|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

10 లక్షల హ్యాండ్ బ్యాగ్ తో పాటు.. నయనతార కళ్లు చెదిరే కాస్ట్లీ కలెక్షన్స్ ఏంటో తెలుసా?

Published: 19-11-2025, 6:54 AM
10 లక్షల హ్యాండ్ బ్యాగ్ తో పాటు.. నయనతార కళ్లు చెదిరే కాస్ట్లీ కలెక్షన్స్ ఏంటో తెలుసా?

నయనతార ‘లేడీ సూపర్ స్టార్’గా వెలుగొందడమే కాకుండా, తన విలాసవంతమైన జీవనశైలితో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కోట్ల విలువైన ఇళ్లు, లగ్జరీ కార్లు, డైమండ్ ఆభరణాలు, ఖరీదైన హ్యాండ్‌బ్యాగులు వంటి ఆమె అబ్బురపరిచే కలెక్షన్లను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Key Points

1

చెన్నై, హైదరాబాద్, కేరళలో నయనతారకు కోట్ల విలువైన విల్లాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

2

BMW, మెర్సిడెస్, ఆడి వంటి ఖరీదైన కార్లు, వజ్రాలు, ప్లాటినం నగలు ఆమె కలెక్షన్‌లో.

4

రౌడీ పిక్చర్స్, దుబాయ్ వ్యాపారాలతో కోట్లల్లో పెట్టుబడులు పెడుతున్న లేడీ సూపర్ స్టార్.

కోట్ల విలువైన నయనతార ఇళ్లు

సౌత్ ఇండియా సినిమాల్లో ‘లేడీ సూపర్ స్టార్’గా వెలుగు వెలుగుతోంది నయనతార.  తన నటనతో పాటు జీవనశైలితో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. చూడటానికి సింపుల్‌గా కనిపించినా, వ్యక్తిగత జీవితంలో లగ్జరీని ఎక్కువగా ఇష్టపడుతుంది నయన్.

నయనతారకు చెన్నై, హైదరాబాద్, కేరళలో కోట్ల విలువైన ఇళ్లు ఉన్నాయి. పని వల్ల సొంత ఊరి కన్నా చెన్నై, హైదరాబాద్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుంది స్టార్ హీరోయిన్. అందుకే అక్కడ హై-ఎండ్ అపార్ట్‌మెంట్లు, విల్లాలు కొన్నది.

చెన్నైలోని పోయెస్ గార్డెన్, ఆళ్వార్‌పేట్ లాంటి ప్రాంతాల్లో ఆమెకు ఇళ్లు ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రముఖులు నివసించే  పోయెస్ గార్డెన్ ఇంటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచన. ఇక ఈ హౌస్ లో  ఇంటీరియర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. కేరళలో కొన్న విల్లా, ప్రకృతి మధ్య ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు.

లగ్జరీ కార్లు, ఖరీదైన నగలు, బ్యాగులు

నయనతార వాడే కార్లు చాలావరకు లగ్జరీవే. BMW 7 సిరీస్, మెర్సిడెస్-బెంజ్ GLS, ఆడి Q7 లాంటి హై-ఎండ్ కార్ల నయన్ను గ్యారేజ్ లో ఉన్నాయి. కొన్నిసార్లు రేంజ్ రోవర్ లేదా స్పోర్ట్స్ కార్లలో నయనతార  ప్రయాణిస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

నయనతారకు నగలంటే చాలా ఇష్టం. డైమండ్, ప్లాటినం, గోల్డ్‌లో చాలా వెరైటీ కలెక్షన్లు ఆమె దగ్గర ఉన్నాయి. రెడ్ కార్పెట్ ఈవెంట్స్, ఫోటోషూట్లలో ఆమె ధరించే నగలు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. పెళ్లిలో ఆమె ధరించిన నగలు చాలా రోజులు చర్చనీయాంశమయ్యాయి.

నయనతార ఫ్యాషన్ ఎంపికలు కూడా హై-ఎండ్‌లోనే ఉంటాయి. గూచీ, డియోర్, లూయిస్ విట్టన్ లాంటి బ్రాండ్ల హ్యాండ్‌బ్యాగ్‌లు, దుస్తులు వాడుతుంది. కొన్ని బ్యాగుల ధర 3 లక్షల నుంచి 10 లక్షల పైనే ఉంటుందని అంచనా.

వ్యాపారాల్లో నయనతార భారీ పెట్టుబడులు

నయనతార  ఇంట్లో వాడే టెక్ గాడ్జెట్స్ కూడా హై-క్వాలిటీవే. ఐఫోన్ ప్రో మాక్స్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ మ్యాక్‌బుక్ లాంటివి ఆమె దగ్గర ఉండటం కామన్. ఇంటి ఇంటీరియర్ స్మార్ట్ హోమ్ ఫీచర్లతో ఉంటుందని అంటారు.

అలాగే, రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా నయనతార, విఘ్నేష్ శివన్ కోట్ల రూపాయల ప్రాజెక్టులలో పెట్టుబడి పెడుతున్నారు. సినిమాలు నిర్మిస్తూనే.. దుబయ్ లో నయనతార సోదరుడి కంపెనీలలో ఆమె పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇలా కోట్లలో సంపాదిస్తూ.. లగ్జరీ లైఫ్ ను ఆమె లీడ్ చేస్తోంది.

నయనతార కేవలం నటిగా మాత్రమే కాకుండా, తెలివైన పెట్టుబడిదారుగానూ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆమె కళ్లు చెదిరే లగ్జరీ జీవనశైలికి ఆమె కఠోర శ్రమ, వ్యాపార దక్షతనే కారణం. ఇది ఆమె సూపర్ స్టార్ స్టేటస్‌కు నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.