|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The Paradise: నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా? ఆ రూమర్ నిజమే..

Published: 24-06-2025, 6:15 AM
The Paradise: నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా? ఆ రూమర్ నిజమే..

నాని నటించిన ‘ది పారడైజ్’ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ ఎవరనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో, తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం…

Key Points

1

నాని పారడైజ్ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారని వార్తలు.

2

ముకేశ్ కుమార్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

4

సినిమా వచ్చే ఏడాది మార్చ్ 26న విడుదల కానుంది.

మోహన్ బాబు విలన్ గా?

The Paradise : వరుస హిట్ సినిమాలతో నిర్మాతగా, హీరోగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు నాని. ఇటీవల హిట్ 3 సినిమాతో మెప్పించగా ప్రస్తుతం పారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దసరాతో నానికి పెద్ద కమర్షియల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ హైప్ వచ్చింది.

పారడైజ్ సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 26 రిలీజ్ చేయబోతున్నారు ప్రకటించారు. గ్లింప్స్ చుసిన తర్వాత ఈ సినిమా దసరా కంటే మరింత రా & రస్టిక్ గా ఉండబోతుందని ఒక అవగాహన వచ్చింది. దీంతో ఈ సినిమాలో విలన్ ఎవరో అని చర్చగా మారింది. కొన్ని రోజుల క్రితం నాని పారడైజ్ సినిమాలో విలన్ గురించి ఒకరి పేరు వినిపిస్తూ రూమర్స్ వచ్చాయి. తాజాగా కన్నప్ప డైరెక్టర్ ముకేశ్ కుమార్ నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో చెప్పేసాడు.

ముకేశ్ కుమార్ వెల్లడి

ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ లేని ‘తమ్ముడు’ .. ఇప్పటికైనా గేర్ మారుస్తారా?

విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముకేశ్ కుమార్ నేడు మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు గారు నాని కి ఆపోజిట్ గా నటిస్తున్నారు. ఒక పవర్ ఫుల్ రోల్, నేను షూట్ లో చూసాను, ఆయన ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం నాని పారడైజ్ ఒకటే సినిమా చేస్తున్నాడు. అంటే మోహన్ బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.

పారడైజ్ రిలీజ్ డేట్

మోహన్ బాబు గతంలో విలన్ గా కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. మోహన్ బాబు ఒక పవర్ ఫుల్ విలన్, నెగిటివ్ షెడ్ రోల్ చేసి చాలా కాలం అయింది. ఇప్పుడు నాని పారడైజ్ సినిమాలో విలన్ అని తెలియడంతో మోహన్ బాబుని ఏ రేంజ్ లో చూపిస్తారో, డైలాగ్ కింగ్ నెగిటివ్ షేడ్స్ లో మరోసారి ఎలా కనిపిస్తారో అని ఆసక్తి నెలకొంది. అసలు మోహన్ బాబుని విలన్ గా తీసుకోవాలని డైరెక్టర్ కి వచ్చిన ఆలోచనని అభినందిస్తున్నారు.

మోహన్ బాబు విలన్ గా నటించడం సినిమాకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది. మార్చ్ 26, 2024న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.