
📌 Key Points
- గుడివాడ ANR కాలేజీ వజ్రోత్సవ కార్యక్రమానికి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం కాలేజీకి రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.
- నాగార్జున తండ్రి ANR 1959లో ఈ కళాశాలకు లక్ష రూపాయలు విరాళం ఇచ్చినట్లు గుర్తు చేశారు.
- ఈ సందర్భంగా ANR కళాశాలలో రూసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు.
గుడివాడ ANR కాలేజీ వజ్రోత్సవాల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం ANR కాలేజీకి రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తండ్రి ANR వారసత్వాన్ని కొనసాగిస్తూ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నాగార్జున భారీ విరాళం ప్రకటన
గుడివాడ పర్యటనలో ఉన్న అక్కినేని నాగార్జున కీలక ప్రకటన చేశారు. గుడివాడ ANR కాలేజీకి రూ.2 కోట్ల విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు అక్కినేని నాగార్జున. కృష్ణాజిల్లా గుడివాడలో ANR కళాశాల వజ్రోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ANR కళాశాలలో రూసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, చదువు కోలేకపోయిన వేలాది పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు చాలా కృషి చేసినట్లు గుర్తు చేశారు.
1959 సంవత్సరంలో ఈ కళాశాలకు ANR లక్ష రూపాయలు విరాళం ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ ల కోసం తమ అక్కినేని ఫ్యామిలీ నుంచి రూ.2 కోట్ల విరాళం అందిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మా నాన్న ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు మేము ఇది కూడా ఇవ్వకపోతే బాగోదన్నారు. మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే కార్యక్రమాలు శాశ్వతం అంటూ గుర్తు చేశారు అక్కినేని నాగార్జున. ఇక ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, లోకల్ ఎమ్మెల్యే వెనిగండ్ల రామ్ పాల్గొన్నారు. క్లిక్
తండ్రి ANR వారసత్వాన్ని కొనసాగిస్తూ
వజ్రోత్సవ వేడుకల హైలైట్స్
మొత్తం మీద గుడివాడ ANR కాలేజీకి నాగార్జున ఇచ్చిన భారీ విరాళం ఆయన దాతృత్వానికి నిదర్శనం. తండ్రి ANR ఆశయాలను సజీవంగా ఉంచుతూ, విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాలనే సంకల్పాన్ని ఇది చాటుతోంది.


