
ప్రముఖ నటుడు నాని తన కొడుకు అర్జున్ గురించి తాజాగా ఒక ఆవేదనకరమైన విషయాన్ని పంచుకున్నాడు. అర్జున్ కి కాలు ఫ్రాక్చర్ అయిన సంఘటన గురించి, ఆ సమయంలో జరిగిన విషయాల గురించి నాని వివరించాడు.
Key Points
నాని కొడుకు అర్జున్ కి కాలు ఫ్రాక్చర్ అయింది.
సైకిల్ ప్రమాదంలో ఈ గాయం జరిగింది.
అర్ధరాత్రి నొప్పితో ఏడుస్తున్న కొడుకును చూసి నాని ఎమోషనల్ అయ్యాడు.
కొడుకు 'సారీ నాన్న' అని చెప్పడంతో నాని చాలా భావోద్వేగానికి లోనయ్యాడు.
అర్జున్ కి కాలు ఫ్రాక్చర్
Nani Son : నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాలే కాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా రెగ్యులర్ గా నాని తన సోషల్ మీడియాలో పంచుకుంటాడు. ముఖ్యంగా తన కొడుకు అర్జున్ కి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.(Nani Son)
తాజాగా నాని జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరవ్వగా ఈ షోలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో జగపతి బాబు మీ అబ్బాయికి కాలు ఫ్రాక్చర్ అయింది కదా అని అడిగారు.
అర్ధరాత్రి పూట కొడుకు మాటలు
దానికి నాని సమాధానమిస్తూ.. సంవత్సరం క్రితం జున్ను కాలికి ఫ్రాక్చర్ అయింది. పిల్లలకు దెబ్బ తగిలినా, హెల్త్ బాగోలేకపోయినా చాలా బాధ అనిపిస్తుంది. ఆ సమయంలో వాళ్ళ ఫేస్ చూడలేము. సైకిల్ మీద నుంచి పడి బోన్ ఫ్రాక్చర్ అయింది. కదలడానికి కూడా లేదు. కాలు కొంచెం జరిపినా నొప్పి అనేవాడు. బాత్రూం కి మేమే తీసుకెళ్ళేవాళ్ళం. నాకు, అంజుకి కొన్ని రోజులు నిద్ర లేదు. అర్ధరాత్రి పూట పెయిన్ అని ఏడ్చేవాడు. ఒకరోజు రాత్రి పూట సడెన్ గా లేచి సారీ నాన్న అన్నాడు. ఎందుకురా అంటే.. నా వల్ల మీ అందరికి నిద్ర ఉండట్లేదు అని అనేసరికి అంత చిన్న పిల్లాడు అంత పెద్ద మాట అనేసరికి జళ్ళుమంది అంటూ ఎమోషనల్ అయ్యాడు.
నాని భావోద్వేగం
నాని కొడుకు అర్జున్ యొక్క ఫ్రాక్చర్ ఘటన నానిని ఎంతగానో కదిలించింది. కొడుకు ప్రవర్తన, మాటలు అతన్ని ఎమోషనల్‌గా చేశాయని తెలిపాడు.


