|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Niharika : లేడీ డైరెక్టర్ తో నిహారిక సినిమా.. నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ఓపెనింగ్.. హిట్స్ తో ఫామ్ లో ఉన్న హీరో – హీరోయిన్ జంటగా..

Published: 02-07-2025, 10:47 AM
Niharika : లేడీ డైరెక్టర్ తో నిహారిక సినిమా.. నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ఓపెనింగ్.. హిట్స్ తో ఫామ్ లో ఉన్న హీరో – హీరోయిన్ జంటగా..

నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై కొత్త సినిమాను ప్రారంభించింది. లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ తారిక జంటగా నటిస్తున్నారు. నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్ లాంటి దర్శకులు ఈ సినిమా ఓపెనింగ్ కు హాజరయ్యారు.

Key Points

1

లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వంలో నిహారిక సినిమా ప్రారంభం.

2

సంగీత్ శోభన్, నయన్ తారిక హీరో హీరోయిన్లుగా నటించనున్నారు.

4

హైదరాబాద్ లో జూలై 15 నుండి షూటింగ్ ప్రారంభం.

సినిమా ఓపెనింగ్ విశేషాలు

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమాని మొదలుపెట్టింది. లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలను అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించారు.

ఈ సినిమా ఓపెనింగ్ కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట గెస్టులుగా హాజరయ్యారు. మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ – ఆయ్ ఫేమ్ హీరోయిన్ నయన్ సారిక లపై నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్ లో మొదలు అవ్వనుంది.

నటీనటుల వివరాలు

ఫాంటసీ, కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు పెద్ద హిట్ అవ్వడమే కాకుండా అవార్డులు కూడా గెలుచుకుంది. ఇప్పుడు రెండో సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

షూటింగ్ ప్రారంభ తేదీ

నిహారిక నిర్మాణంలో వస్తున్న ఈ కొత్త సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. ఫాంటసీ, కామెడీ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.