|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగవంశీ సంచలన వ్యాఖ్యలు: డిస్ట్రిబ్యూటర్లను చంపేసి, మమ్మల్ని బానిసలు చేయాలని చూస్తున్నారు!

Published: 07-07-2026, 5:48 PM
నాగవంశీ సంచలన వ్యాఖ్యలు: డిస్ట్రిబ్యూటర్లను చంపేసి, మమ్మల్ని బానిసలు చేయాలని చూస్తున్నారు!
  • నాగవంశీ షాకింగ్ కామెంట్స్: పర్సెంటేజ్ సిస్టమ్ పై సంచలన వ్యాఖ్యలు.
  • డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను చంపేసి, నిర్మాతలు బానిసలు అవుతారని హెచ్చరిక.
  • పెద్ద నిర్మాతల గుత్తాధిపత్యం కోసమే ఈ కుట్ర అని నాగవంశీ ఆరోపణ.
  • టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పర్సెంటేజ్ సిస్టమ్ వివాదం.

టాలీవుడ్‌లో రాజుకున్న పర్సెంటేజ్ సిస్టమ్ వివాదంపై నిర్మాత నాగవంశీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నాశనం చేసి, తమను బానిసలుగా మార్చాలని చూస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

పర్సెంటేజ్ సిస్టమ్ వెనుక అసలు కుట్ర!

Nagavamsi : టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా థియేటర్స్ రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్ సిస్టమ్ అని వివాదం సాగుతూనే ఉంది. ఇండస్ట్రీలో థియేటర్స్ ఉన్న ఒకరిద్దరు పెద్ద నిర్మాతలు కొంతమంది ఎగ్జిబిటర్లతో కలిసి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అని వివాదం సృష్టిస్తున్నారని అంతా భావిస్తున్నారు. దీనిపై చాలా మంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. పెద్ది సమయంలో ఈ గొడవ చాలా పెద్దగానే అయింది. నిర్మాతలు, మెగాస్టార్, ఫిలిం ఛాంబర్.. ఇలా అందరి మీటింగ్స్ అయినా ఈ థియేటర్స్ పర్సెంటేజ్ సిస్టమ్ గొడవ పరిష్కారం కాలేదు.

మొదట్నుంచి నిర్మాత నాగవంశీ పర్సెంటేజ్ సిస్టమ్ ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇటీవల పెద్ది రిలీజ్ సమయంలో ఎగ్జిబిటర్లు థియేటర్స్ బాగుచేయండి, థియేటర్స్ లెక్కలు చెప్పండి అవన్నీ బాగుంటే పర్సెంటేజ్ ఓకే అన్నారు కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు.

డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను చంపేస్తారా?

తాజాగా నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చేది డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ చంపేయడానికి. ఏదైనా మా సినిమాలు రిలీజ్ కి వస్తే ఆ పెద్ద నలుగురు నిర్మాతలు దగ్గరకు వెళ్లి మా సినిమా రిలీజ్ చేయమని అడుక్కుంటే వాళ్ళు మా మీద జాలి పడి మేము పది కోట్లు అడిగితే ఓ నాలుగైదు కోట్లు ఇచ్చి సినిమా రిలీజ్ చేసే పొజిషన్ కి తీసుకురావాలని చూస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని చంపేయడానికి చూస్తున్నారు వాళ్ళు.

అప్పులు చేసి సినిమాలు తీసేది బానిసత్వం కోసమా?

డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసేసి పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చి మీ చార్ట్ అంతా మేము చూస్తాము మాకు ఒక రెండు లేదా మూడు శాతం ఇవ్వండి అంటారు. డిస్ట్రిబ్యూటర్స్ కి అడ్వాన్స్ లు ఇవ్వము అంటారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలకు ఇవ్వలేరు. అలా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ మొత్తం తీసేస్తే మేము వెళ్లి వాళ్ళ కాళ్ళ ముందు నించోవాలి. ఇది వాళ్ళ టార్గెట్. నిర్మాతలంతా అప్పులు చేసి సినిమాలు తీసేది వాళ్ళ కాళ్ళ దగ్గర నించోడానికా కాదు కదా అందుకే ఈ ఫైట్ అని అన్నారు. మరి దీనిపై పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అనే నిర్మాతలు ఏమని స్పందిస్తారో చూడాలి.

నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో మరింత చర్చకు దారితీశాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరెన్నో ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.