|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, రష్మికల పెళ్లి రూమర్స్‌కి నాని చెక్! వైరల్ అవుతున్న శుభాకాంక్షల ట్వీట్!

Published: 27-02-2026, 3:05 AM
విజయ్, రష్మికల పెళ్లి రూమర్స్‌కి నాని చెక్! వైరల్ అవుతున్న శుభాకాంక్షల ట్వీట్!
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఉదయపూర్ లో జరిగింది.
  • నానిని విజయ్ ఆహ్వానించలేదనే పుకార్లు వ్యాపించాయి.
  • విజయ్, రష్మికలకు నాని సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
  • నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహంపై వస్తున్న రూమర్స్‌కు నాని తన ట్వీట్‌తో చెక్ పెట్టారు. స్వయంగా ఫోటోలను షేర్ చేస్తూ, ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుకార్లకు తెరదించారు.

విజయ్, రష్మికల వివాహం

Actor Nani:విరోష్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna ) ఎట్టకేలకు హిందూ సాంప్రదాయం ప్రకారం, కొడవ జాతి మత ఆచారాల ప్రకారం ఉదయపూర్ హై ప్రొఫైల్ ప్యాలెస్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.. ఇకపోతే ఈ కార్యక్రమానికి కేవలం కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించిన విషయం తెలిసిందే. కానీ మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ ప్యాలెస్ లో జరగబోయే రిసెప్షన్ కి చాలామందికి రిసెప్షన్ ఇన్విటేషన్స్ ను పంపించారు. అయితే ఇలాంటి సమయంలో హీరో నిఖిల్(Nikhil ) తో పాటు హీరో నాని (Nani) కి విజయ్ దేవరకొండ ఆహ్వానం అందించలేదనే పుకార్లు దావాణంలా వ్యాపించాయి.

ఇండస్ట్రీలో ఉండే చాలామందికి విజయ్ దేవరకొండ ఇన్విటేషన్ కార్డులు పంపించారు. కానీ నిఖిల్ మరియు నానితో ఉండే విభేదాల కారణంగానే ఆయన ఇన్విటేషన్స్ పంపించలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ కి నాని ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చారు. తాజాగా వివాహం చేసుకున్న ఈ జంటకు ఆయన స్పెషల్ విషెస్ తెలియజేస్తూ.. విరోష్ జంట పెళ్లి ఫోటోలను స్వయంగా పంచుకున్నారు. ఈ మేరకు నాని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా. విజయ్ రష్మిక పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ.. “ఈ అందమైన జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రియమైన విజయ్ , రష్మిక మీ ఇద్దరి జీవితం మరింత అందంగా, ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం నాని పంచుకున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరొకవైపు ఈ సినిమా నుండి విడుదల చేసిన ఆయా షేర్ సాంగ్ ఏకంగా యూట్యూబ్ లోనే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల మ్యూజిక్ చార్టులో నంబర్ వన్ ప్లేస్ లో నిలవడం సంచలనంగా మారింది. అనిరుద్ రవిచంద్రన్ అందించిన బీట్.. నాని మాస్ స్టెప్స్ కి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అలా ఒక్క పాటతో అటు పాన్ వరల్డ్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు నాని అని చెప్పాలి. ఇక మరొకవైపు సాహో డైరెక్టర్ సుజీత్ తో నాని సినిమా చేస్తున్నారు . నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. నాని బ్లడీ రోమియో అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో చెఫ్ , గ్యాంగ్ స్టర్ పాత్రల్లో నటించనున్నారు.

నాని రూమర్స్‌కి చెక్

ఇకపోతే నాని ఒకవైపు హీరోగా పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు నిర్మాతగా భారీ సక్సెస్ సొంతం చేసుకుంటున్నారని చెప్పాలి. ఒకవైపు కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. దర్శకులను పరిచయం చేస్తూ.. కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటున్న నాని.. మరొకవైపు తన చిత్రాలకు సహనిర్మాతగా పనిచేస్తూ లాభాల బాట పట్టారు. ఇక విమర్శలకు తావు ఇవ్వకుండా తనదైన శైలిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

నాని ట్వీట్ వైరల్

Loads of love and congratulations to this beautiful couple. Wishing you an even more beautiful and blissful life together dear Vijay and Rashmika. ♥️ God bless. @TheDeverakonda @iamRashmika https://t.co/cX1nYvetA7

— Nani (@NameisNani) February 26, 2026

నాని చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సహ నటులకు అండగా నిలుస్తూ, రూమర్స్‌ను ఖండిస్తూ నాని చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.