|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిఖిల్ ‘స్వయంభు’ విడుదల వాయిదా! కారణం ఇదేనా? అభిమానులకు షాక్!

Published: 21-01-2026, 4:05 AM
నిఖిల్ 'స్వయంభు' విడుదల వాయిదా! కారణం ఇదేనా? అభిమానులకు షాక్!
  • నిఖిల్ స్వయంభు సినిమా మహాశివరాత్రికి విడుదల కావాల్సి ఉంది.
  • VFX పనులు పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా పడింది.
  • నూతన సంవత్సర పోస్టర్లో విడుదల తేదీ లేకపోవడంతో వాయిదా ఖాయమని తేలింది.
  • ఈ సినిమాలో నిఖిల్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు.

నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘స్వయంభు’ సినిమా విడుదల వాయిదా పడింది. మహాశివరాత్రికి విడుదల కావాల్సిన ఈ సినిమా, VFX పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.

స్వయంభు విడుదల వాయిదాకు కారణం?

Swayambhu film: హ్యాపీ డేస్ సినిమా ద్వారా నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ సిద్ధార్థ్ (Nikhik Siddarth)ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.త్వరలోనే నిఖిల్ నటించిన స్వయంభు (Swayambhu)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి మేకర్స్ ఇటీవల అధికారకంగా తెలియజేశారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ సినిమాని ఫిబ్రవరి 13వ తేదీ ఏకంగా ఎనిమిది భాషలలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాని నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం అనుకున్న సమయానికి నిఖిల్ స్వయంభు సినిమా విడుదల కావడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయినప్పటికీ విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ లో సినిమా విడుదల తేదీ లేకపోవడంతో ఈ సినిమా విడుదల తథ్యం అని స్పష్టమవుతుంది.

నిఖిల్ యోధుడి పాత్రలో ఎలా ఉండబోతున్నాడు?

స్వయంభ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో కొనసాగే కథగా భారీ విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్క సన్నివేశాన్ని అద్భుతంగా తీసుకురావడం కోసం చిత్ర బృందం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విఎఫ్ఎక్స్ పనులకు మరి కాస్త సమయం అవసరం అయిన నేపథ్యంలోనే ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిఖిల్ ఒక యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్, నభా నటేష్ నటించగా సునీల్ సుబ్బరాజు, సత్య వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్, పోస్టర్లు సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మార్చి లేదా ఏప్రిల్ లో విడుదల కానుందా?

స్వయంభు సినిమా వాయిదా పడటం నిఖిల్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించవచ్చు. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీ పడకుండా సినిమాను మరింత మెరుగ్గా అందించేందుకు మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.