|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి ఆగస్టు 18 ఎపిసోడ్: ప‌రాయి మగాడితో పార్ట్‌న‌ర్‌..చంద్ర‌పై శ్యామ‌ల ఫైర్‌.. వెనకేసుకొచ్చిన విరాట్‌.. అందరూ షాక్

Published: 18-08-2025, 1:14 AM
నిన్ను కోరి ఆగస్టు 18 ఎపిసోడ్: ప‌రాయి మగాడితో పార్ట్‌న‌ర్‌..చంద్ర‌పై శ్యామ‌ల ఫైర్‌.. వెనకేసుకొచ్చిన విరాట్‌.. అందరూ షాక్

నిన్ను కోరి సీరియల్‌లో ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. చంద్రకళ ఒక పరాయి వ్యక్తితో పార్ట్‌నర్‌షిప్ చేయడం వలన కుటుంబంలో తీవ్రమైన గొడవలు జరుగుతాయి. విరాట్ మరియు శ్యామల ఆమెపై తీవ్రంగా ఆగ్రహిస్తారు.

Key Points

1

చంద్ర పరాయి వ్యక్తితో పార్ట్‌నర్‌షిప్ చేయడం

2

విరాట్ చంద్రపై కోపంగా ఉన్నాడు

4

చంద్ర, విరాట్ మధ్య సమస్యలు పెరుగుతున్నాయి

చంద్రకళ యొక్క కొత్త పార్ట్‌నర్

నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్ లో బిజినెస్ మంచిగా జరిగేలా వర్కర్స్ తో మాట్లాడుతుంది చంద్రకళ. చైన్ సూపర్ మార్కెట్ ఓనర్ తో డీల్ కోసం మాట్లాడేందుకు ఉండమని చంద్రను అడుగుతాడు అర్జున్. మరోవైపు విరాట్ ఇంటికి వచ్చి చూస్తే చంద్ర కనిపించదు. నా ఫోన్ ఎందుకు ఎత్తలేదో అడుగుతానని అనుకుంటాడు. ఆవిడ ఇంకా రాలేదని కామాక్షి, శ్యామల, శ్రుతి అంటారు. చంద్రకు ఫోన్ చేయబోతుంటే విరాట్ ను అడ్డుకుంటుంది శ్యామల. చంద్ర గురించి బాధ్యత అని విరాట్ అంటాడు.

చంద్ర మన మనిషా పరాయి మనిషా? అని తేలడానికి ఇంకా టైమ్ ఉంది అని విరాట్ అంటాడు. చంద్రకళ కు కాల్ చేస్తే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లో వాళ్లు కంగారు పడతారనే ఆలోచన చంద్రకు ఉండాలి కదా. ఆలోచన రాలేదంటే ఇంటి మనిషి కానట్లే కదా అని శ్యామల అంటుంది. ఛాన్స్ దొరికిందని కామాక్షి, శ్రుతి కూడా చంద్రను మాటలంటారు. మరోవైపు క్లయింట్ కు ఎక్స్ ప్లెయిన్ చేస్తుంది చంద్ర. డీల్ ఓకే అవుతుందని చంద్ర, అర్జున్ హ్యాపీగా ఫీల్ అవుతారు.

విరాట్ మరియు శ్యామల ప్రతిస్పందన

చంద్రకళ కోసం వెయిట్ చేస్తుంటాడు విరాట్ . అప్పుడే వచ్చిన చంద్రపై ఫైర్ అవుతాడు విరాట్. ఎన్ని సార్లు ఫోన్ చేశానో తెలుసా? చూసుకోకుండా ఎందుకు ఉన్నావని సీరియస్ గా అడుగుతాడు. మీటింగ్ ఉండి చూసుకోలేదని చంద్ర అంటుంది. అదే విషయం చెప్పొచ్చు కదా. నువ్వు ఆఫీస్ లో ఉన్నావో లేదా ఇబ్బందుల్లో ఉన్నావో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇంకెప్పుడు ఇలా చేయకు చంద్ర. ఏదైనా ఉంటే ముందే చెప్పు అని విరాట్ అంటాడు.

చంద్ర బిజినెస్ చేయడం అవసరమా? పరాయి మగాడితో పార్ట్ నర్ గా చేరావు కదా? జగదీశ్వరి కోడలు ఇంతవరకూ ఇంటికి రాలేదంటే ఎలా ఉంటుంది? మా వదిన గౌరవ మర్యాదలను మంటలో కలపడమా? నీ అసలు రూపం తెలిసిన రోజే ఇంట్లో నుంచి పంపించేయాల్సిందని శ్యామల ఫైర్ అవుతుంది. తనకు 30 రోజుల టైమ్ ఇచ్చాం కదా వదిలేయమంటాడు విరాట్. అసలు అన్నయ్యను పట్టించుకుంటుందా చంద్ర అని కామాక్షి అంటుంది.

కుటుంబంలో తలెత్తిన వివాదాలు

చంద్రను వెనకేసుకొస్తూ మాట్లాడతాడు విరాట్. మీ వల్ల నేను మా ఆయన మనసులో ఉన్న ప్రేమన చూశా. థ్యాంక్యూ పిన్ని అని శ్యామలకు చెప్తుంది చంద్ర. ఆ తర్వాత విరాట్ గదిలోకి వెళ్లి చాలా బిజీగా ఉన్నా బావ అని చెప్తుంది చంద్ర. అత్తయ్య ముందు మాట్లాడకపోతే మన విషయంలో డౌట్ పడుతుందని అనాల్సి వచ్చింది. నువ్వు వాళ్లకు అవకాశం ఇస్తున్నావు. వాళ్లు టార్గెట్ చేద్దామని చూస్తున్నారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. కమ్యునికేషన్ ప్రాపర్ గా ఉంటే ఏ ప్రాబ్లెం ఉండదని విరాట్ అంటాడు.

రఘురాం దగ్గరకు వెళ్లి మందులు వేయాలని చూస్తుంది చంద్రకళ. అప్పటికే నేను వేశానని జగదీశ్వరి చెప్తుంది. మీ కోపాన్ని కూడా ఇష్టంగా భరిస్తానని చెప్పి చంద్ర వెళ్లిపోతుంది. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చంద్రకళ తన నిర్ణయం వల్ల కలిగే పరిణామాలను ఎదుర్కొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తీవ్రమవుతాయి. విరాట్ మరియు చంద్రకళ మధ్య సంబంధం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.