|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లి వద్దే వద్దు! నలుగురు పిల్లలు కావాలంటున్న నిధి అగర్వాల్ సంచలన ప్రకటన!

Published: 22-01-2026, 3:35 AM
పెళ్లి వద్దే వద్దు! నలుగురు పిల్లలు కావాలంటున్న నిధి అగర్వాల్ సంచలన ప్రకటన!
  • నిధి అగర్వాల్‌కు పెళ్లిపై ఆసక్తి లేదు, కానీ నలుగురు పిల్లలు కావాలని ఉంది.
  • సుస్మితాసేన్ లాగా పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నా, పరిస్థితులు సహకరించలేదు.
  • చెల్లెలిపై ప్రేమతో పిల్లలంటే మరింత ఇష్టం పెరిగిందని నిధి తెలిపింది.
  • 14 ఏళ్ల వయసులోనే ఆల్కహాల్ తాగాలని కోరిక కలిగిందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకు ఇప్పుడప్పుడే పెళ్లిపై ఆసక్తి లేదని, కానీ నలుగురు పిల్లలు కావాలని మనసులోని కోరికను బయటపెట్టింది. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లిపై నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nidhi Agerwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వగా మరి కొంతమంది కెరియర్ పై ఫోకస్ పెట్టి పెళ్లి వయసు వచ్చిన పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారిలో నటి నిధి అగర్వాల్ కూడా ఒకరు. ప్రస్తుతం  వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న నిధి ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది.. ఇకపోతే నిధి అగర్వాల్ మాత్రం ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా పెళ్లి ప్రస్తావన రావడంతో నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఇప్పుడప్పుడే తనుకు పెళ్లిపై ఆసక్తి లేదని తన పెళ్లికి ఇంకా టైం ఉందని తెలియజేశారు. పెళ్లి పక్కన పెడితే పిల్లలు విషయంలో మాత్రం తాను ఆగలేకపోతున్నానని తనకు పిల్లలు కావాలని ఉంది అంటూ మనసులో కోరికను బయటపెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తనకు నలుగురు పిల్లలు కావాలంటూ నిధి అగర్వాల్ తన మనసులో కోరికను బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి ఇంట్రెస్ట్ లేదు కానీ పిల్లలు కావాలని కోరుకోవడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దత్తత గురించి నిధి ఆలోచనలు

తనకు ఎప్పుడు పిల్లల గురించే ఆలోచన వస్తుందని పెళ్లి కంటే ముందుగా ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితసేన్ మాదిరిగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలని భావించాను. కానీ పిల్లలను పెంచడం అంటే అంత సులువైన విషయం కాదని, మనం మరో ప్రపంచంలోకి వెళ్లాల్సి ఉంటుందని, ప్రస్తుతం తాను ఉన్న ఈ పరిస్థితులకు అది సాధ్యం కాదని నిధి అగర్వాల్ తెలిపారు. చిన్నప్పటినుంచి కూడా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇలా పిల్లలపై ఇష్టం కలగడానికి తన చెల్లెలే కారణమని, తన చెల్లెలు తనకంటే వయసులో ఏడు సంవత్సరాలు చిన్నదని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య ఏడు సంవత్సరాల గ్యాప్ ఉండటంవల్ల తనని నేను ఒక చెల్లి మాదిరి కాకుండా సొంత కూతురిలాగా పెంచుకున్నానని తెలియజేశారు.

పిల్లలపై ప్రేమకు కారణం ఇదేనన్న నిధి

చిన్నప్పటినుంచి తన చెల్లెలిని గారాబంగా పెంచడంతో పిల్లలపై ఇష్టం మరింత పెరిగింది అంటూ ఈమె అసలు విషయాన్ని వెల్లడించారు. గత రెండు రోజుల క్రితం 14 సంవత్సరాల వయసుకే ఆల్కహాల్ తాగాలని కోరిక కలిగిందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లి పై ఆసక్తి లేదు కానీ పిల్లలు కావాలి అంటూ మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి నిధి అగర్వాల్ పెళ్లిపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ పిల్లల గురించి తనకున్న కోరికను బయటపెట్టింది. దీంతో ఆమె ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.