేరని నిర్మాతలు అభిప్రాయపడ్డారు.
1600 స్క్రీన్లలో గ్రాండ్ రిలీజ్ తో కుబేర సినిమా అంచనాలను అందుకోవడానికి సిద్ధంగా ఉంది.
రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం ద్వారా సినిమాకు రియలిస్టిక్ టచ్ ఇవ్వడం జరిగింది.
కుబేర సినిమా కంటెంట్ కు కావాల్సిన బడ్జెట్ తో ఎటువంటి రాజీ లేకుండా నిర్మాణం జరిగింది.
కుబేర సినిమా గ్రాండ్ రిలీజ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా , కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ముగ్గురు భారీ స్టార్స్‌తో తెరకెక్కిన సినిమా కుబేర. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర సినిమాకు దర్శకత్వం వహించింది. దీంతో కుబేరపై భారీ అంచనాను నెలకొన్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో కుబేర సినిమాను జూన్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా కుబేర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నాగార్జున పాత్ర, కుబేర సినీ విశేషాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
-శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్‌తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్‌కి చాలా న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది.
నాగార్జున పాత్ర ప్రత్యేకత
-చాలా డిఫరెంట్ మూవీ ఇది. శేఖర్ కమ్ముల గారు స్టార్స్‌ని క్యారెక్టర్స్‌గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి.
-రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్‌తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్‌లో తీసాము. బొంబాయిలో సినిమాని షూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని చిత్రీకరించడం జరిగింది. అది రియల్ ఛాలెంజ్.
నిర్మాతల అభిప్రాయాలు
-మేము బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్‌కు కావలసిన బడ్జెట్‌తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమాని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 1600 స్క్రీన్స్‌లో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.
– నాగార్జున గారితో వర్క్ చేయాలని మాకు ఎప్పటినుంచో ఉండేది. శేఖర్ గారికి ఈ పాత్ర కోసం నాగార్జున గారు తప్పితే మరొకరు కనిపించలేదు. నాగ్ సర్‌కి ఈ కథ నచ్చింది. ఆయన చాలా అద్భుతంగా నటించారు. ఆయన్ని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేనంత గొప్పగా పర్ఫార్మ్ చేశారు.
కుబేర సినిమా భారీ అంచనాలతో 1600 స్క్రీన్లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. నాగార్జున గారి అద్భుతమైన నటనతో పాటు, సినిమా యొక్క అన్ని విశేషాలను ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు.


