
నిన్ను కోరి సీరియల్ ఆగస్టు 30వ తేదీ ఎపిసోడ్‌లో అనేక ఉత్కంఠభరిత ఘటనలు చోటుచేసుకున్నాయి. చంద్రకళ ట్విస్ట్ ఇవ్వగా, శాలిని తల్లి, కూతుళ్లకు హెచ్చరిక జారీ చేసింది. రఘురాం చేసిన పనులతో శాలిని భయపడింది.
Key Points
చంద్రకళ శాలిని తప్పులకు కారణమని చెప్పింది.
శాలిని తల్లి, కూతుళ్లకు హెచ్చరిక జారీ చేసింది.
జగదీశ్వరి శాలినిని కొట్టిందని శ్రుతి భ్రమపడింది.
చంద్రకళ యొక్క ట్విస్ట్
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలిని తప్పు చేయడానికి కారణం నేను. తను మెల్లిగా మారుతుంది అని చంద్రళ చెబుతుంది. మరి నువ్వు పడిన బాధ గురించి ఏంటీ. తల్లిగా నేను నిలదీయకుంటే ఎలా అని జగదీశ్వరి అంటుంది. ఇప్పుడు నిలదీయడం వల్ల ఒరిగేదేం లేదని అత్త జగదీశ్వరికి ఎదురుచెబుతుంది చంద్రకళ .
మీరు నిలదీయకుండా ఉంటేనే క్రాంతి బంధాన్ని నిలబెడుతుంది. నా మీద కోపాన్ని పోగొడుతుంది. తర్వాత మీ ఇష్టం అని చంద్రకళ అంటుంది. మరోవైపు రెడీ అవుతున్న శాలిని దగ్గరికి వెళ్లి అత్తయ్య పిలుస్తుందని శ్రుతి చెబుతుంది. నీ మొహం వెలిగిపోతుందేంటీ. ఏమైనా రివేంజ్ ప్లాన్ చేశావా. అక్కడేదైనా జరగాలి సిమెంట్ వాడికి పెద్ద ఖర్చు అవ్వదు. ఎక్కించేస్తాడు అని శాలిని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది శాలిని.
అత్తయ్య పిలిచారా అని అడుగుతుంది శాలిని. శాలినిని లాగిపెట్టి చెంపదెబ్బ కొడుతుంది జగదీశ్వరి. శాలిని, చంద్రకళ షాక్ అవుతారు. శ్రుతి మాత్రం తెగ సంబరపడిపోతుంది. కానీ, అక్కడ నిజంగా శాలినిని జగదీశ్వరి కొట్టదు. శ్రుతి మాత్రమే అలా ఊహించుకుంటుంది. పిలిచారా అని మళ్లీ శ్రుతి అంటే అవును, తలనొప్పిగా ఉంది. కాఫీ తీసుకురా అని జగదీశ్వరి అంటుంది.
దాంతో సంతోషంగా శాలిని వెళ్లిపోతుంది. మా మాట విన్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చంద్రకళ అంటుంది. నాకు ఇంకా శాలిని మీద కోపంగానే ఉంది. ఇంకో తప్పు చేస్తే మాత్రం ఊరుకోను అని జగదీశ్వరి అంటుంది. అలా జరగకుండా నేను చూసుకుంటాను అని శాలిని తప్పు బాధ్యత చంద్రకళ తీసుకుంటుంది. అదంతా విన్న శ్రుతి చంద్రపై కోపంతో వెళ్లిపోతుంది.
శాలిని యొక్క హెచ్చరిక
మరోవైపు చంద్రకళకు విరాట్ కోపంగా కాల్ చేస్తాడు. ఫైల్ గురించి మర్చిపోయానే అనుకుంటుంది చంద్రకళ. త్వరగా పంపించు అని అరుస్తాడు విరాట్. సరే అని ఫైల్ తీసుకుని ఫొటోలు పంపిస్తుంది చంద్రకళ. నేను వేసిన ప్లాన్ అంతా అట్టర్ ప్లాఫ్ అయిందని తెగ ఊగిపోతుంది శ్రుతి. దేనికైనా టైమ్ రావాలి అని కామాక్షి అంటుంది.
మనకు తెలియని మ్యాటర్ ఏదో చంద్ర, శాలిని మధ్య జరుగుతుంది. నువ్ తింగరి పనులు చేసి నా ప్రాణం మీదకు తీసుకురాకు అని కామాక్షి అంటుంది. ఆ మాటలు విన్న శాలిని ఏం చేసింది. ఏదో దాస్తున్నారు. ఏం చేశావ్ శ్రుతి అని నిలదీస్తుంది శాలిని. శ్రుతిని కొట్టినదాని గురించి చెబుతుంది కామాక్షి. శ్రుతి అన్నమాటలకు నాకు వచ్చిన కోపానికి నాలుక కోసేయాలి. చెంపదెబ్బతో సరిపెట్టాను సంతోషించు అని శాలిని అంటుంది.
నీ తింగరితనంతో నా విషయం గనుక బయటపడిందో మీ ఇద్దరికి మూడినట్లే అని వార్నింగ్ ఇస్తుంది శాలిని. దాంతో భయపడిన కామాక్షి అలా జరుగదంటుంది. మరోవైపు పోస్ట్ ఎవరు పంపించారు. లాయర్‌ను నిలదీస్తాను అని కాల్ చేస్తాడు క్రాంతి. లాయర్‌ను అడిగితే తాను పంపించలేదంటాడు. తర్వాత చూసి కొన్ని మ్యాండేటరి నోట్స్ ఉంటాయి. అలా నీది కూడా వెళ్లిపోయిందని సారీ చెబుతాడు లాయర్.
రఘురాం మరియు శాలిని భయం
లాయర్‌కు కూడా తెలియకుండా అటోమేటిక్‌గా సెంట్ అయిందట అని చంద్రకళకు చెబుతాడు క్రాంతి. దాంతో లాయర్‌కు చంద్రకళ కాల్ చేస్తే మీరు చెప్పినట్లే చెప్పాను అని లాయర్ అంటాడు. అలా లాయర్‌కు ముందే చెప్పి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది చంద్రకళ. మరోవైపు చంద్రకళ గురించి కామాక్షి, శ్రుతి మాట్లాడుకుంటారు. నేను కావాలనే అడ్డు పడ్డాను అని చంద్రకళ ఎంట్రీ ఇస్తుంది.
దాంతో కామాక్షి, శ్రుతి భయపడుతారు. శాలినిని క్రాంతిని ఎందుకు విడదీయాలని చూస్తున్నారు అని నిలదీస్తుంది చంద్రకళ. తర్వాత రఘురాం చేయి కదిపి గ్లాస్ కింద పడేస్తాడు. అది జగదీశ్వరి, చంద్రకళ చూసి సంతోషిస్తారు. శ్యామలకు చంద్రకళ రఘురాం చేయి కదిపింది చెబుతుంది. దాంతో తెగ సంబరబడుతుంది శ్యామల.
మావయ్య కోలుకున్నారంటే నా ఉనికికే ప్రమాదం. మావయ్య కోలుకోకూడదు అని శాలిని అనుకుంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో చంద్రకళ, శాలిని, రఘురాం మధ్య సంఘర్షణ, ఉత్కంఠ భరిత పరిణామాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. కథ ఎలా ముందుకు సాగుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


