
📌 Key Points
- నవీన్ పొలిశెట్టి హీరోగా ‘అనగనగా ఒక రాజు’ చిత్రం తెరకెక్కుతోంది.
- సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- ‘ఎంత లో పాయింట్‌కి వెళ్లినా ఆశ వదులుకోవద్దు’ అని వీడియోలో నవీన్ సందేశం.
- మూవీ టీమ్ విడుదల చేసిన ఈ మోటివేషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.
నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో, సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైన ఓ మోటివేషనల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నవీన్ మాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
‘అనగనగా ఒక రాజు’ మూవీ వివరాలు
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్నది. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
వైరల్ అవుతున్న నవీన్ పొలిశెట్టి వీడియో
ఇందులో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు మూవీ టీమ్. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘జీవితం అత్యల్ప స్థాయికి చేరుకున్నప్పటికీ, రేపు మరోసారి ప్రయత్నించమని HOPE మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మా రాజు గారు నుండి మీ సోమవారం మోటివేషన్’ అని రాసుకొచ్చింది. ఇక వీడియోలో నవీన్.. ‘ఎంత లో పాయింట్‌కి వెళ్లినా ఒక చిన్న హోప్ ఉండాలి.
“ఆశ వదులుకోద్దు” అంటూ రాజు గారి మాటలు
మళ్లీ నెక్స్ట్ డే లేచి ట్రై చేయాలి. ఆ హోప్ ఆ మూమెంట్‌లో నాకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఈరోజు దానికి ఆన్సర్ మీ అందరి ఎనర్జీ, మీ అందరి ప్రేమ, అభిమానం చూస్తుంటే దానికి వెనక్కి వెళ్లి ఆలోచిస్తే ఒకవేళ నాకు ఈరోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం చూపించి మళ్లీ నా లైఫ్ రివైండ్ చేసి నువ్వు మళ్ళీ అలాగే నథింగ్ నుంచి స్టార్ చేసి మళ్లీ కష్టపడతావా అంటే నేను ఓకే అంటాను.. కాబట్టి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రేపు మరోసారి ప్రయత్నించండి’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నవీన్ పొలిశెట్టి పంచుకున్న ఈ మోటివేషనల్ సందేశం ఇప్పుడు అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఎంత కష్టం వచ్చినా రేపు మరోసారి ప్రయత్నించమని చెప్పిన అతని మాటలు నెటిజన్ల మనసు గెలుచుకున్నాయి. ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది.


