
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్-3’ సినిమా షూటింగ్ సమయంలో తలకు గాయమై కుట్లు పడ్డప్పటికీ, షూటింగ్‌ను కొనసాగించాడు. దీనికి ఫ్యాన్స్ ఆయనను ప్రశంసిస్తున్నారు.
Key Points
హిట్-3 షూటింగ్‌లో నాని తలకు తీవ్ర గాయం.
కుట్లు పడినా కూడా షూటింగ్ కొనసాగించిన నాని.
నిప్పు అంటుకున్నా సైతం డెడికేషన్ చూపించిన నాని.
ఫ్యాన్స్ నాని డెడికేషన్‌ను ప్రశంసిస్తున్నారు.
హిట్-3 సినిమా షూటింగ్ లో గాయం
నేచురల్ స్టార్ హీరోయిన్ నాని(Nani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘హిట్-3’(Hit-3) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. మే 1న రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇక దీనికి శైలేష్ కొలను(Sailesh Kolanu) డైరెక్షన్‌లో వచ్చిన హిట్-3 యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారింది. మాస్ అవతార్‌లో నాని అదరగొట్టాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో నాని గాయపడ్డాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా దర్శకుడు శైలేష్ ఎక్స్(X)లో హిట్ 3 సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు షేర్ చేశాడు. సినిమాలో కొన్ని అల్లరి మూకలను నాని తరిమే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో నాని తలకు గాయం అయ్యింది. అలాగే నాని ఒంటికి నిప్పు కూడా అంటుకుంది. తలకు దెబ్బ తగిలినా కూడా కుట్లు పడినా కూడా వెంటనే నాని షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.. అది ఆయన డెడికేషన్ అంటూ కొన్ని ఫొటోలు, వీడియోలను దర్శకుడు శైలేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నాని డెడికేషన్‌కు టేక్ ఎ బౌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నాని డెడికేషన్ కు ఫ్యాన్స్ ప్రశంసలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు
నాని యొక్క అంకితభావం, నిజమైన ప్రొఫెషనలిజం అభిమానులను ఆకట్టుకుంది. ‘హిట్-3’ సినిమా విజయం కోసం ఆయన చేసిన కృషి అభినందనీయం.


