|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి ఆగస్టు 19 ఎపిసోడ్: చంద్రకళ, విరాట్ కెమిస్ట్రీ.. లెక్క తేలుస్తానంటూ శ్యామల ప్లాన్.. మాట మార్చిన విరాట్

Published: 19-08-2025, 11:36 AM
నిన్ను కోరి ఆగస్టు 19 ఎపిసోడ్: చంద్రకళ, విరాట్ కెమిస్ట్రీ.. లెక్క తేలుస్తానంటూ శ్యామల ప్లాన్.. మాట మార్చిన విరాట్

నిన్ను కోరి సీరియల్ ఆగస్టు 19వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ, విరాట్, శ్యామలల మధ్య ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. శ్యామల చంద్రకళ మరియు విరాట్ల రహస్యాన్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తుండగా, విరాట్ మాట మార్చడం ఆసక్తికరంగా ఉంటుంది.

Key Points

1

చంద్రకళ, విరాట్ మధ్య ఉన్న రహస్య సంబంధాన్ని శ్యామల బయటపెట్టాలని ప్రయత్నిస్తుంది.

2

శాలిని వరలక్ష్మి వ్రతం చేయడంపై చంద్రకళ, శ్యామల మధ్య తగాదా.

4

శ్యామల తన ప్లాన్ విజయవంతం చేసుకోవడానికి వ్రతాన్ని ఉపయోగించుకుంటుంది.

శ్యామల యొక్క ప్రతీకార పథకం

నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 19వ తేదీ ఎపిసోడ్ లో నన్ను అర్థం చేసుకునే మనసు మీకుంది కాబట్టి మీ కోపాన్ని ఇష్టంగా భరిస్తా అని జగదీశ్వరితో చంద్రళ అంటుంది. పొద్దున కాళ్ల నొప్పులు అంటూ బాధపడుతుంది శ్యామల. నువ్వు ఎంత ప్రయత్నించినా చంద్రను విరాట్ సీక్రెట్ గా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. నీ ముందు నటిస్తున్నాడని శ్యామలతో కామాక్షి అంటుంది. మనల్ని పరోక్షంగా ఆ చంద్ర టార్చర్ చేస్తూనే ఉందని కామాక్షి చెప్తుంది. విరాట్ నాటకాన్ని బయటపెట్టి తీరుతానని శ్యామల అంటుంది.

అప్పుడే శ్రుతి వచ్చి క్రాంతితో కలిసి శాలిని వరలక్ష్మి వ్రతం చేస్తుందటా అని నవ్వుతూ చెప్తుంది.శాలినిలో మార్పు వచ్చిందే అని కామాక్షి అంటుంది. శాలిని చేయడం వింతే కదా పెద్దమ్మ అని శ్రుతి వెటకారంగా మాట్లాడుతుంది. మీరెంత వెటకారంగా మాట్లాడిన ఇంటి కోడలికే వ్రతం చేసే అర్హత ఉంటుంది మీ లాంటి బీరకాయ పీచు చుట్టాలకు కాదని శాలిని కౌంటర్ వేస్తుంది. మధ్యలో చంద్రకళ జోక్యం చేసుకుని ఇంటి పెద్ద కోడలిని వ్రతం చేయాలని అంటుంది. క్రాంతి కూడా సపోర్ట్ చేస్తాడు.

చంద్రకళ మరియు విరాట్ మధ్య సంబంధం

శ్యామల మాత్రం వ్రతం వద్దని అంటుంది. కామాక్షి, శ్రుతి కూడా వంత పాడతారు. పెద్ద కోడలుగా నేను ఉండగా శాలిని పూజ చేయడం పద్దతి కాదు కదా పిన్ని అని చంద్ర అంటుంది. మీరు మీరు తేల్చుకోండని జగదీశ్వరి తప్పించుకోవాలని చూస్తుంది. మీ ఆయన ఓకే అంటే నాకు అభ్యంతరం లేదని విరాట్ ను ఇరికిస్తుంది శ్యామల. నాకు ఏ సంబంధం లేదని విరాట్ కూడా తప్పించుకుంటాడు. మరీ ఇంత ద్వేషం పనికిరాదని క్రాంతి అంటాడు. ఎందుకు ఇంతలా భయపడుతున్నారు పిన్ని. ఓడిపోతారనే భయం ఉంది. అందుకే వ్రతం మీ అన్న క్షేమం కోసమన్నా వద్దంటున్నారని చంద్ర తెలివిగా మాట్లాడుతుంది.

అన్న క్షేమం కోసం నువ్వు వ్రతం చేయడానికి ఒప్పుకుంటున్నానని శ్యామల అంటుంది. కానీ నిన్ను నమ్ముతానని అనుకోకు, గడువు తీరగానే వెళ్లిపోవడం ఖాయమని శ్యామల అంటుంది. సంతోషంతో రఘురామ్ తో మాట్లాడుతుంది చంద్రకళ. మామయ్యను తీసుకుని వ్రతానికి రండి అని చంద్ర రిక్వెస్ట్ చేస్తే.. జగదీశ్వరి ఓకే చెప్తుంది. వ్రతం చేసుకోవడానికి చంద్రకు ఎందుకు పర్మిషన్ ఇచ్చావని శ్యామలను ప్రశ్నిస్తుంది కామాక్షి.

వరలక్ష్మి వ్రతం మరియు దాని ప్రభావం

చంద్ర, విరాట్ ల మధ్య క్లోజ్ నెస్ ఉందా లేదా? అని కనుక్కోవడం కోసమే చంద్రకు వ్రతం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో వాళ్ల మధ్య కెమిస్ట్రీని కనిపెడితే మ్యాథమేటిక్స్ ను వాడి డిస్టన్స్ పెంచొచ్చు. నా అంచనా ప్రకారం విరాట్ వ్రతం దగ్గరకు రావొద్దు. లేదు విరాట్ వచ్చాడంటే చంద్రపై ప్రేమ ఉన్నట్లే అని శ్యామల అంటుంది. వ్రతం కోసం విరాట్ కు కొత్త దుస్తులు తెచ్చి ఇస్తుంది చంద్ర.

నేను గెలవాలని కోరుకుంటున్నావా లేదా అంటే లేదని అంటాడు విరాట్. కామాక్షి, శ్రుతి మాటలు వింటున్నారని చూస్తాడు విరాట్. అందుకే అత్తయ్య మనసును గాయపర్చలేనని అంటాడు. నిన్ను చివరి సారిగా చెక్ చేయడానికి ఇచ్చాను ఛాన్స్. నువ్వు గెలిస్తే ప్రేమ పుడుతుందని విరాట్ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరికి, శ్యామల తన ప్రణాళికను అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ విరాట్ యొక్క మాట మార్పు మరియు చంద్రకళ యొక్క తెలివితేటలు ఆమె ప్రయత్నాలను విఫలం చేస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.