
📌 Key Points
- అఖిల్ ‘లెనిన్’ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల.
- నాగ వంశీ మార్చి 2026లో సినిమా విడుదలపై ధీమా వ్యక్తం చేశారు.
- నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి సినిమా నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు.
- ఈసారి అఖిల్‌కు హిట్టు పక్కా అని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.
అఖిల్ ‘లెనిన్’ సినిమా తుది దశకు చేరుకోగా, నాగ వంశీ మార్చి 2026 విడుదల తేదీని ప్రకటించారు. అఖిల్‌కు హిట్ అందించే లక్ష్యంతో నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈసారి మిస్ ఫైర్ ఉండదని నాగ వంశీ ధీమా వ్యక్తం చేశారు.
లెనిన్ షూటింగ్ అప్డేట్స్, విడుదల తేదీ
Lenin Movie: అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమా (Lenin Movie)షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి కేవలం నటి భాగ్యశ్రీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను పూర్తి చేసుకోనుంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ల పై నాగ వంశీ, నాగార్జున ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని 2026 మార్చి నెలలో విడుదల చేయబోతున్నట్లు ఇటీవల నాగ వంశీ(Nagavamsi) వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ వంశీ అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన అఖిల్ (Akhik)లెనిన్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ సినిమాని 2026 మార్చ్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరొక వారంలో ఈ సినిమా నుంచి పస్ట్ సింగల్ కూడా విడుదల కాబోతుందని తెలిపారు. ఈ సినిమా విషయంలో ఎలాంటి మిస్ ఫైర్ ఉండదని నాగ వంశి ధీమా వ్యక్తం చేశారు. లెనిన్ సినిమా కోసం నాగార్జున(Nagarjuna) రంగంలోకి దిగారు. ఈయన భూతద్దం పెట్టుకొని మరి ఈ సినిమాలో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో వెతుకుతున్నారని, ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అంటూ నాగవంశీ తెలిపారు.
సినిమా కోసం రంగంలోకి నాగార్జున
ఇలా నాగార్జున లెనిన్ సినిమా కోసం రంగంలోకి దిగిన నేపథ్యంలో ఈసారి మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉండదని క్లారిటీ ఇచ్చారు. నాగార్జున నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఎలాగైనా అఖిల్ ను ఇండస్ట్రీలో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా లెనిన్ విషయంలో నాగార్జున ఇన్వాల్వ్మెంట్ ఉండటంతో కచ్చితంగా ఈసారి అఖిల్ కు హిట్టు పడినట్లేనని అభిమానులు కూడా భావిస్తున్నారు. అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు దశాబ్ద కాలం అవుతున్న ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయారు. ఇక లెనిన్ సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
లెనిన్ నుంచి తప్పుకున్న శ్రీ లీల..
అఖిల్ ఆశలు… శ్రీ లీల తప్పుకోవడం
ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదటిగా శ్రీ లీలను ఎంపిక చేశారు. కొంత భాగం ఈమెపై షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల శ్రీ లీల తప్పుకోవడంతో తిరిగి భాగ్యశ్రీ(Bhagya Shri)ని ఎంపిక చేశారు. ఇలా శ్రీలీల పై షూట్ చేసిన సన్నివేశాలు ప్రస్తుతం భాగ్యశ్రీపై చిత్రీకరణ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ వెల్లడి కాబోతున్నాయని తెలుస్తోంది.
నాగార్జున ప్రత్యేక పర్యవేక్షణ, నాగ వంశీ ధీమాతో ‘లెనిన్’ అఖిల్‌కు హిట్టవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు కీలక మలుపు అవుతుందని ఆశిద్దాం.


