|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nandamuri Balakrishna: నిన్ను ఎవడు రమ్మన్నాడు?. అభిమానిపై రెచ్చిపోయిన బాలయ్య!

Published: 18-11-2025, 6:12 AM
Nandamuri Balakrishna: నిన్ను ఎవడు రమ్మన్నాడు?. అభిమానిపై రెచ్చిపోయిన బాలయ్య!

నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. అఖండ-2 ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్ను ఎవరు రమ్మన్నారు?’ అంటూ ప్రశ్నించడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Key Points

1

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానిపై నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2

'నిన్ను ఎవరు రమ్మన్నారు?' అంటూ ప్రశ్నిస్తూ బాలయ్య దురుసుగా ప్రవర్తించారు.

4

నందమూరి బాలకృష్ణ తీరుపై నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

బాలయ్య ఆగ్రహం: అసలేం జరిగింది?

నందమూరి బాలకృష్ణ అనే పేరు కేవలం సినిమాల వరకే పనికొస్తుంది. ఎందుకంటే ఆ పేరుకు తగ్గట్లుగా బయట ఎక్కడా కూడా ప్రవర్తించిన దాఖలాలు లేవు. గతంలో ఇప్పటికే చాలాసార్లు అభాసుపాలైనప్పటికీ.. ఆయన తీరులో ఎలాంటి మార్పులైతే రావడం లేదు. తాజాగా మరోసారి ఓ అభిమానిపై ఎప్పటిలాగే  నోరు పారేసుకున్నారు. స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన అభిమానిపై దురుసుగా ప్రవర్తించాడు.

అసలు ఇక్కడికి నిన్ను ఎవరు రమ్మన్నాడు? అంటూ అతనివైపు వేలు చూపిస్తూ బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం ఈవెంట్‌లో కూడా వీడు కనపడకూడదని తన సెక్యూరిటీకి ఆదేశాలిచ్చాడ. బాలకృష్ణ తీరుతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇది చూసిన నెటిజన్స్‌ బాలకృష్ణ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులపై కోపం ప్రదర్శించడమేంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. అఖండ-2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాంగ్‌ లాంఛ్‌ కోసం వైజాగ్ వెళ్లగా ఈ సంఘటన జరిగింది.

అభిమానిపై నోరు పారేసుకున్న బాలకృష్ణ

నెటిజన్ల ఆగ్రహం, సోషల్ మీడియాలో చర్చ

మొత్తానికి, నందమూరి బాలకృష్ణ తీరు మరోసారి వివాదాస్పదమైంది. అభిమానులపై ఆయన ప్రదర్శించిన కోపం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. సినీ వర్గాల్లోనూ ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.