
జనప్రియ నటుడు నాని తన పేరు మార్పు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. స్కూల్ రిసెప్షనిస్ట్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల అతని పేరు నవీన్ బాబుగా మారిపోయింది. ఈ కథ వినండి.
Key Points
రిసెప్షనిస్ట్ తప్పు వల్ల నాని పేరు నవీన్ బాబు అయింది.
చిన్నప్పటి నుండి నాని అనే పేరుతోనే పిలిచేవారు.
అసలు పేరు నవీన్ కుమార్ అయినా, అన్ని అధికారిక పత్రాల్లో నవీన్ బాబుగానే ఉంది.
రిసెప్షనిస్ట్ చేసిన తప్పు
Nani : న్యాచురల్ స్టార్ నాని.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలో స్టార్ గా ఎదిగిన హీరోల్లో ఒకరు. ఇప్పుడు వరుస హిట్స్ సాధిస్తూ వంద కోట్ల సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
తాజాగా నాని జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్ట్ గా రావడంతో ఈ షోలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు. అయితే నాని అసలు పేరు నవీన్ కుమార్ అని తెలిసిందే. అది కాకుండా నవీన్ బాబు అని కూడా ఉంది. తన పేరు మార్పు గురించి నాని ఈ షోలో ఆసక్తికర విషయం తెలిపాడు.
నవీన్ కుమార్ నుండి నానికి మార్పు
నాని మాట్లాడుతూ.. ఈడ్పుగల్లులో సిద్దార్థ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నప్పుడు అల్లరి ఎక్కువైందని టీసీ ఇచ్చి పంపించేశారు. అప్పుడు టీసీ లో రాసేటప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ తండ్రి పేరు రాంబాబు అయితే కొడుకు పేరు ఉత్త నవీన్ ఎందుకు ఉంటుంది అని నవీన్ కి బాబు యాడ్ చేసింది. దాంతో ఆ టీసీ లో ఉన్నట్టే నవీన్ బాబు అని స్కూల్, కాలేజీలో పేరు అన్ని చోట్ల పడి అఫీషియల్ అయిపోయింది. పాస్ పోర్ట్ తో సహా అన్ని చోట్ల ఆ పేరే ఉంటుంది.
సినిమా పేరుకు నాని ఎలా అలవాటుపడ్డాడు
నా అసలు పేరు అయితే నవీన్ కుమార్. కానీ చిన్నప్పుడు నాని అనే పిలిచేవాళ్ళు ఇంట్లో. స్కూల్ లో ఫ్రెండ్స్ కూడా అలాగే పిలిచేవాళ్ళు. నాని అనే పేరుకు నేను కనెక్ట్ అయినట్టు నవీన్ కి కనెక్ట్ అవ్వలేదు. సినిమాల్లోకి వచ్చాక నాని మరింత కలిసొచ్చింది అని తెలిపాడు.
చిన్నప్పటి నుండి నానిగా పిలువబడిన నటుడు, తన పేరు మార్పు వెనుక ఉన్న కథను జయమ్ము నిశ్చయమ్మురా షోలో పంచుకున్నాడు. ఇప్పటికీ అతని అధికారిక పేరు నవీన్ బాబుగానే ఉండటం విశేషం.


