
📌 Key Points
- నయనతారకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఏకంగా మూడు పురస్కారాలు, సరికొత్త రికార్డు!
- ‘అరమ్’ చిత్రంలో కలెక్టర్ మతివధనిగా అద్భుత నటనకు ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న నయన్.
- నయనతార నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ నిర్మించిన ‘నెట్రికన్’, ‘కూజాంగల్’ చిత్రాలకు కూడా అవార్డులు!
- ఏప్రిల్ 23న విడుదల కాబోతున్న ‘పేట్రియాట్’ మూవీలో నయన్ కీలక పాత్ర, అభిమానుల్లో భారీ అంచనాలు.
లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఏకంగా మూడు అవార్డులు గెలుచుకొని సంచలనం సృష్టించారు. ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మూడు అవార్డులు గెలుచుకున్న నయన్
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నయనతార (Nayanthara)రేంజ్ ఏంటో మరోసారి నిరూపితమైంది. తాజాగా ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో నయన్ ఏకంగా మూడు పురస్కారాలను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించారు. 2017లో వచ్చిన ‘అరమ్’ (Aram)(తెలుగులో కర్తవ్యం) చిత్రంలో కలెక్టర్ మతివధనిగా ఆమె కనబరిచిన అద్భుత నటనకు గాను ఉత్తమ నటి అవార్డు లభించింది. దీనితో పాటు ఆమె నిర్మాణ సంస్థ ‘రౌడీ పిక్చర్స్’ నిర్మించిన ‘నెట్రికన్’, ‘కూజాంగల్’ చిత్రాలకు కూడా అవార్డులు దక్కడం విశేషం. ఒకేసారి మూడు రాష్ట్ర అవార్డులు తన ఖాతాలోకి చేరడంపై నయనతార ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా అవార్డులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘నేను నిజంగా ఆశీర్వదించబడ్డాను. ఒక నటిగా ‘అరమ్’ చిత్రానికి, నిర్మాతగా ‘నెట్రికన్’, ‘కూజాంగల్’ చిత్రాలకు గౌరవం దక్కడం గర్వంగా ఉంది’’ అని తన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్త తెలియగానే అభిమానులు ఆమె పట్టుదలకు, కథల ఎంపిక విదానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇదే అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం నయనతార వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర అవార్డుల విజయం ఆమె కెరీర్‌కు మరింత బలాన్నిచ్చింది. ఏప్రిల్ 23న విడుదల కాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘పేట్రియాట్’ మూవీలోనూ నయన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ‘టాక్సిక్’లోనూ భాగం అయింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కాబోతుంది.
‘అరమ్’ చిత్రానికి ఉత్తమ నటిగా పురస్కారం
నిర్మాతగానూ సత్తా చాటిన నయనతార
నయనతార వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


