|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలీవుడ్‌లో నయనతార సునామీ! ఆ బ్లాక్ బస్టర్ తర్వాత మరో సంచలనానికి సిద్ధం!

Published: 07-03-2026, 9:05 AM
బాలీవుడ్‌లో నయనతార సునామీ! ఆ బ్లాక్ బస్టర్ తర్వాత మరో సంచలనానికి సిద్ధం!
  • పెళ్లైనా నయనతార జోరు తగ్గలేదు, వరుస సినిమాలతో బిజీగా ఉంది.
  • నయనతార ‘జవాన్’తో బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అందుకుంది, అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
  • బాలీవుడ్ నిర్మాణ సంస్థ మినీ ఫిల్మ్స్ నయనతారతో భారీ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతోంది.
  • మన్సీ బాగ్లా క్రియేటివ్ విజన్‌తో యాక్షన్ కథను సిద్ధం చేశారు, నయనతార అయితేనే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్‌లో మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘జవాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆమెకు ఇప్పుడు బాలీవుడ్ నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయట. ప్రముఖ నిర్మాణ సంస్థ మినీ ఫిల్మ్స్ ఆమెతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతోంది.

వివాహం తర్వాత కూడా నయనతార జోరు

Nayanthara: పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నయనతార (Nayanthara) స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. ఆమె వరుస సినిమాలతో దూసుకెళుతోంది. మొన్నటి వరకు లేడీ ఓరియంటెడ్ పాత్రలకే ఓకే చెప్పిన నయనతార, ఇప్పుడు ఇతర హీరోల చిత్రాలలో చేయడానికి కూడా రెడీ అంటోంది. ఆ క్రమంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu), ‘టాక్సిక్’ (Toxic) వంటి చిత్రాలలో ఆమె నటించింది. ఒక సౌత్‌లోనే కాకుండా, బాలీవుడ్‌లోనూ నయనతార చక్రం తిప్పుతోంది. ‘జవాన్’ (Jawan)తో బాలీవుడ్‌లోనూ బ్లాక్ బస్టర్ అందకున్న నయనతారకు అక్కడి నుంచి కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయనేలా టాక్ నడుస్తోంది. రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో సెన్సేషనల్ సక్సెస్‌ని నయనతార తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కన్నడ రాకింగ్ స్టార్ యష్ సరసన నటించిన ‘టాక్సిక్’ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

‘జవాన్’తో బాలీవుడ్‌లో నయన్ సక్సెస్

తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ మీడియా హౌస్ లేడీ సూపర్ స్టార్‌తో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే.. బాలీవుడ్‌లో కూడా నయనతారకు తిరుగులేనట్టే. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్ ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ హీరోయిన్లు, మరీ ముఖ్యంగా సక్సెస్ ఫుల్ హీరోయిన్లు ఇప్పుడు అరుదుగా మారిపోయారు. అందుకే సౌత్‌కు చెందిన నయనతారతో సినిమా చేసేందుకు ముంబైకి చెందిన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మినీ ఫిల్మ్స్ (Mini Films) నయనతారతో ఒక భారీ బడ్జెట్ కోసం సంప్రదింపులు జరుపుతోందనేలా సినీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నయనతారతో మినీ ఫిల్మ్స్ భారీ ప్రాజెక్ట్

గతంలో ‘ఫోరెన్సిక్’, ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ వంటి విభిన్నమైన, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మించిన మినీ ఫిల్మ్స్, ఇప్పుడు తమ తదుపరి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత మన్సీ బాగ్లా (Mansi Bagla) తన క్రియేటివ్ విజన్‌తో భారీ యాక్షన్‌ నిండిన స్ట్రాంగ్ క్యారెక్టర్ డ్రివెన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు నయనతార అయితేనే పర్ఫెక్ట్ అని వారు భావిస్తున్నారట. నయనతారకు ఉన్న గ్రేస్, సీరియస్ రోల్స్‌ను పండించే సత్తా, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ అవుతాయని నిర్మాత మన్సీ బాగ్లా భావిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందనేలా ముంబై మీడియాలో కూడా వార్తలు రన్ అవుతున్నాయి. నయనతార వరకు కథ వెళ్లిందని, ఆమె ఓకే అంటే సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం అన్నట్లుగా మిలీ ఫిల్మ్స్ యూనిట్ వేచి చూస్తోందని తెలుస్తోంది. చూద్దాం.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..

మొత్తానికి నయనతార బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే, ఆమె కెరీర్‌కు మరింత ఊపు వచ్చినట్టే. వేచి చూడాల్సిందే ఏం జరుగుతుందో.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.