|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

100 కోట్ల నయనతార నివాసం: లోపలి దృశ్యాలు చూస్తే షాక్ అవుతారు! ఇంతటి రాజభవనమా?

Published: 12-01-2026, 7:30 AM
100 కోట్ల నయనతార నివాసం: లోపలి దృశ్యాలు చూస్తే షాక్ అవుతారు! ఇంతటి రాజభవనమా?
  • నయనతార చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో 100 కోట్ల విలువైన లగ్జరీ ఇంట్లోకి అడుగుపెట్టారు.
  • ఈ ఇంట్లో ప్రైవేట్ హోమ్ థియేటర్, స్టూడియో, జిమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
  • నయనతారకు హైదరాబాద్‌లో రెండు విల్లాలు, ముంబైలో ఒక అపార్ట్‌మెంట్ కూడా ఉన్నాయి.
  • సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రైవేట్ జెట్ కలిగిన ఏకైక నటిగా నయనతార గుర్తింపు పొందారు.

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో రూ.100 కోట్ల విలువైన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ ఇల్లు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడింది. ఆమె ఇతర ఆస్తుల గురించి కూడా తెలుసుకుందాం.

చెన్నైలో నయనతార కొత్త ఇల్లు

Nayanthara: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సొంత చేసుకున్న నయనతార గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు . సౌత్ ఇండస్ట్రీలోనే అందరికంటే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ వరుస ప్రాజెక్టులతో నయనతార బిజీగా గడుపుతున్నారు. ఇదివరకు సౌత్ సినిమాలలో మాత్రమే నటించే ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలోనూ పాన్ ఇండియా సినిమాలలో కూడా భాగమవుతున్న సంగతి తెలిసిందే. ఇంకా ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు పది నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న నయనతార భారీ స్థాయిలో ఆస్తులు కూడా సంపాదించారు.

ఇకపోతే ఇటీవల నయనతార చెన్నైలోనే పోయెస్ గార్డెన్ లో 100 కోట్ల విలువచేసే లగ్జరీ ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి పక్కనే నయనతార ఈ లగ్జరీ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఈ ఇల్లు అత్యంత విలాసవంతంగా అత్యధిక సౌకర్యాలతో నిర్మించి ఉంది.పోయెస్ గార్డెన్‌లో వీనస్ కాలనీలో 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఇంట్లో ప్రవేట్ హోమ్ థియేటర్, స్టూడియో, జిమ్ వంటి అధ్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడింది.

ఇంట్లో ఉన్న ప్రత్యేక సౌకర్యాలు

నయనతార, విగ్నేష్ అభిరుచులకు అనుగుణంగా ఈ ఇంటిని నిర్మించారు ఈ ఇంటి కోసం ఏకంగా 100 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. చెన్నైలో మాత్రమే కాకుండా హైదరాబాదులో కూడా నయనతార విలాసవంతమైన రెండు ప్రీమియర్ విల్లాలను కలిగి ఉన్నారు. అదేవిధంగా ముంబైలో కూడా ఒక ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. నయనతార సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా, బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ భారీ స్థాయిలో సంపాదిస్తున్నారు .ఈమె నికర ఆస్తులు విలువ సుమారు 200 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది .

మన శంకర్ వరప్రసాద్ తో హిట్టు…

నయనతార ఆస్తుల వివరాలు

సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రవైట్ జట్ కలిగిన ఏకైక నటిగా నయనతార గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలో స్థిరచరాస్తులను సంపాదించారని తెలుస్తోంది. నయనతార కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతార చిరంజీవి ప్రధాన పాత్రలలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాటు కేజిఎఫ్ నటుడు యష్ టాక్సిక్ సినిమాలో కూడా గంగా అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అలాగే గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నయనతార ఎంపిక అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నయనతారకు సంబంధించిన ఒక వీడియో విడుదల చేశారు అయితే ఇటీవల ఈ సినిమా నుంచి నయనతార తప్పుకుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

నయనతార తన నటనా జీవితంలో ఎన్నో విజయాలు సాధించడమే కాకుండా భారీగా ఆస్తులు కూడా సంపాదించారు. ఆమె విలాసవంతమైన జీవనశైలి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.