|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ఫ్యాన్స్‌కు పూనకాలే! ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్! ఇక రచ్చ మామూలుగా ఉండదు!

Published: 31-01-2026, 11:05 PM
నాని ఫ్యాన్స్‌కు పూనకాలే! 'ది ప్యారడైజ్' రిలీజ్ డేట్ ఫిక్స్! ఇక రచ్చ మామూలుగా ఉండదు!
  • నాని ‘ది ప్యారడైజ్’ మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ జూన్ 25గా టాక్!
  • శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మరో భారీ చిత్రం, అంచనాలు భారీగా ఉన్నాయి.
  • ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు విలన్ పాత్రలో!
  • తెలుగు, తమిళ, హిందీ సహా ఎనిమిది భాషల్లో ‘ది ప్యారడైజ్’ విడుదల కానుంది.

న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మార్చి 27 విడుదల వాయిదా.. కారణమిదే!

నేచురల్ స్టార్ నాని(nani) ‘హిట్-3థర్డ్ కేస్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’(The Paradise). ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి నానికి ‘దసరా’తో హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో నాని సరసన కోలీవుడ్ బ్యూటీ కయాదు లోహర్ (Kayadu Lohar)హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు విలన్‌గా శికంజ మాలిక్ పాత్రలో కనిపించబోతున్నారు. నాని జడల్ పాత్రలో నటిస్తుండగా..శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏకంగా ఎనిమిది భాషల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు గత కొద్ది కాలంగా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదే రోజు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. కాబట్టి నాని సినిమాను వాయిదా వేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు టాక్. తాజాగా, ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని ‘ది ప్యారడైజ్’ సమ్మర్ స్పెషల్‌గా జూన్ 25న రిలీజ్ కాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ సమ్మర్‌ను క్యాచ్ చేసుకుని హిట్ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సమ్మర్ స్పెషల్‌గా ‘ది ప్యారడైజ్’!

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో మళ్ళీ!

‘ది ప్యారడైజ్’ మూవీ జూన్ 25న విడుదల కానుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.