|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. కానీ నేను మీ సన్నిధిలో ఉంటే నా గమ్యాన్ని చేరుకుంటాను.. నాని హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published: 16-05-2025, 11:44 PM
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. కానీ నేను మీ సన్నిధిలో ఉంటే నా గమ్యాన్ని చేరుకుంటాను.. నాని హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

కేజీఎఫ్ తో పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి, తాజాగా నాని సినిమా ‘హిట్-3’లో నటించింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె భక్తిని ప్రతిబింబించే ఈ పోస్ట్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

శ్రీనిధి శెట్టి తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది.

2

లింగ భైరవి అమ్మవారి దర్శనం తర్వాత ఆమె పోస్ట్ చేసిన భక్తిపూరిత సందేశం.

4

నాని హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించిన 'హిట్-3' సినిమా విజయవంతమైంది.

శ్రీనిధి శెట్టి యొక్క వైరల్ పోస్ట్

కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా నాని(Nani) సరసన ‘హిట్-3’(Hit-3) మూవీలో నటించి మెప్పించింది.ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది.

లింగ భైరవి అమ్మవారి దర్శనం

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీనిధి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో లింగ భైరవి అమ్మవారిని దర్శించుకుంది. అక్కడ పూజలు చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘జీవితంలో చాలా విధాలుగా జరుగుతుంది. కొన్ని విషయాలు మాయాజాలంగా ఉంటాయి, మరికొన్ని అలా ఉండకపోవచ్చు. ఏదీ శాశ్వతం కాదు లేదా హామీ ఇవ్వబడదు. కానీ నేను మీ కృపలో ఉన్నంత వరకు నేను నా గమ్యాన్ని చేరుకుంటానని నాకు తెలుసు దేవి’ అంటూ నమస్కరిస్తున్న ఎమోజీ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

ఆధ్యాత్మిక సందేశం

A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty)

శ్రీనిధి శెట్టి యొక్క భక్తిపూరిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నమ్మకం, ఆమె కెరీర్ విజయంపై దృష్టిని ఈ పోస్ట్ ప్రతిబింబిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.