
నిన్ను కోరి సీరియల్ యొక్క ఆగస్టు 7వ ఎపిసోడ్ లో చంద్రకళ తన వ్యాపార ఒప్పందం కోసం అర్జున్ ను కలుస్తుంది. విరాట్ కూడా ఈ ఘట్టంలో కీలక పాత్ర పోషిస్తాడు. కామాక్షి, శ్రుతిలు శాలినిపై అనుమానాలతో ఉన్నారు.
Key Points
చంద్రకళ, అర్జున్ తో ఒప్పందం చేసుకుంటుంది.
విరాట్ చంద్రకళకు సహాయం చేస్తాడు, రొమాంటిక్ సన్నివేశాలు.
కామాక్షి, శ్రుతి శాలినిపై అనుమానాలు పెంచుకుంటారు.
విరాట్, చంద్రకళ ల మధ్యన ఉన్న రహస్యం కొనసాగుతుంది.
చంద్రకళ-అర్జున్ ఒప్పందం
నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 7వ తేదీ ఎపిసోడ్ లో అగ్రిమెంట్ కోసం అర్జున్ ఆఫీస్ కు వెళ్తుంది చంద్రకళ. మీరు పికిల్స్ క్వాలిటీ అండ్ టేస్ట్ చూసుకోండి. అగ్రిమెంట్ పేపర్స్ బాగా చదివి సంతకం చేయండని అర్జున్ అంటాడు. విట్నెస్ సంతకం మీ హస్బెండ్ తో పెట్టించండని అర్జున్ చెప్తాడు. చంద్ర, అర్జున్ సంతకాలు పెట్టేస్తారు. మెటీరియల్, స్టాఫ్ రెడీగా ఉన్నారని అర్జున్ చెప్తాడు. అందరికీ స్వీట్లు పంచాలని చంద్ర అనుకుంటుంది. టేబుల్ మీద లడ్డూలు పెడితే కామాక్షి, శ్రుతి తింటారు. శ్యామల, శాలిని కూడా తింటారు.
స్వీట్లు ఎవరు తెచ్చారని విరాట్ అడగడంతో అందరూ కంగుతింటారు. ఎవరు తీసుకొచ్చారంటే నేనే అని చెప్తుంది చంద్రకళ . నా బిజినెస్ ను పెద్ద లెవల్లో స్టార్ట్ చేస్తున్నానని అర్జున్ గురించి చెప్తుంది చంద్ర. అగ్రిమెంట్ కూడా అయిందని అంటుంది చంద్ర. సగం లడ్డూను చంద్ర కోసం పెట్టి పోతాడు విరాట్ . చంద్రకళ సంతోషంతో ఆ లడ్డూ తింటుంది.
విరాట్ యొక్క రహస్య సహకారం
ల్యాప్ టాప్ లో చంద్రతో జంటగా ఉన్న ఫొటోలను విరాట్ చూస్తాడు. ఏం చూస్తున్నారని చంద్ర అడిగితే.. సీక్రెట్ ప్రాజెక్ట్ అంటూ కవర్ చేస్తాడు విరాట్. అగ్రిమెంట్ మీద విట్నెస్ సైన్ కావాలని అర్జున్ అడిగాడు పెడతావు కదా అని చంద్ర అడుగుతుంది. మంచం తగిలి చంద్ర పడిపోతుంటే విరాట్ పట్టుకుంటాడు. మళ్లీ రొమాంటిక్ గా లుక్స్ కలిసిపోతాయి. విరాట్ సంతకం పెడతాడు. స్వీట్ నా కోసమే వదిలేశావు కదా అని చంద్ర అంటే.. విరాట్ మళ్లీ కవర్ చేస్తాడు. అత్త చూస్తే అట్లకాడతో వాతలు పెడుతుందని విరాట్ అంటాడు.
విరాట్ అని పిలుస్తూ శ్యామల వస్తుంది. గొంతు విని చంద్రకళ దాక్కుంటుంది. చంద్ర ఏమైనా రూమ్ లోకి వచ్చిందేమో అనుకున్నానని శ్యామల అంటుంది. చంద్రను నేను ఎందుకు రానిస్తానని విరాట్ అంటాడు. నువ్వు చంద్ర మాయలో పడకు అని విరాట్ కు చెప్పి వెళ్లిపోతుంది శ్యామల. మరోవైపు చంద్రపై కుళ్లుకుంటారు కామాక్షి, శ్రుతి. శాలిని చేతికి ఉన్న బ్యాండేజీని చూసి ఏమైందని అడుగుతారు కామాక్షి, శ్రుతి. చేయి కోసుకున్నావు కదా. అంటే అఘాయిత్యం తల పెట్టావు కదా. ఎందుకు చావాలని అనుకున్నావు. ఏమైందని కామాక్షి అడుగుతుంది. పొరపాటున తెగిందని శాలిని కవర్ చేస్తుంది.
శాలినిపై అనుమానాలు
చంద్ర గురించి ఆలోచించే మూడ్ లో ఇప్పుడు లేను. నన్ను వదిలేయండని చెప్పి శాలిని వెళ్లిపోతుంది. శాలినిపై కామాక్షి, శ్రుతికి డౌట్ వస్తుంది. ఉదయం విరాట్ కు కాఫీ పెట్టే సమయంలో అర్జున్ నుంచి కాల్ వస్తుంది. మాట్లాడుతుండగా పాలు పొంగిపోతాయి. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, చంద్రకళ తన వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడంతో పాటు, విరాట్ తో ఉన్న ఆమె సంబంధం మరింత ఆసక్తికరంగా మారుతుంది. శాలినిపై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.


