|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి ఆగస్ట్ 1 ఎపిసోడ్: చంద్రకళ జీవితంలోకి కొత్త వ్యక్తి- రౌడీల నుంచి కాపాడిన అర్జున్- శాలినికి క్రాంతి వార్నింగ్

Published: 01-08-2025, 12:45 AM
నిన్ను కోరి ఆగస్ట్ 1 ఎపిసోడ్: చంద్రకళ జీవితంలోకి కొత్త వ్యక్తి- రౌడీల నుంచి కాపాడిన అర్జున్- శాలినికి క్రాంతి వార్నింగ్

నిన్ను కోరి సీరియల్‌లోని ఆగష్టు 1వ తేదీ ఎపిసోడ్‌లో చంద్రకళ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించడం, రౌడీల దాడి నుండి అర్జున్ ఆమెను కాపాడటం, శాలినికి క్రాంతి ఇచ్చిన హెచ్చరికలు ముఖ్యమైన సంఘటనలు. విరాట్ మరియు చంద్రకళ మధ్య సంభాషణలు కూడా ఆకట్టుకున్నాయి.

Key Points

1

విరాట్ చంద్రకళకు కృతజ్ఞతలు తెలిపాడు.

2

శాలిని చంద్రకళ ఇంట్లో ఉండటం వల్ల భయపడుతోంది.

4

రౌడీల నుండి అర్జున్ చంద్రకళను కాపాడాడు.

విరాట్ మరియు చంద్రకళ మధ్య సంభాషణ

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురామ్‌పై చూపిస్తున్న కేర్ గురించి చంద్రకళకు థ్యాంక్స్ చెబుతాడు విరాట్. కొడుకు కంటే ముందే కొడుకులా మంచి ట్రీట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నావ్ అని చంద్రకళను అంటాడు విరాట్. నేను కుట్ర చేస్తున్నాను అందరూ నన్ను అంటుంటే నువ్ మాత్రమే నన్ను నమ్మి సపోర్ట్‌గా నిలిచావ్. అందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి బావ అని చంద్రకళ అంటుంది.

రేపు గడువులోగా మావయ్యకు నయం కాకపోతే నేను ఇంట్లోంచి వెళ్లే పరిస్థితి వస్తుంది. అప్పుడు నువే ఏ వైపు స్టాండ్ తీసుకుంటావని విరాట్‌ను చంద్రకళ అడుగుతుంది. అంత దూరం ఆలోచించలేదు. కానీ, నీ ప్రయత్నం చూస్తుంటే గడువులోపే నాన్నకు నయం అయ్యేలా చేస్తావనిపిస్తుందని వెళ్లిపోతాడు విరాట్ . ఆ మాటలు విన్న శాలిని తెగ కంగారుపడిపోతుంది.

మరోవైపు రఘురాం కోలుకోవాలని కామాక్షి, శ్రుతి మాట్లాడుకుంటారు. రఘురాం గొప్పదనం గురించి డిస్కస్ చేసుకుంటారు. ఆ మాటలు విన్న శాలిని మరింత భయపడిపోయి టెన్షన్‌తో వెళ్లిపోతుంది. మావయ్య కోలుకుంటే చంద్రకళ ఇంట్లో ఉండిపోతుంది. నా ప్లాన్ తెలిసిన చంద్ర నా పనులు చేయనివ్వదు. చంద్రకళ వెళ్లేలా ఏదోటి చేయాలి. లేకుంటే నా డౌన్ ఫాల్ మొదలవుతుందని ఆలోచిస్తుంది శాలిని.

శాలిని భయాలు మరియు ఆందోళనలు

ఇంతలో వచ్చిన క్రాంతి చంద్ర వదినను పొగుడితే నీకు అవమానంగా ఉంటుంది. నా విషయంలో కుట్ర చేసినట్లు మా నాన్న విషయంలో కూడా ఏదైనా కుట్ర చేస్తే నిన్ను ఊరికే వదలను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు క్రాంతి. మరోవైపు చంద్రకళ స్టాక్ కోసం కస్టమర్స్ నిలదీస్తుంటారు. ఇంతలో చంద్రకళ పచ్చళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. ఇంకా ఎక్కువ పచ్చళ్లు పెంచేయ్ అని షాప్ ఓనర్ అంటాడు.

పెట్టుబడి పెట్టేందుకు నువ్వున్నావుగా అని చంద్రకళ అంటే లేదమ్మా. నేను నా కొడుకు దగ్గరికి అమెరికా వెళ్తున్నాను. ఈ షాప్ ఇచ్చేవాళ్లకు నీ బిజినెస్ రన్ అయ్యేలా చెబుతాను అని షాప్ ఓనర్ అంటాడు. నువ్ అయితే హ్యాపీగా వెళ్లు బాబాయ్ అని బయటకు వెళ్లిపోతుంది చంద్రకళ. స్కూటీ తీస్తున్న చంద్రకళను కొందరు రౌడీలు కావాలనే డ్యాష్ ఇచ్చి కిందపడేలా చేస్తారు.

దాంతో చంద్రకళ కిందపడుతుంది. వాళ్లను తిట్టి చంద్రకళ వెళ్లిపోతుంటే స్కూటిపై కాలు వేస్తాడు రౌడీ. దాంతో రౌడీను చంద్రకళ కొట్టబోతుంటే చేయి పట్టుకుని ఆపుతాడు. దాంతో చంద్రకళ గింజుకుంటుంది. ఇంతలో ఒకతను వచ్చి రౌడీ చేయి మెలిపెడతాడు. దాంతో రౌడీ బాధతో అరుస్తాడు. మిగతా రౌడీలను కొట్టి చంద్రకళను కాపాడుతాడు అర్జున్.

క్రాంతి హెచ్చరిక మరియు అర్జున్ రక్షణ

రజనీకాంత్ స్టైల్‌లో డైలాగ్స్ కొడుతూ ఫైట్ చేస్తాడు అర్జున్. రౌడీలతో చంద్రకళకు సారీ చెప్పిస్తాడు. దాంతో రౌడీలు వెళ్లిపోతారు. అర్జున్‌కు చంద్రకళ థ్యాంక్స్ చెబితే రక్తం కారడం చూసి ఇప్పుడు డ్రైవ్ చేయలేరు. కారులో వెళ్దాం అని తీసుకెళ్తాడు అర్జున్. చంద్రకళ దెబ్బకు ఆయింట్‌మెంట్ రాస్తాడు. తర్వాత చంద్రకళను ఇంట్లో దిగబెడతాడు అర్జున్.

చంద్రతో ఉన్న అర్జున్‌ను చూసి కామాక్షి , శ్రుతి ఎవరతను అనుకుంటారు. అర్జున్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్న చంద్రకళ రక్తం కారడం చూసి ఇంట్లోకి తీసుకెళ్లి ఫస్ట్ ఏయిడ్ చేస్తుంది. రౌడీల నుంచి కాపాడారు అని అర్జున్ గురించి కామాక్షి, శ్రుతిలకు చెబుతుంది చంద్రకళ. వాళ్లిద్దరు అనుమానిస్తుంటే పెద్ద సీన్ చేయకండని చంద్రకళ అంటుంది. ఇంతలో శ్యామల వస్తుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, చంద్రకళ జీవితంలో కొత్త మలుపులు, అర్జున్ ఆమెను రక్షించడం, శాలిని ఆందోళనలు, క్రాంతి హెచ్చరికలు ఈ ఎపిసోడ్‌కు ఉత్కంఠను చేకూర్చాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.