|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నయనతార, త్రిష విడిపోవడానికి కారణమైన ఆ ఒక్క హీరో ఎవరు? అసలు నిజం బట్టబయలు!

Published: 12-02-2026, 9:05 AM
నయనతార, త్రిష విడిపోవడానికి కారణమైన ఆ ఒక్క హీరో ఎవరు? అసలు నిజం బట్టబయలు!
  • నయనతార, త్రిష రెండు దశాబ్దాలుగా తమిళ చిత్రసీమలో అగ్ర హీరోయిన్లు.
  • విజయ్ నటించిన ‘కురువి’ సినిమాలో హీరోయిన్ అవకాశం కోసం వీరి మధ్య పోటీ నెలకొంది.
  • ఈ వివాదం కారణంగా నయనతార, త్రిష కొంతకాలం మాట్లాడుకోలేదని వార్తలు వచ్చాయి.
  • ప్రస్తుతం వీరిద్దరూ కలిసిపోయారని వెకేషన్ ఫోటోల ద్వారా స్పష్టమైంది.

తమిళ చిత్రసీమలో అగ్ర హీరోయిన్లుగా కొనసాగుతున్న నయనతార, త్రిష ఒకప్పుడు మంచి స్నేహితులు. అయితే విజయ్ నటించిన ‘కురువి’ సినిమా కారణంగా వీరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఆ తరువాత వీరు మళ్ళీ కలిశారు.

నయనతార, త్రిష మధ్య వైరం వెనుక అసలు కథ

Nayanthara vs Trisha: తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న హీరోయిన్లు నయనతార, త్రిష. ఇద్దరూ తమ ప్రతిభతో, కష్టపడి పనిచేసే స్వభావంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హోదాను నిలబెట్టుకున్నారు.

ఒకప్పుడు వీరిద్దరూ మంచి స్నేహితులని సినీ వర్గాల్లో చెబుతూ ఉండేవారు. షూటింగ్‌ల సమయంలో కలుసుకుని మాట్లాడుకునేవారు. అయితే కొన్ని సంవత్సరాల పాటు వీరిద్దరూ మాట్లాడుకోలేదనే వార్తలు అప్పట్లో తెగ వినిపించాయి. ఆ దూరానికి కారణం ఏంటన్నది అప్పట్లో పెద్ద వార్తగా వైరల్ అయింది.

సినీ వర్గాల్లో ప్రచారంలోకి వచ్చిన సమాచారం ప్రకారం, ఆ సమయంలో విజయ్ హీరోగా నటించిన కురువి సినిమా ఈ వివాదానికి కారణమని చెప్పుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటించాలనే విషయంలో మొదట ఇద్దరి పేర్లు వినిపించాయి. చివరికి ఆ అవకాశం త్రిషకు దక్కింది.

కురువి సినిమాతో మొదలైన వివాదం

ఈ నిర్ణయం తర్వాత నయనతార కొంతకాలం త్రిషతో మాట్లాడలేదని, అందుకే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎవ్వరూ స్పష్టంగా స్పందించలేదు. కానీ వీళ్ళిద్దరికీ ఒకరు అంటే ఒకరు పడదు అని మాత్రం అప్పుడప్పుడు నయనతార ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పేది. ఇలా వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ వార్ చాలా రోజులే జరిగింది.

అయితే కాకరమైన ఈ ఇద్దరు నటీమణులు మళ్లీ కలిసిపోయారని వార్తలు వచ్చాయి. ఇక ఇది నిజం చేస్తూనే వీళ్ళిద్దరూ ఈమధ్య వెకేషన్ లో ఉన్న ఫోటోలు షేర్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చారు. దీంతో వీళ్ళిద్దరూ కలిసిపోయారని అభిమానుల సైతం ఆనందించారు.

ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్‌పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటే, త్రిష కూడా వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది.

మళ్ళీ కలిసిన నయనతార, త్రిష

మొత్తం పైన నయనతార.. త్రిష.. మధ్య వచ్చిన దూరం గురించి ఎన్నో కథలు వినిపించినా, ఇప్పుడు మాత్రం ఇద్దరూ మంచి సంబంధాలతోనే ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఇలాగే సంతోషంగా కలిసి కనిపించాలని కోరుకుంటున్నారు.

నయనతార, త్రిష మధ్య గతంలో కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం వారి మధ్య సఖ్యత నెలకొంది. ఇద్దరూ తమ కెరీర్‌పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. వారి అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.