|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Naveen Chandra: నేను ఎందుకు యాక్టర్ అయ్యానా అని నా మీదా నాకే కోపం వచ్చింది.. హీరో కామెంట్స్ వైరల్

Published: 13-05-2025, 2:05 PM
Naveen Chandra: నేను ఎందుకు యాక్టర్ అయ్యానా అని నా మీదా నాకే కోపం వచ్చింది.. హీరో కామెంట్స్ వైరల్

తాజా ఇంటర్వ్యూలో నటుడు నవీన్ చంద్ర, భారత్-పాక్ యుద్ధం గురించి మాట్లాడుతూ తన చిన్ననాటి ఆశయాలను, కుటుంబ బాధ్యతల వల్ల వాటిని వదులుకోవాల్సి వచ్చిన విషయాన్ని పంచుకున్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Key Points

1

నవీన్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో భారత్-పాక్ యుద్ధంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

2

ఆర్మీ ఆఫీసర్ కావాలనే ఆయన చిన్ననాటి కలను కుటుంబ పరిస్థితుల వల్ల వదులుకోవాల్సి వచ్చింది.

4

ప్రస్తుతం నటనలో ఉన్నప్పటికీ, అవకాశం వస్తే ఇప్పటికీ ఆర్మీలో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.

నవీన్ చంద్ర యొక్క ఆర్మీ కల

హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భారత్-పాక్ యుద్ధం(India-Pakistan war)పై స్పందించాడు. ‘మొన్న జరిగిన భారత్-పాక్ ఇన్సిడెన్స్‌తో అసలు నేను ఎందుకు యాక్టర్ అయ్యానా..? అని కోపం వచ్చింది నాకు. నేను పదవతరగతి పూర్తి చేశాక.. ఇంట్లో డిప్లమో జాయిన్ చేద్దాం అన్నారు. నాకు అప్పుడు మిలటరీ జాయిన్ అవ్వాలనే ఆశ ఉండేది. ఎందుకంటే.. నాకు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనేది కళ. ఆర్మీ(Army)లో ఉండాలని చాలా ఆశ పడ్డాను. కానీ ఫ్యామిలీలో.. కొడుకు మిలటరీకి వెళిపోతే ఎలా.. అంటూ కొన్ని వచ్చాయి. దీంతో నేను వెళ్లలేకపోయాను. కానీ మా తమ్ముడు మాత్రం సీఆర్‌పీఎస్‌లో ఉన్నాడు. ఇక మొన్న జరిగిన ఇన్సిడెన్స్‌తో నాకు అనిపించింది.. యంగ్ ఉన్న సమయంలో మిలటరీకి వెళ్లాలి అనే నా కళను అనవసరంగా వదులుకున్నాను.. జాయిన్ అవ్వాలనే నిర్ణయంపైనే ఉండి ఉంటే బాగుండేది అనుకున్నాను. ఎందుంటే ఆ టైంలో నేను వెళ్లి నా కంట్రీని సేవ్ చేసేవాడిని కదా అనిపించింది. ఆర్మీలలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు నా ఏజ్ కూడా అయిపోయింది. ఒకవేళ నాకు ఇప్పుడు కూడా అవకాశం వచ్చిన నేను జాయిన్ అవుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

కుటుంబ పరిస్థితులు మరియు ఆయన నిర్ణయం

తాజా భారత్-పాక్ సంఘటన మరియు నవీన్ చంద్ర ప్రతిస్పందన

నవీన్ చంద్ర యొక్క ఈ నిజాయితీ కామెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి, కలల వెనుక ఉన్న కష్టాల గురించి ఆయన వెల్లడించిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.