|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ యాంకర్ల వివాదంపై నాగవంశీ సంచలన నిజం బయటపెట్టాడు! అసలు కథేంటి?

Published: 30-12-2025, 6:09 AM
ఆ యాంకర్ల వివాదంపై నాగవంశీ సంచలన నిజం బయటపెట్టాడు! అసలు కథేంటి?
  • ఓ ఇంటర్వ్యూలో ‘యాంకర్?’ అని నాగవంశీ చేసిన వ్యాఖ్య వైరల్ అయింది.
  • ఆ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో నాగవంశీ మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
  • నాకు తెలిసింది సుమ, ప్రదీప్ మాత్రమేనని, వారు తనకు చాలా సన్నిహితులని పేర్కొన్నారు.
  • యాంకర్లను తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశ్యం తనకి లేదని స్పష్టం చేశారు.

నిర్మాత నాగవంశీ ‘యాంకరంటే తక్కువా’ వివాదంపై స్పందించారు. తనకు సుమ, ప్రదీప్ ఇద్దరే యాంకర్లు తెలుసని, ఎవరినీ కించపరచాలని తన ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. యాంకర్ల క్రష్‌పై అడగ్గా ఆశ్చర్యంతోనే అలా అన్నానని వివరించారు. ఈ వివరణతో వివాదానికి తెరపడింది.

యాంకర్లపై నాగవంశీ వ్యాఖ్యలు: అసలు వివాదం ఏంటి?

ఈ వివాదంపై నాగవంశీ మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

Nagavamsi : నిర్మాత నాగవంశీ తన సినిమాలతో పాటు తన ఇంటర్వ్యూలు, స్పీచ్ లతో కూడా వార్తలో నిలుస్తారు. సోషల్ మీడియాలో నాగవంశీ రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ మీకు ఏ హీరోయిన్, యాంకర్ మీద క్రష్ ఉంది అని అడగ్గా యాంకరా అంటూ ఆశ్చర్యపోతూ ఓ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది.(Nagavamsi)

నాకు తెలిసింది ఇద్దరే యాంకర్లు: నాగవంశీ వివరణ

అయితే పలువురు యాంకర్స్ అంటే తక్కువా అని నాగవంశీ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ వివాదంపై నాగవంశీ మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

సుమ, ప్రదీప్ గురించి నిర్మాత అభిప్రాయం

నాగవంశీ మాట్లాడుతూ.. నేను యంకరా అని ఎవర్ని తక్కువ చేసి అనలేదు. నాకు తెలిసింది ఇద్దరే యాంకర్స్. సుమ గారు, మా ప్రదీప్ గాడు. సుమ గారు అంటే అక్క, తల్లి అలా చూస్తాము. సుమ మాకు ఫ్యామిలీ లాంటిది. ప్రదీప్ మగాడు అతన్ని ప్రేమించడం, ఇష్టపడటం లాంటిది ఉండదు. ప్రదీప్ నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. నాకు వాళ్లిద్దరే తెలుసు. శ్రీముఖి గారు చేస్తారని తెలుసు. ఆవిడ ఇంక మా సినిమాలకు చేయలేదు. వేరే యాంకర్స్ ఎక్కువగా తెలీదు. మాములుగా యాంకర్స్ గురించి అడగరు కదా. ఆయన అలా యాంకర్స్ లో క్రష్ అని అడిగేసరికి ఆశ్చర్యపోయి యాంకర్ ఏంటి అని అన్నాను. అంతే కానీ ఎవర్ని తక్కువ చేయాలని కాదు అని తెలిపారు.

మొత్తంగా, నాగవంశీ తన వ్యాఖ్యలపై సమగ్ర వివరణ ఇవ్వడం ద్వారా వివాదానికి ముగింపు పలికారు. యాంకర్ల పట్ల తనకు గౌరవం ఉందని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లారిటీతో అందరి అపోహలు తొలగిపోయాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.