|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్యాస్టింగ్ కౌచ్ పై నిహారిక సంచలన వ్యాఖ్యలు! చిరు కామెంట్స్ కు కౌంటర్?

Published: 22-03-2026, 6:30 AM
క్యాస్టింగ్ కౌచ్ పై నిహారిక సంచలన వ్యాఖ్యలు! చిరు కామెంట్స్ కు కౌంటర్?
  • క్యాస్టింగ్ కౌచ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై నిహారిక స్పందన.
  • ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని నిహారిక స్పష్టం చేశారు.
  • ఒకప్పుడు బలవంతంగా కమిట్మెంట్స్ అడిగేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందని నిహారిక అన్నారు.
  • క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కోవడం వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని నిహారిక అభిప్రాయపడ్డారు.

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ చాలామంది సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై నిహారిక స్పందిస్తూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తెలిపారు.

చిరంజీవి వ్యాఖ్యలపై నిహారిక స్పందన

Niharika Konidela: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఇదివరకు ఎంతోమంది సెలబ్రిటీలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు. అయితే కొంతమంది మాత్రం క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో లేదంటూ వారి అభిప్రాయాలను తెలియజేసారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిరంజీవి(Chiranjeevi) నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సమయంలో ఈయన క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది మన బిహేవియర్ బట్టి ఉంటుందని, అలాంటిదేమీ ఇండస్ట్రీలో లేదంటూ చెప్పకనే చెప్పేశారు.

ఇలా చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటంతో ఈయన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు.. ముఖ్యంగా సింగర్ చిన్మయి ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీ ఎంతో ప్రొటెక్షన్ లో ఉంది కానీ అందరికీ అలాంటి ప్రొటెక్షన్ లేదని ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె తన వాదన వినిపించారు. అయితే తాజాగా రాకాసా(Raakaasaa) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిహారిక చిరంజీవి చేసిన వ్యాఖ్యల గురించి స్పందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలపై నిహారిక (Niharika)మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తెలిపారు.

క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న నిహారిక

ఒకప్పుడు ఈ విషయంలో కొంతమంది బలవంతం పెట్టేవారు, ఒప్పుకోకపోతే కెరియర్ నాశనం అయ్యేది కానీ ఇటీవల కాలంలో అది లేదని తెలిపారు. ఒకవేళ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురైతే కమిట్మెంట్ ఇవ్వడం అనేది పూర్తిగా వారి అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. నా అభిప్రాయం ప్రకారం పెదనాన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కోవడం, లేదు అనేది పూర్తిగా మన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందన్న ఉద్దేశంతోనే చెప్పి ఉంటారని నిహారిక తెలిపారు. అదేవిధంగా బయట వ్యక్తులతో పోలిస్తే ఈ ప్రభావం మా ఫ్యామిలీ మీద లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న నిహారిక..

వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్న నిహారిక

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక క్యాస్టింగ్  కౌచ్ గురించి మాట్లాడుతూ చిరంజీవి మాటలను వ్యతిరేకించారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని నిహారిక తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ ఇబ్బందుల గురించి ఇదివరకే ఎంతోమంది పలు సందర్భాలలో తెలియజేశారు. సీనియర్ హీరోయిన్ ల నుంచి మొదలుకొని నేటి తరం హీరోయిన్లు మహిళ ఆర్టిస్టులు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక చిత్ర పరిశ్రమలోనే కాదు ప్రతి ఒక్క రంగంలో కూడా ఉందనే సంగతి తెలిసిందే.

నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.