|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నరేష్ ఆస్తుల చిట్టా వింటే షాక్ అవుతారు! వెయ్యి కోట్లు ఎలా సంపాదించారో తెలుసా?

Published: 19-02-2026, 11:35 PM
నరేష్ ఆస్తుల చిట్టా వింటే షాక్ అవుతారు! వెయ్యి కోట్లు ఎలా సంపాదించారో తెలుసా?
  • నటుడు నరేష్‌కు రెండు కోట్ల విలువైన క్యారీ వేన్ ఉంది.
  • గచ్చిబౌలిలో అయిదు ఎకరాల్లో కమర్షియల్ బిల్డింగ్స్ నరేష్ సొంతం.
  • నానక్‌రామ్‌గూడలో వందల కోట్ల విలువైన బంగళా, భూమి నరేష్‌కు ఉన్నాయి.
  • నరేష్ ఆస్తుల విలువ వెయ్యి కోట్లకు పైమాటే అని స్వయంగా వెల్లడించారు.

టాలీవుడ్ నటుడు విజయకృష్ణ నరేష్ ఆస్తుల గురించి ఇటీవల చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఆయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, విలాసవంతమైన క్యారీ వేన్, ఇతర ఆస్తుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

నరేష్ ఆస్తుల గురించి షాకింగ్ విషయాలు

Naresh NetWorth: టాలీవుడ్ సీనియర్ నటుడు విజయకృష్ణ నరేష్ కేవలం నటుడిగానే కాకుండా, ఒక భారీ సామ్రాజ్యానికి వారసుడిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. దిగ్గజ నటి, దర్శకురాలు విజయనిర్మల కుమారుడిగా, సూపర్ స్టార్ కృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ బాలనటుడిగానే కెరీర్ ప్రారంభించారు. 80వ దశకంలో జంధ్యాల గారి సినిమాలతో కామెడీ టైమింగ్‌లో తనకంటూ ఒక మేనరిజం సృష్టించుకున్న ఆయన, సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘పెళ్ళిచూపులు’, ‘సమాజవరగమన’ వంటి చిత్రాలతో నేటి తరం ప్రేక్షకులను కూడా మెప్పిస్తూ అగ్ర నటుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘హే బలవంత్’ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంటుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లో ఆయన తన ఆస్తుల గురించి చెబుతూ అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇప్పటికే తనకు రియల్ ఎస్టేర్ వ్యాపారాలు, ఫుడ్ పరిశ్రమలు ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఏకంగా ఆయనకు దాదాపు రెండు కోట్లు విలవ చేసే క్యారీ వేన్ కూడా ఉంది. అంతే కాకుండా గచ్చి బౌలిలో దాదాపు అయిదు ఎకరాల్లో కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి.

Read also- Chiranjeevi NagAshwin: మెగాస్టార్‌కు స్టోరీ చెప్పిన పాన్ ఇండియా దర్శకుడు.. కాంబో కుదిరితే ఫ్యాన్స్‌కు పండగే..

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నరేష్

నరేష్ గారి ఆస్తిపాస్తుల విషయం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (నానక్‌రామ్‌గూడ)లో ఆయనకు వందల కోట్ల విలువైన భారీ బంగళా మరియు ఎకరాల కొద్దీ భూమి ఉంది. ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తన ఆస్తుల విలువ ₹1,000 కోట్లకు పైమాటే అని వెల్లడించారు. దీనికి తోడు ‘విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్’ మరియు చిల్కూర్ ప్రాంతంలో ఉన్న ఆర్గానిక్ ఫామ్ హౌస్ ఆయన సంపదకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నాయి. విలాసవంతమైన కార్లు మరియు బైకుల సేకరణలో కూడా ఆయనకు మంచి అభిరుచి ఉంది.

Read also- ‘హే బల్వంత్’ మూవీ రివ్యూ: -సుహాస్ మార్క్ నవ్వులు.. లాస్ట్ లో ఎమోషన్ల దెబ్బ !

సినీ పరిశ్రమలో నరేష్ ప్రస్థానం

నరేష్ గారి వ్యక్తిగత జీవితం మరియు సామాజిక బాధ్యత కూడా ఎంతో చర్చనీయాంశం. నటి పవిత్ర లోకేష్‌తో ఆయన సాగించిన ‘మళ్ళీ పెళ్ళి’ ప్రయాణం సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. వివాదాలను లెక్కచేయకుండా తన మనసుకు నచ్చినట్లు జీవించే ఆయన, రాజకీయాల్లోనూ మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగానూ తనదైన ముద్ర వేశారు. నేటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటూ, అటు వెండితెరపై నటుడిగా.. ఇటు నిజజీవితంలో అపర కుబేరుడిగా నరేష్ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

నరేష్ తన ఆస్తుల గురించి బహిరంగంగా మాట్లాడటం, తన జీవితంలోని వివిధ అంశాలను పంచుకోవడం ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.