
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో పాప్‌కార్న్, డ్రింక్స్ ధరలు అధికంగా ఉన్నాయని, తాను కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
Key Points
నిఖిల్ సిద్ధార్థ థియేటర్లలో తినుబండారాల ధరలను చూసి షాకయ్యాడు.
టికెట్ ధర కంటే తినుబండారాల ఖర్చు ఎక్కువ అయిందని ఆయన తెలిపారు.
కనీసం నీళ్ల బాటిల్ పట్టుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని నిఖిల్ విజ్ఞప్తి చేశాడు.
థియేటర్లలో ధరలు తగ్గించడం ద్వారా ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
థియేటర్లలో అధిక ధరలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతో బాగుందనే టాక్ వస్తే తప్పితే కొత్త సినిమా చూసేందుకు జనాలు థియేటర్లకు వెళ్లట్లేదు. అయితే ఇలా జరగడానికి మరో కారణం కూడా ఉంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కి అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ మేరకు ట్వీట్ చేయడంతో సదరు విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మిగతా చోట్ల ఏమో గానీ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు చాలా థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు కళ్లు చెదిరేలా ఉంటాయి. తాజాగా ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లిన నిఖిల్ కూడా తినుబండరాల ధరలు చూసి షాకయ్యాడు. తను కొన్న టికెట్ రేటు కంటే వీటికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ట్విటర్‌లో చెప్పుకొచ్చాడు. కనీసం వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్లేందుకైనా అనుమతించాలని రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయంలో డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ కాస్త దృష్టి పెడితే బాగుంటుందని, అప్పుడే జనాలు థియేటర్లకు వస్తారని అన్నాడు.
నిఖిల్ సిద్ధార్థ అనుభవం
కొన్నిరోజుల ముందు నిర్మాత నాగవంశీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే విషయమై తన అనుభవాన్ని బయటపెట్టారు. తలో రెండు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ఏకంగా రూ.1000కి పైనే అయ్యాయని అన్నారు. దీంతో ఇప్పుడీ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలు.. జనాలు థియేటర్లకు రావట్లేదని తెగ బాధపడిపోతున్నారు. అయితే కంటెంట్ విషయంలో దృష్టి పెట్టడంతో పాటు వీటి రేట్లు కూడా అందుబాటులో ఉంటేనే జనాలు కాస్తోకూస్తో రావడానికి ఆసక్తి చూపిస్తారు. లేదంటే మాత్రం పూర్తిగా ఓటీటీలకు అలవాటు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రేక్షకుల సంఖ్య తగ్గుదల
థియేటర్లలో ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ఆకర్షించాలని నిఖిల్ సిద్ధార్థ సూచించారు. ఇది టాలీవుడ్‌కు మంచి పరిణామం కావచ్చు.


