|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నారీ నారీ నడుమ మురారి: శర్వానంద్ ప్రేమ కష్టాలు.. రెండు భామల మధ్య నలిగిపోయి!

Published: 22-12-2025, 8:04 AM
నారీ నారీ నడుమ మురారి: శర్వానంద్ ప్రేమ కష్టాలు.. రెండు భామల మధ్య నలిగిపోయి!
  • శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ తాజాగా విడుదలైంది.
  • సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
  • ఇది పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం, ప్రేమకథా నేపథ్యంతో రూపొందింది.
  • 2026 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల కానుంది.

టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ విడుదలై అంచనాలను పెంచింది. ఇద్దరు హీరోయిన్ల మధ్య శర్వానంద్ ప్రేమకథ ఆసక్తికరంగా ఉండగా, ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ హైప్

టాలీవుడ్ కుర్ర హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న శర్వానంద్, ఇద్దరు భామలతో వచ్చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీ కంప్లీట్ గా ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తోంది. ఈ మూవీలో శర్వానంద్ హీరోగా చేస్తుండగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్ గా మెరువనున్నారు. సునీల్, నరేష్, సత్య, బ్రహ్మాజీ లాంటివాళ్ళు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఈ మూవీ నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం కాసేపటికి క్రితమే రిలీజ్ చేసింది. ఈ టీజర్ సినిమా హైప్ ను అమాంతం పెంచింది. ఇందులో ఇద్దరు హీరోయిన్ల మధ్య శ‌ర్వానంద్ నలిగిపోయిన సన్నివేశాలను అద్భుతంగా తెరిగెక్కించారు. అలాగే ఒకరికి తెలియకుండా మరొకరిని శర్మ, ఎలా వాళ్ల‌ను మెయింటైన్‌ చేశాడన్నది సినిమా స్టోరీ. ఇది ఇలా ఉండగా సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 14వ తేదీన ఈ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా రిలీజ్ కానుంది.

శర్వానంద్, హీరోయిన్ల వివరాలు

సినిమా కథాంశం, విడుదల తేదీ

నారీ నారీ నడుమ మురారి టీజర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శర్వానంద్ అభిమానులు, కుటుంబ ప్రేక్షకులు ఈ వినోదభరితమైన ప్రేమకథా చిత్రాన్ని 2026 సంక్రాంతికి థియేటర్లలో చూడవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.