|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిహారిక సంచలనం! ఆ ఒక్కడిని భరించలేకపోతున్నానంటూ షాకింగ్ వీడియో!

Published: 07-02-2026, 11:35 PM
నిహారిక సంచలనం! ఆ ఒక్కడిని భరించలేకపోతున్నానంటూ షాకింగ్ వీడియో!
  • నిహారిక ‘రాకాస’ మూవీ ప్రమోషన్స్‌లో సరికొత్త స్ట్రాటజీ!
  • ప్రొడ్యూసర్ గారి తాలూకా అంటూ హల్చల్ చేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్!
  • ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా ‘రాకాస’ విడుదల – సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటన!
  • స్టోరీ లీక్ చేస్తాడనే భయంతోనే ఆర్టిస్ట్‌ను భరిస్తున్నానన్న నిహారిక!

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘రాకాస’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

నిహారిక ‘రాకాస’ మూవీ ప్రమోషన్స్ అదుర్స్!

మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) తన సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’(Rakasa) ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అనే స్లోగన్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నిహారిక తన సినిమా ప్రమోషన్స్ కోసం ‘‘ప్రొడ్యూసర్ గారి తాలూకా’’ అనే సరికొత్త కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకొచ్చింది. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ఆమె నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ప్రొడ్యూసర్ గారి తాలూకా వీడియో!

ఇందులో ఒక జూనియర్ ఆర్టిస్ట్ తాను ‘ప్రొడ్యూసర్ గారి తాలూకా’ అంటూ సెట్‌లో అందరినీ విసిగిస్తూ చేసే హడావిడి నవ్వులు పూయిస్తోంది. డైరెక్టర్ ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలో కూడా తనే నిర్ణయిస్తానని అతను చేసే ఓవరాక్షన్‌ను భరించలేక నిహారిక స్వయంగా రంగంలోకి దిగుతుంది. ఇక అతనికి నటన రాదని తెలియడంతో మార్కెటింగ్ చేయమని అడగగా.. చాట్ జీపీటీ, జెమిని వంటి ఏఐ (AI) టూల్స్ ఉండగా మార్కెటింగ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఆ ఆర్టిస్ట్ చెప్పే సమాధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో అక్కడి నుంచి అతను వెళ్లిపోతాడు. ఇక నిహారిక మాత్రం పిల్లల్ని చూసుకునే సంత ఏంటీరా బాబు? అని అతని ఓవరాక్షన్ భరించలేక తలపట్టుకుంటుంది.

ఏప్రిల్ 3న రాకాస విడుదల.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!

ఇక వీడియో చివరలో నిహారిక చెప్పే క్లైమాక్స్ ట్విస్ట్ మరింత ఆసక్తికరంగా ఉంది. అసలు నటన రాని అతన్ని సెట్‌లో ఎందుకు భరిస్తున్నారని అడిగితే.. సినిమా కథ మొత్తం అతనికి తెలుసని, బయటకు వెళ్లి స్టోరీ లీక్ చేస్తాడేమో అన్న భయంతోనే అతన్ని సెట్ చుట్టూ తిప్పుకుంటున్నామని నిహారిక తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది. మానస శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ ‘రాకాస’ చిత్రంపై ఇలాంటి వినూత్న ప్రచారంతో మెగా ఫ్యాన్స్‌లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిహారిక ‘రాకాస’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.