
📌 Key Points
- నిహారిక కొత్త సినిమా ‘రాకాసా’ ప్రమోషన్లలో ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి ప్రశ్నలు.
- పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత చిరంజీవికి నమస్కరించిన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని నిహారిక అన్నారు.
- రాజకీయ విమర్శలపై స్పందిస్తూ వ్యక్తిగత దూషణలను నిహారిక ఖండించారు.
- విమర్శించే వారి దిగజారుడు తనానికి స్పందించాల్సిన అవసరం లేదని నిహారిక అభిప్రాయపడ్డారు.
నిహారిక కొణిదెల తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా పవన్ కళ్యాణ్ మరియు నాగబాబుల పై వస్తున్న రాజకీయ విమర్శలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ గెలుపు తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు.
ఫ్యామిలీ పాలిటిక్స్ పై నిహారిక ప్రశ్నలు
Niharika Konidela: మెగా కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా, నిర్మాతలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక్కడ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా మెగా డాటర్స్ నిహారిక కొణిదెల, సుస్మిత ఇద్దరూ ఇండస్ట్రీలో నిర్మాతలుగా మంచి సక్సెస్ అందుకున్నారు ఇటీవలే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సుస్మిత సక్సెస్ అందుకోగా నిహారిక రాకాసా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు తన ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
నిహారిక నాన్న ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు అలాగే బాబాయ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)గారు అంతకుముందు ఎన్నికలలో పోటీ చేసి ఒకచోట కూడా గెలవలేదు తిరిగి గత ఎన్నికలలో పోటీ చేసిన ప్రతి చోట గెలిచి ఎంతో గర్వంగా ఇంటికి వచ్చి చిరంజీవి గారి కాళ్ళకు నమస్కారం చేశారు. ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది అంటూ ప్రశ్న ఎదురయ్యాయి. నిహారిక సమాధానం చెబుతూ ఆ సంఘటన గురించి మీరు మాట్లాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి.. మా ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ అని నిహారిక తెలిపారు.
పవన్ కళ్యాణ్ గెలుపుపై నిహారిక భావోద్వేగం
కళ్యాణ్ బాబాయ్ ఎప్పుడు కూడా చిరు డాడీని అన్నలా కాకుండా డాడీగానే భావించేవారు. డాడీ కూడా బాబాయిని ఒక కొడుకులాగా పెంచారు. అలా విజయంతో ఇంటికి తిరిగి వచ్చి అందరితో సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేమని, ఆ క్షణం విజయం సాధించాం అనడం కంటే కూడా బాబాయిపై ఇంకా ఎన్నో బాధ్యతలు పెరిగాయి అనిపించింది. బాబాయ్ ఏమైతే హామీలు ఇచ్చారో ఇప్పుడు వాటన్నింటినీ నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చింది దీంతో బాధ్యతలు కూడా పెరిగాయని నిహారిక తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి అలాగే నాగబాబు గురించి పొలిటికల్ గా ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఈ విమర్శలు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అనే ప్రశ్న కూడా ఎదురయింది.
వ్యక్తిగత విషయాల పై విమర్శలు..
వ్యక్తిగత విమర్శలపై నిహారిక ఆగ్రహం
ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ.. రాజకీయాల గురించి కాకుండా చాలామంది వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుంటారు. ఆ కామెంట్లు చూసినప్పుడు మరి ఇంత దిగజారిపోయారా.. ఆ కామెంట్లు చూసి స్పందిస్తే మనం ఎంత ఎదవలు అనేది కూడా స్పష్టమవుతుంది. కానీ ఆ కామెంట్లు చేసే వారికి అలాంటిది ఏమి అనిపించదు వాళ్లు ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటారు. ఇలాంటి కామెంట్లు చూసినప్పుడు జనాలు ఇంత దారుణంగా తయారనిపిస్తుంది అలాగే వాళ్ళ మానసిక స్థితి చూసి జాలి వేస్తుందని, వాళ్లకు మా బాబాయ్ , నాన్నను అనడం తప్ప మరి ఏ పని ఉండదని తెలిపారు. ఇక బాబాయ్ పదవి గురించి నాన్న పదవి గురించి వాళ్లు మాట్లాడరు, ఆ విషయంలో వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు అందుకే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని నిహారిక తెలిపారు.
పవన్ కళ్యాణ్ బాధ్యతలను గుర్తు చేస్తూనే, వ్యక్తిగత విమర్శలను పట్టించుకోవద్దని నిహారిక సూచించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

