|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nagarjuna: రజినీకాంత్ ‘కూలీ’ సినిమాపై అక్కినేని నాగార్జున రియాక్షన్ ఇదే.. అది చూసి షాక్ అయ్యానంటూ కీలక వ్యాఖ్యలు

Published: 13-06-2025, 3:16 AM
Nagarjuna: రజినీకాంత్ ‘కూలీ’ సినిమాపై అక్కినేని నాగార్జున రియాక్షన్ ఇదే.. అది చూసి షాక్ అయ్యానంటూ కీలక వ్యాఖ్యలు

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలో నటించిన నాగార్జున, తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన తన పాత్రను చూసి షాక్ అయ్యానని కూడా తెలిపారు.

Key Points

1

నాగార్జున ‘కూలీ’ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

2

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘కూలీ’ సినిమా ఆగష్టు 14న విడుదల కానుంది.

4

‘కుబేర’ సినిమాతో నాగార్జున త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

‘కూలీ’ సినిమాపై నాగార్జున వ్యాఖ్యలు

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిది నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున(Nagarjuna), సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, పూజా హెగ్డే(Pooja Hegde) వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ‘కూలీ’ (coolie)చిత్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘లోకేష్ కనగరాజ్ ఒక విజిల్ ఫ్యాక్టర్. చెన్నైలో ఆయనకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో కల్లారా చూశాను. అయితే ‘కూలీ’ సినిమాలో నా పాత్ర ఎంతో కీలకంగా ఉండనుంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం

మీరు నన్ను కుబేర, కూలీలో చూస్తే అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నన్ను స్క్రీన్‌పై చూపించిన విధానానికి నేను లోకేష్‌కు ధన్యావాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ టైమ్ విజువల్ చూపిసనప్పుడు ఇది నేనేనా? అని షాక్ అయ్యాను. ఇది పూర్తిస్థాయి విజిల్ మూవీ. లోకేష్ సినిమాల్లో పాత్రలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. నాకు ‘విక్రమ్’ చిత్రం అంటే చాలా ఇష్టం. అందులో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ఇలా ఎవరి పాత్ర అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది.

నాగార్జున తదుపరి చిత్రం ‘కుబేర’

రజనీ సర్ ని పక్కన పెడితే, కన్నడ నుండి ఉపేంద్ర, హిందీ నుండి ఆమిర్ ఖాన్ నేను.. ఈ పాత్రలన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి.. అదే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, కింగ్ నాగార్జున త్వరలో ‘కుబేర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ధనుష్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అయితే రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చివరగా, ‘కూలీ’ సినిమాలో నాగార్జున పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన నమ్ముతున్నారు. త్వరలోనే ‘కుబేర’ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.