
📌 Key Points
- నటి నిధి అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలో చేతిపై రాసిన విషయం సోషల్ మీడియాలో వైరల్.
- ఒక ట్విట్టర్ యూజర్ ప్రశ్నతో ఆమె చేతిలోని రహస్యం బయటపడింది.
- ‘మళ్లీ దొరికిపోయానే ఊప్స్’ అంటూ నిధి అగర్వాల్ నవ్వుతూ తప్పు ఒప్పుకుంది.
- ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
నటి నిధి అగర్వాల్ తన చేతిపై రాసుకున్న రహస్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక అభిమాని గమనించడంతో ‘మళ్లీ దొరికిపోయా’ అంటూ నటి నవ్వుతూ ఒప్పుకుంది. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్న నిధి, తన చేతిలో ఏం రాసుకుందో బయటపెట్టకపోవడం ఆసక్తిగా మారింది.
నిధి అగర్వాల్ చేతిలో రాసిందేమిటి?
Nidhhi Agerwal: సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల తార నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ మారుతీ(Maruthi ) దర్శకత్వంలో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ వేదికగా చాలా ఘనంగా నిర్వహించారు. ఇందులో చీరకట్టులో అందాలు ఆరబోస్తూ అందరినీ మెస్మరైజ్ చేసింది నిధి అగర్వాల్. అంతేకాదు నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి? ఏ స్థాయిలో ఉండాలి? అనే ప్రశ్నలతో ప్లకార్డులు కూడా పట్టుకుని తిరిగారు అభిమానులు.
అలాంటి ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. లవ్ సింబల్ ని తన చేతులతో చూపిస్తున్న ఒక ఫోటోని షేర్ చేసింది. అందులో ఆమె అరచేతిలో ఏదో రాసి ఉంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ఒక ట్విట్టర్ యూజర్ దానిని షేర్ చేస్తూ.. “మీ చేతిలో రాసి ఉంది ఏమిటది? క్యూరియాసిటీతో అడగకుండా ఆగలేక పోతున్నాను.. దీనిని చూస్తుంటే చిన్నప్పుడు నేను అరచేతిలో రాసుకున్న విషయాలు గుర్తుకొస్తున్నాయి ” అంటూ ఒక ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. అయితే దీనిని రీ ట్వీట్ చేస్తూ నిధి అగర్వాల్ “అయ్యో.. మళ్లీ దొరికిపోయానే ఊప్స్ “అంటూ కామెంట్ చేసింది. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మొత్తానికైతే మళ్లీ దొరికిపోయాను అంటూ తప్పు ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తన అరచేతిలో ఏం రాసుకుంది అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.
‘మళ్లీ దొరికిపోయా’.. నిధి రియాక్షన్!
నిధి అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే.. ది రాజా సాబ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యాక తన తదుపరి ప్రాజెక్టుల గురించి వెల్లడిస్తాను అని కూడా చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. ప్రస్తుతం తెలుగులో మూడు ప్రాజెక్టులు చేస్తున్నట్లు చెప్పిన ఈమె అలాగే తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కానీ దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది నిధి అగర్వాల్ . అలాగే రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రంపై పలు ఆసక్తికర కామెంట్లు చేసిన నిధి అగర్వాల్.. ప్రభాస్ గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేసింది . ముఖ్యంగా తన కెరియర్లో ప్రభాస్ లాంటి మంచి మనసున్న వ్యక్తిని చూడలేదని, ఆయన ఇచ్చే అతిథ్యానికి తాను ఫిదా అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రభాస్ లాంటి మంచి వ్యక్తులతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని కూడా తెలిపింది నిధి అగర్వాల్.
నిధి అగర్వాల్ ప్రస్తుత ప్రాజెక్టులు
Oops got caught again 🙈 #AskNidhhi #TheRajaSaab https://t.co/TEkLhKxxAJ
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2025
మొత్తానికి నిధి అగర్వాల్ చేతిపై రాసుకున్న విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తప్పు ఒప్పుకున్నప్పటికీ, ఆ రహస్యాన్ని మాత్రం బయటపెట్టకపోవడంతో అభిమానుల్లో మరింత ఉత్సుకత పెరిగింది.


