|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నవాబ్ కేఫ్: చాయ్‌వాలా స్టోరీతో శివ కందుకూరి బ్లాక్‌బస్టర్ హిట్! టాక్ ఏంటంటే?

Published: 20-02-2026, 5:05 AM
నవాబ్ కేఫ్: చాయ్‌వాలా స్టోరీతో శివ కందుకూరి బ్లాక్‌బస్టర్ హిట్! టాక్ ఏంటంటే?
  • శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా ‘నవాబ్ కేఫ్’ విడుదల!
  • రాజీవ్ కనకాల నటనతో నవాబ్ కేఫ్ మరింత భావోద్వేగంగా ఉంది.
  • చాయ్ వాలా కథతో వచ్చిన ఈ సినిమాకి ప్రమోద్ దర్శకత్వం వహించారు.
  • హైదరాబాద్ చాయ్ సంస్కృతిని ప్రతిబింబించే కథాంశం!

శివ కందుకూరి హీరోగా నటించిన ‘నవాబ్ కేఫ్’ మూవీ విడుదలైంది. చాయ్ వాలా కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం!

నవాబ్ కేఫ్ కథా నేపథ్యం

ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా, తేజు అశ్విని హీరోయిన్‌గా రూపొందిన మూవీ `నవాబ్‌ కేఫ్‌`. రాజీవ్‌ కనకాల, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి ప్రమోద్‌ హర్ష దర్శకత్వం వహించారు. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం నేడు శుక్రవారం(ఫిబ్రవరి 20న) విడుదలయ్యింది. మొదట ఈ మూవీకి టైటిల్‌ `ఛాయ్‌ వాలా` అనుకున్నారు. కానీ సెన్సార్‌ అభ్యంతరం తెలియజేయడంతో `నవాబ్‌ కేఫ్‌`గా మార్చారు. మరి ఛాయ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌ ఛార్మినార్‌ ప్రాంతంలో నవాబ్‌ కేఫ్‌ చాలా ఫేమస్‌. దానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంటుంది. వారసత్వంగా వచ్చిన ఈ టీ కేఫ్‌ని రంగనాథ్‌(రాజీవ్‌కనకాల) నిర్వహిస్తుంటాడు. ఆయన కొడుకు రాజా(శివ కందుకూరి)కి ఛాయ్‌ వాలా అని చెప్పుకోవడం ఇష్టం లేదు. ఇలా టీ అమ్ముకొని బతకడం కాకుండా అమెరికా వెళ్లి బాగా సంపాదించాలనుకుంటాడు. చదువు పెద్దగా అబ్బదు. నానా తంటాలు పడి బీటెక్‌ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఫారెన్‌ వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ సమయంలో రాజా పెదనాన్న కొడుకు కుమార్‌( చైతన్యకృష్ణ) ఎంట్రీ ఇస్తాడు. అతను బిగ్‌ షాట్‌. నవాబ్‌ కేఫ్‌పై కన్నుపడుతుంది. ఎలాగైనా దాన్ని దక్కించుకొని అక్కడ పెద్ద కాంప్లెక్స్ ప్లాన్‌ చేస్తాడు. అందుకోసం రాజా ద్వారా ఆ కేఫ్‌ని కొనాలని ప్లాన్‌ చేస్తాడు. భారీగా డబ్బు ఆఫర్‌ చేస్తాడు. రాజా దీనికి టెంప్త్ అవుతాడు. కేఫ్‌ ని అమ్మేద్దామని తండ్రితో గొడవపడతాడు. ఈ గొడవలో తండ్రిని కొన్ని అనరాని మాటలు అంటాడు. దీంతో హర్ట్ అయిన రంగనాథ్‌ చనిపోతాడు. మరి తండ్రి మరణంతో రాజాలో వచ్చిన మార్పేంటి? ఆ కేఫ్‌ గురుంచి ఆయన తెలుసుకున్న విషయాలేంటి? తండ్రి గురించి ఎలాంటి వాస్తవాలు తెలిశాయి? కేఫ్‌ని సొంతం చేసుకోవాలని ప్లాన్‌ చేసిన అన్న కుమార్‌ని ఎలా ఎదుర్కొన్నాడు? అందుకు తన ప్రియురాలు సఖీ(తేజు అశ్విని) ఎలా సపోర్ట్ చేసిందనేది మిగిలిన కథ.

శివ కందుకూరి నటన ఎలా ఉందంటే?

మనం ఉదయం నిద్రలేచినప్పట్నుంచి ఛాయ్‌ తాగనిదే రోజు స్టార్ట్ కాదు. టీ అనేది మనకు ఒక ఎమోషన్‌. సిటీస్‌లో అయితే  స్పెషల్‌ గా ఛాయ్‌ హోటల్స్ ఉంటాయి. అవి బాగా పాపులర్‌. అవి ఎంతో మంది ఒక సెంటిమెంట్‌, ఎమోషన్‌గా ఉంటుంది. అలాంటిది నాలుగు వందల ఏళ్ల నుంచి ఆ టీ షాప్‌ నడిపిస్తున్నారంటే దానికో చరిత్ర ఉంటుంది. దాని వెనుక ఆ కుటుంబానికి ఒక ఎమోషన్‌ ఉంటుంది. దాన్ని ఫ్యామిలీలో భాగంగా భావిస్తుంటారు. అలాంటిదే ఈ సినిమాలో రాజీవ్‌ కనకాల నిర్వహించే నవాబ్‌ కేఫ్‌. ఈ కేఫ్‌లో టీ తాగనిదే చాలా మంది రోజు స్టార్ట్ కాదు అనేలా ఉంటుంది. ఒత్తిడిలో ఉన్న ఎంతో మందికి ఈ ఛాయ్‌ ఒక రిలీఫ్‌ని, ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఆ ఛాయ్‌ గొప్పతనాన్ని, చేయాలనుకున్న పని గొప్పతనాన్ని, జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించి ముడిపెడుతూ ఈ మూవీని రూపొందించారు. మనవైన హెరిటేజ్‌కి సంబంధించిన వాటిని కాపాడుకోవాలని చెప్పే ప్రయత్నమే ఈ మూవీ. ప్రారంభం నుంచి సరదాగా సాగుతుంది. ఈ టీ చరిత్రని చెబుతూ, రంగనాథ్‌ దాన్ని ఎంత ఆరాధిస్తాడు. గొప్పగా భావిస్తాడనేది చెబుతూ, సినిమాపై ఆసక్తిని పెంచాడు. మరోవైపు హీరో ఇష్టాలను, ప్రేమని పరిచయం చేయడం, కాలేజీ సీన్లు, హీరోయిన్ తో లవ్‌ స్టోరీతో, మరోవైపు ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ కసిరెడ్డితో టైమ్‌ పాస్‌ చేయిస్తారు. అవన్నీ ఫన్నీగా సాగుతాయి. అమెరికా పోవాలనుకోవడం, కేఫ్‌ విషయంలో తండ్రితో గొడవపడటంతో సినిమా సీరియస్‌గా మారుతుంది. ఎమోషనల్‌ సైడ్‌ వెళ్తుంది. ఇంటర్వెల్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో హీరోలో వచ్చిన మార్పు, ఛాయ్‌ వాలాగా తాను నిరూపించుకోవడంపై సాగుతుంది. కొంత సీరియస్‌గా, మధ్యలో కొంత ఫన్నీగా రన్‌ అవుతుంది. ఎంగేజింగ్‌గా వెళ్తుంది. తల్లి అనారోగ్యం విషయంలో, వచ్చిన ట్విస్ట్, ఈ క్రమంలో చోటు చేసుకునే డ్రామా ఆకట్టుకుంటుంది. హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. ఇక తన నవాబ్‌ కేఫ్‌ కోసం హీరో చేసే పోరాటం బాగుంది. సినిమా సరదాగా సాగుతూనే ఓ వైపు తండ్రి గొప్పతనాన్ని, మరోవైపు టీ గొప్ప తనాన్ని చెప్పిన తీరు బాగుంది. కసిరెడ్డితో వచ్చే కామెడీ ట్రాక్‌, విలన్‌తో వచ్చే ట్రాక్‌ నవ్విస్తుంది. లవ్‌ స్టోరీ కూడా బాగానే ఉంది. అయితే సినిమా స్లోగా ఉంటుంది. రొటీన్‌గా స్టార్ట్ కావడం మైనస్‌గా చెప్పొచ్చు. కొంత స్లోగా ఉంటుంది. ఎమోషన్స్ ని ఇంకా బలంగా చూపించాల్సి ఉంది. డైలాగ్‌లు రొటీన్‌గానే ఉంటాయి. అక్కడ మరికొంత కొత్తగా ప్రయత్నించాల్సింది. క్లైమాక్స్ లో మరింత డ్రామా క్రియేట్‌ చేసి ముగించాల్సింది. డోస్‌ తగ్గినట్టుగా ఉంటుంది.  కామెడీపై మరింతగా వర్క్ చేయాల్సింది. హీరోయిన్‌ పాత్రని లవ్‌ ట్రాక్‌కే పరిమితం చేశారు. ఎమోషన్స్ పరంగా మరింత వర్క్ చేస్తే సినిమా ఇంకా బాగుండేది.

రాజా పాత్రలో శివ కందుకూరి బాగా యాప్ట్ గా నిలిచారు. బాగా మెప్పించే ప్రయత్నం చేశాడు. నటుడిగా చాలా బెటర్‌ అయ్యాడు. ఇంకా బెటర్‌ కావాల్సింది. సఖీ పాత్రలో తేజు అశ్విని బాగా చేసింది. కనిపించినంతసేపు ఆకట్టుకుంది. రంగనాథ్‌ గా రాజీవ్‌ కనకాల పాత్రలో జీవించాడు. అదరగొట్టాడు. కన్నీళ్లు పెట్టించాడు. కుమార్‌ పాత్రలో చైతన్య కృష్ణ సైతం మెప్పించాడు. ఆయనకు మంచి పాత్ర పడింది. కసిరెడ్డి కామెడీ ట్రాక్‌ ఫర్వాలేదు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

సినిమాలో ప్రధాన అంశాలు

ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యింది. అదే సినిమాని నిలబెడుతుంది. పాటలు, ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. సినిమాకి రిచ్‌నెస్‌ని తీసుకొచ్చింది. క్రాంతి వర్ల కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. విజువల్స్ కలర్‌పుల్‌గా ఉన్నాయి. పవన్‌ నరవ ఎడిటింగ్‌ పై మరింత ఫోకస్‌ పెట్టాల్సింది. దర్శకుడు ప్రమోద్‌ హర్ష మంచి సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. దాన్ని బాగా డీల్‌ చేశాడు. ఎమోషన్స్ కి, సెంటిమెంట్‌ని మేళవించి రూపొందించారు. ఇందులో కామెడీని జోడించిన తీరు బాగుంది. ఛాయ్‌కి సంబంధించిన ఎమోషన్‌,సందేశం బాగుంది. అదే సమయంలో వ్యక్తిగతంగానూ సక్సెస్‌కి సంబంధించి చూపించిన సీన్లు, చెప్పిన అంశాలు బాగున్నాయి. కాకపోతే కామెడీ, డ్రామా, ఎమోషన్స్ ని మరింత గ్రిప్పింగ్‌గా చూపిస్తే బాగుండేది. మంచి మనుషులు, మానవత్వానికి సంబంధించి చెప్పిన అంశాలు బాగున్నాయి.

మంచి మనుషులు, ఛాయ్‌వాలా గొప్పతనం తెలిపే మూవీ నవాబ్‌ కేఫ్‌.

నవాబ్ కేఫ్ మూవీ విశేషాలు చూశారు కదా! సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.