
📌 Key Points
- నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా వస్తుంది.
- జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- ప్రభాస్ పెళ్లి చేసుకున్న మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాను చేసుకుంటానన్నారు.
- ఆయన చేసిన పెళ్లి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్స్‌లో భాగంగా, పెళ్లి గురించి అడగగా.. ప్రభాస్ పెళ్లి చేసుకున్న మరుసటి రోజు తాను పెళ్లి చేసుకుంటానని సరదాగా సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం, ప్రమోషన్స్
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది.
పెళ్లిపై నవీన్ చమత్కార సమాధానం
మిక్కీ జే మేయర్(Mickey J Meyar) మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ పై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూ మూవీపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన “పెళ్లి రిసెప్షన్” ఈవెంట్‌లో పాల్గొన్న నవీన్ పొలిశెట్టి మీడియా వారు అడిగిన ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలు ఇచ్చారు.
ప్రభాస్ పేరు చెప్పడంతో వైరల్ అయిన కామెంట్స్
పెళ్లి గురించి ఎప్పటి నుంచో వస్తున్న వార్తలను ఎప్పుడు నిజం చేస్తారు? అని మీడియా అడగగా.. “ప్రభాస్ ఏ రోజైతే పెళ్లి చేసుకుంటారో, ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను పెళ్లి చేసుకుంటా” అంటూ ఫన్నీగా జవాబు ఇచ్చారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా నవ్వసాగారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నవీన్ పొలిశెట్టి తన వివాహంపై ఇచ్చిన ఈ సరదా సమాధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌కు లింక్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇది సినిమా ప్రమోషన్స్‌కు కూడా కలిసొచ్చిందని చెప్పొచ్చు.


