|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nani : నాని ఫేవరేట్ టీచర్ ఎవరో? నాని గురించి ఏం చెప్పారో తెలుసా?.. టెన్త్ క్లాస్ లోనే..

Published: 31-08-2025, 1:47 AM
Nani : నాని ఫేవరేట్ టీచర్ ఎవరో? నాని గురించి ఏం చెప్పారో తెలుసా?.. టెన్త్ క్లాస్ లోనే..

న్యాచురల్ స్టార్ నాని తన పాఠశాల రోజుల గురించి జయమ్ము నిశ్చయమ్మురా షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన అభిమాన ఉపాధ్యాయురాలు, స్నేహితులతో గడిపిన క్షణాల గురించి వివరించారు.

Key Points

1

నాని తన పాఠశాల రోజుల గురించి జయమ్ము నిశ్చయమ్మురా షోలో పంచుకున్నారు.

2

సుందరమ్మ అనే ఉపాధ్యాయురాలు నానిని బాగా చూసుకునేవారని, పరీక్షల సమయంలో ఇంటికి ఫోన్ చేసి చదివాడా అని అడిగేవారని తెలిపారు.

4

పాఠశాల రోజుల్లో నాని చేసిన స్కిట్‌లోని నటనను గుర్తుచేసుకుని ఆమె ఆనందపడ్డారు.

నాని పాఠశాల జ్ఞాపకాలు

Nani : నాని మొదట సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ అవుదామని వచ్చిన సంగతి తెలిసిందే. పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి అవకాశం రావడంతో హీరోగా మారాడు నాని. ఇప్పుడు న్యాచురల్ స్టార్ గా ఎదిగి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. తాజాగా నాని జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్ట్ గా రావడంతో ఈ షోలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు.(Nani)

ఈ క్రమంలో తన స్టూడెంట్ లైఫ్ గురించి చెప్తూ.. యావరేజ్ స్టూడెంట్ అని తెలిపాడు. హైదరాబాద్ సెయింట్ ఆల్ఫాన్స్ స్కూల్ లో చదివానని, తన ఫేవరేట్ టీచర్ సుందరమ్మ. ఆవిడ నన్ను బాగా కేర్ చేసేది, ఎగ్జామ్స్ టైంలో ఇంటికి ఫోన్ చేసి మరీ చదివానా లేదా కనుక్కునేది అని తెలిపాడు.

అభిమాన ఉపాధ్యాయురాలు సుందరమ్మ

ఈ క్రమంలో షో టీమ్ సుందరమ్మ టీచర్ ని తీసుకొచ్చారు. ఆమెని చూసి నాని ఆశ్చర్యపోయాడు. సంవత్సరం క్రితం చివరగా అనుకోకుండా కలిసాను అని తెలిపాడు. సుందరమ్మ టీచర్ మాట్లాడుతూ.. క్లాస్ లో నిద్రపోయేవాడు. అల్లరి ఎక్కువగా చేసేవాడు కాదు. సైలెంట్ గా ఉండేవాడు. యావరేజ్ గా చదివేవాడు. ఇతని ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేసేవాడు హాలిడేస్ లో. హోమ్ వర్క్ చేయకుండా వచ్చేవాడు. తనలో యాక్షన్ పార్ట్ మాకు అప్పుడే తెలిసింది. పదవ తరగతిలో ఒక స్కిట్ వేశారు. అందులో పెళ్లికూతురు ఫాదర్ క్యారెక్టర్ చేసాడు. పెళ్ళికి ఒప్పుకోకూడదు ఆ పాత్రలో. దానికి డైలాగ్స్, డైరెక్షన్ తనే. అప్పుడే తన దగ్గర ట్యాలెంట్ ఉందని అనుకున్నాం. యాంకర్ ప్రదీప్, శర్వానంద్ కూడా మా స్కూల్ పిల్లలే. ఇంకా చాలా మంది ఉన్నారు అని తెలిపారు.

జయమ్ము నిశ్చయమ్మురా షోలో నాని అనుభవాలు

అనంతరం సుందరమ్మ టీచర్ నాని స్కూల్ లో వాళ్ళ క్లాస్ తో కలిసి దిగిన గ్రూప్ ఫోటోని గిఫ్ట్ గా తీసుకొచ్చి ఇచ్చారు. నాని తన టీచర్ కాళ్లకు నమస్కరించి త్వరలో ఇంటికి వస్తానని చెప్పారు.

నాని తన పాఠశాల రోజులను, ఉపాధ్యాయురాలి ప్రేమను గుర్తు చేసుకుంటూ, ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జ్ఞాపకాలు నాని జీవితంలో ఎంతో ప్రభావం చూపాయని తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.