
📌 Key Points
- నిఖిల్ హీరోగా వస్తున్న ‘స్వయంభూ’ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
- రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, రవి బస్రూర్ సంగీతం అందించారు.
- ఈ సినిమా 3Dలో కూడా విడుదల కానుందని సమాచారం.
- నిఖిల్ ఈ సినిమా కోసం కత్తిసాము, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నాడు.
నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ‘స్వయంభూ’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రారా ధీవర’ విడుదలైంది. ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
‘రారా ధీవర’ సాంగ్ విశేషాలు
Swayambhu Movie : ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న నిఖిల్, ఇప్పుడు అంతకు మించిన భారీ బడ్జెట్ వండర్‌తో రాబోతున్నాడు. అదే ‘స్వయంభూ’.భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రారా ధీవర’ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
నిఖిల్ పై నిర్మాతల నమ్మకం.. భారీ బడ్జెట్ తో రిస్క్!
సాధారణంగా మీడియం రేంజ్ హీరోలపై వందల కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు వెనకాడుతుంటారన్న సంగతి తెల్సిందే .కానీ నిఖిల్ మార్కెట్ స్టామినా ‘కార్తికేయ 2’ తర్వాత పూర్తిగా మారిపోయింది. అందుకే ‘స్వయంభూ’ కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టారని విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది.ఇక సెట్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతి విషయంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది కూడా
నిఖిల్ పై నిర్మాతల నమ్మకం
మాస్ కు పూనకాలు తెప్పించే ‘రారా ధీవర’
తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రారా ధీవర’ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్‌ను, అతనిలో ఉన్న ధైర్యాన్ని, పోరాటాన్ని ఎలివేట్ చేస్తూ ఈ పాటను రూపొందించారు. ముఖ్యంగా ఈ పాట మేకింగ్ అయితే టాప్ నాచ్ ..ఇక లెజెండరీ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన”నువ్వే నీ ఉలి.. నువ్వే నీ శిల.. నీలో శక్తిని.. శిల్పంగా మార్చరా” అనే లైన్స్ అయితే నెక్స్ట్ లెవల్. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ తన మార్క్ మ్యూజిక్‌తో నేపథ్య సంగీతాన్ని అదిరిపోయేలా ఇచ్చారు. సంతోష్ వెంకీ వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక వందలాది మంది డాన్సర్ల మధ్య రంగురంగులుగా తీసిన ఈ పాట విజువల్‌గా కూడా కనుల విందుగా ఉంది.
ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. ‘స్వయంభూ’ 3D లో కూడా విడుదల కానుందట. సినిమాలో ఉండే యుద్ధ సన్నివేశాలు, కత్తుల యుద్ధం 3Dరూపంలో చూస్తుంటే ప్రేక్షకులకు థియేటర్లో గూస్ బంప్స్ రావడం ఖాయమని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. నిఖిల్ ఈ సినిమా కోసం కత్తిసాము నేర్చుకోవడం, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవడం చూస్తుంటే తన కెరీర్ లోనే ఇది ఒక మైలురాయి మూవీ కాబోతోందని అర్థమవుతోంది.
‘స్వయంభూ’ 3Dలో విడుదల కానుందా?
సమ్మర్లో ముహూర్తం ఖరారు?
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ వేసవిలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సింది.త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుందని ఇన్ సైడ్ టాక్.ఇక సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజమౌళి సినిమాల తర్వాత ఆ రేంజ్ గ్రాండియర్ మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిఖిల్ ఈ ‘స్వయంభూ’తో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తాడో చూడాలి!
‘స్వయంభూ’ చిత్రం 3Dలో విడుదల కానుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. నిఖిల్ నటన, సాంకేతిక అంశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. వేసవిలో విడుదల కానుంది.


