|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NBK 111: బాలయ్య బాబు విధ్వంసం.. ముంబై డాన్ గా బాలయ్య.. గోపీచంద్ మలినేని మాస్టర్ ప్లాన్!

Published: 24-01-2026, 4:35 AM
NBK 111: బాలయ్య బాబు విధ్వంసం.. ముంబై డాన్ గా బాలయ్య.. గోపీచంద్ మలినేని మాస్టర్ ప్లాన్!
  • NBK 111లో బాలకృష్ణ ముంబై డాన్ గా నటించనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు.
  • ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
  • ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని సమాచారం.
  • బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇది ఒక భారీ హిట్ అవుతుందని అభిమానుల నమ్మకం.

నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం NBK 111తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య ముంబై డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాలయ్య బాబు నెక్స్ట్ మూవీ అప్డేట్

NBK 111: నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. కెరీర్ లో ఎన్నడూ లేని విదంగా వరుసగా క్రేజీ సినిమాలను ఒకే చేస్తూ ఉంటాడు. ఇక ఇటీవల ఆయన డాకు మహారాజ్ లాంటి సూపర్ తరువాత అఖండ 2 సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో, నందమూరి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే, ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు NBK 111 సినిమాను అనౌన్స్ చేశాడు.

మాస్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేనితో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేశాడు బాలకృష్ణ. పీరియాడికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాను అధికారికంగా కూడా స్టార్ట్ అయ్యింది. కానీ, ఏమైందో తెలియదు ఆ భారీ ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో, నందమూరి(NBK 111) ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బడ్జెట్ కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అనే వార్తలు వినిపించాయి. ఇక అప్పటినుంచి ఈ ప్రాజెక్టు కోసం కొత్త కథను సెట్ చేసే పనిలో పడ్డాడు గోపీచంద్ మలినేని.

గోపీచంద్ మలినేని మాస్టర్ ప్లాన్

తాజా సమాచారం మేరకు, ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫుల్ కథను సెట్ చేశాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణను ఎలా చూడాలని అనుకుంటున్నారో అదే రేంజ్ లో ఈ సినిమాలో కనిపిస్తాడట. అది కూడా మాఫియా డాన్ గా. ముంబై బ్యాక్డ్రాప్ లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తాడట గోపిచంద్ మలినేని. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రానుందట.

ముంబై బ్యాక్ డ్రాప్ లో బాలయ్య విధ్వంసం

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలుకునుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయాని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట. మరి అఖండ 2తో ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసిన బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాతో ఏమేరకు ఆకట్టుకున్నాడు అనేది చూడాలి.

బాలకృష్ణ ముంబై డాన్ గా ఎలా కనిపించబోతున్నారో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని విషయాలు తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.