|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వరుడిపై నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు: ఫ్యాన్స్ ప్రపోజల్ పై షాకింగ్ రియాక్షన్!

Published: 28-12-2025, 2:28 AM
వరుడిపై నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు: ఫ్యాన్స్ ప్రపోజల్ పై షాకింగ్ రియాక్షన్!
  • ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ కు ఫ్యాన్స్ నుండి పెళ్లి ప్రపోజల్.
  • కాబోయే వరుడిపై నిధి అగర్వాల్ కీలక వ్యాఖ్య: ‘ప్రేమించే మనసు ఉంటే చాలు’.
  • నిధి అగర్వాల్ కు వచ్చిన ప్లకార్డులను చూసి ప్రభాస్ సైతం ఆశ్చర్యపోయారు.
  • ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ 2025 సంక్రాంతికి విడుదల.

నటి నిధి అగర్వాల్ ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల నుండి ఊహించని వివాహ ప్రపోజల్ అందుకున్నారు. ప్లకార్డులతో పెళ్లి ప్రశ్నలు అడిగిన ఫ్యాన్స్ కు, కాబోయే వరుడిపై ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు ప్రభాస్ కూడా నోరెళ్లబెట్టారు.

నిధి అగర్వాల్ కు ఫ్యాన్స్ వినూత్న ప్రపోజల్

Nidhhi Agerwal:ఈమధ్య కాలంలో కొంతమంది హీరోయిన్స్ వయసులో ఉండగానే పెళ్లి చేసుకుంటుంటే.. మరికొంతమంది పెళ్లి వయసు దాటిపోయినా వివాహం అనే మాట ఎత్తడం లేదు. కానీ మరి కొంతమంది హీరోయిన్స్ ను పెళ్లి చేసుకోవడానికి అటు అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా నిధి అగర్వాల్ కి ప్లకార్డులతో పెళ్లి ప్రపోజల్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ వేదికగా ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ప్లకార్డులు పట్టుకొని..” నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి? ఎంత ఆస్తి ఉండాలి? ఎలా ఉండాలి?” అనే ప్రశ్నలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ ప్లకార్డులు చూసి హీరో ప్రభాస్ కూడా ఆశ్చర్యపోతూ నోరెళ్లబెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే విషయాన్ని యాంకర్ సుమ నిధి వద్ద ప్రస్తావించగా ఆమె మాట్లాడుతూ..” ప్రేమించే మనసు ఉంటే చాలు” అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే వేదికపై నిధి అగర్వాల్ మాట్లాడిన తర్వాత “ఆమె చీరలోనే అన్ని నిధులు ఉన్నాయి” అంటూ సుమ అనడంతో ఈవెంట్ మొత్తం విజిల్స్ తో మారుమోగిపోయింది.

వరుడిపై నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

నిధి అగర్వాల్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ చిత్రాలలో ఎక్కువగా పని చేసే ఈమె.. మిస్ దివా యూనివర్స్ 2014లో పాల్గొనింది. ఆ తర్వాత హిందీ చిత్రం మున్నా మైకేల్ తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాతో ఉత్తమ మహిళ అరంగేట్రం విభాగంలో జీ సినీ అవార్డును కూడా అందుకుంది. ఇకపోతే 2018 లో వచ్చిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె 2021లో ఈశ్వరన్ అనే సినిమాతో తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఉత్తమ మహిళ అరంగేట్రం కోసం సైమా అవార్డుకు కూడా నామినేషన్ దక్కించుకుంది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో ఊహించని విజయం సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ప్రస్తుతం ప్రభాస్ తో ది రాజా సాబ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతోంది.

ది రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈమె.. తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ది రాజా సాబ్ సినిమా విడుదలైన తర్వాత నా ప్రాజెక్ట్ ల గురించి వెల్లడిస్తాను. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాను. అలాగే తమిళ్ , హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది.

‘ది రాజా సాబ్’ ఈవెంట్ లో హైలైట్స్

నిధి అగర్వాల్‌కు వచ్చిన ఈ వినూత్న ప్రపోజల్, ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘ది రాజా సాబ్’ సినిమాతో పాటు నిధి వ్యక్తిగత విషయాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.