|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘బ్లడీ రొమియో’ కోసం వేట మొదలెట్టిన సుజీత్!

Published: 17-06-2026, 3:15 PM
నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘బ్లడీ రొమియో’ కోసం వేట మొదలెట్టిన సుజీత్!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవెటెడ్ మూవీ ‘బ్లడీ రోమియో’. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు వార్తలు వస్తుండటంతో నాని అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్ నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు సుజీత్ తన చిత్ర బృందంతో కలిసి ప్రస్తుతం యూరప్‌లో పర్యటిస్తున్నట్లు సమాచారం. సినిమాకు కావలసిన ప్రధానమైన లొకేషన్లను ఎంపిక చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారట. ఈ సినిమా కథాంశం ప్రకారం.. షూటింగ్‌లో చాలా భాగం విదేశాల్లోనే జరగాల్సి ఉందట. అందుకే చిత్రానికి ఒక ఇంటర్నేషనల్ లుక్, ఫుల్ స్టైలిష్ బ్యాక్‌డ్రాప్ తీసుకురావడం కోసం సుజీత్ యూరప్‌లోని పలు అందమైన, సరికొత్త ప్రదేశాలను పరిశీలిస్తున్నారట. విజువల్స్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని ఈ లొకేషన్ల వేటను బట్టి అర్థమవుతోంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.