|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్పిరిట్‌లో ప్రభాస్‌తో గోపీచంద్ ఢీ: వర్షం సీన్ రిపీట్ అయితే థియేటర్లు షేక్!

Published: 23-01-2026, 4:05 AM
స్పిరిట్‌లో ప్రభాస్‌తో గోపీచంద్ ఢీ: వర్షం సీన్ రిపీట్ అయితే థియేటర్లు షేక్!
  • ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 25న విడుదల కానుంది.
  • ఈ చిత్రంలో డాన్ లీ విలన్ పాత్రలో నటిస్తారని గతంలో వార్తలు వచ్చాయి.
  • ప్రభాస్ స్నేహితుడు గోపీచంద్ ‘స్పిరిట్’లో విలన్‌గా నటించే అవకాశం ఉందని కొత్త సమాచారం.
  • గతంలో ప్రభాస్, గోపీచంద్ కలిసి ‘వర్షం’ సినిమాలో నటించారు.

ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో విలన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. డాన్ లీ కాకుండా గోపీచంద్ విలన్‌గా నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

స్పిరిట్ సినిమాలో విలన్ ఎవరు?

Spirit Movie: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వర్షం ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన 4 పాన్ ఇండియా సినిమాలకు ప్రస్తుతం కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో రెండు సినిమాలు షూటింగ్ పనులను శర వేగంగా జరుపుకుంటున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా దాదాపు 60% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో కూడా స్పిరిట్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని సందీప్ రెడ్డి ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని 2027 మార్చి 25వ తేదీ విడుదల చేయబోతున్నట్టు విడుదల తేదీని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని ఇదివరకే విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు డాన్ లీ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి . అయితే తాజాగా మరొక వార్త కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా డాన్ లీ(Don Lee) కాదని, టాలీవుడ్ హీరో ప్రభాస్ ను ఢీ కొట్టబోతున్నారు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి.

గోపీచంద్ విలన్ అయితే ఎలా ఉంటుంది?

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ను ఢీ కొట్టబోతున్న హీరో ఎవరనే విషయానికి వస్తే.. ఆయన మరెవరో కాదు ప్రభాస్ ప్రాణ స్నేహితుడు మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)అని తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ కనిపించబోతున్నారు అంటూ మరొక వార్త తెరపైకి రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే థియేటర్లు తగలబడి పోవాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వర్షం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా గోపీచంద్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మరోసారి వీరిద్దరూ స్పిరిట్ సినిమాలో పోటీ పడబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటిస్తుంటే డాన్ లీ ఏ పాత్రలో కనిపించబోతున్నారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే సందీప్ రెడ్డి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ గా త్రిప్తి దిమ్రి నటించగా, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో టి సిరీస్ బ్యానర్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ప్రభాస్, గోపీచంద్ కాంబినేషన్ రిపీట్!

మొత్తానికి స్పిరిట్ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటిస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.