|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి జూలై 24 ఎపిసోడ్: విరాట్‌కు తగ్గిన అమ్మవారు- శాలినికి విడాకుల గురించి చెప్పిన క్రాంతి- శ్రుతి, కామాక్షి షాక్

Published: 24-07-2025, 12:18 AM
నిన్ను కోరి జూలై 24 ఎపిసోడ్: విరాట్‌కు తగ్గిన అమ్మవారు- శాలినికి విడాకుల గురించి చెప్పిన క్రాంతి- శ్రుతి, కామాక్షి షాక్

నిన్ను కోరి సీరియల్ జూలై 24 ఎపిసోడ్ లో విరాట్ అనారోగ్యంతో బాధపడుతుండగా, చంద్రకళ అమ్మవారిని మొక్కుకుని విరాట్‌కు మంచి జరుగుతుంది. కానీ, శాలిని, క్రాంతి మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంటుంది.

Key Points

1

విరాట్‌కు అమ్మవారు తగ్గింది!

2

క్రాంతి శాలినికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు!

4

చంద్రకళ తన సేవలకు కృతజ్ఞతలు చెప్పకపోవడంతో విరాట్ నిరాశపడ్డాడు!

విరాట్‌కు అమ్మవారు తగ్గడం

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్‌కి దాహం వేయడంతో మంచినీళ్లు తాగడానికి హాల్లోకి వస్తాడు. అక్కడ జగదీశ్వరి ఏదో ఆలోచిస్తూ విరాట్‌ని చూసి ఎందుకు కిందికి వచ్చావు. గదిలోనే ఉండొచ్చు కదా అని అంటుంది.దానికి దాహంగా ఉంది అమ్మ అని విరాట్ చెబుతాడు.

విరాట్‌కు మంచినీళ్లు తాగిస్తుంది జగదీశ్వరి. ఇంతలో గుడికి వెళ్లిన చంద్రకళ, శ్యామల, శ్రుతి, శాలిని, కామాక్షి ఇంటికి వస్తారు. అమ్మవారికి చంద్రకళ సంపూర్ణ నైవేద్యంతో బోనం సమర్పించింది. తప్పకుండా విరాట్‌కి నయమైపోతుంది అని జగదీశ్వరితో శ్యామల చెబుతుంది. అలాగే, శాలిని బోనం కింద పడబోతుంటే చంద్రకళ పడకుండా కాపాడింది అని శ్యామల చెబుతుంది.

శాలినికి విడాకులు

దానికి శాలినికి కోపంతో ఊగిపోతుంది. ఇక గుడిలో శృతి, కామాక్షి దొంగతనం చేశారని, కొరడాతో కొట్టించారని శ్యామల చెబుతుంది. అనంతరం అంతా వెళ్లిపోతారు. గుడి నుంచి తీసుకొచ్చిన బొట్టు విరాట్‌ పెట్టి గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడుతుంది చంద్రకళ. అలా విరాట్‌ని రాత్రంతా సేవలు చేస్తూ కాపలా కాస్తుంది చంద్రకళ. మరుసటి రోజు ఉదయాన్నే విరాట్‌కు మొత్తం అమ్మవారు తగ్గుతుంది.

అది చూసి చంద్రకళ తెగ సంతోషించి ఇంట్లోవాళ్లందరిని పిలిచి చెబుతుంది. వాళ్లంతా విరాట్‌ని చూసి సంతోషిస్తారు. చంద్రకళ మొక్కును అమ్మవారి తీర్చారు అని శ్యామల అంటుంది. తన మొక్కు తీర్చినందుకు అమ్మవారికి మొక్కుకుంటుంది. ఎప్పటికీ రుణపడి ఉంటాను అమ్మవారికి చెప్పుకుంటుంది చంద్రకళ. అయితే, ఇంత చేసిన తనకు విరాట్ థ్యాంక్స్ చెబుతాడేమో అని ఆశిస్తుంది చంద్రకళ.

శ్రుతి, కామాక్షి షాక్

కానీ, విరాట్ ఏం చెప్పడు. కాసేపటికి శ్రుతి, కామాక్షి లు ఉన్న చోట చంద్రకళకు చేసిన పనులకు థ్యాంక్స్ అని చెబుతాడు. అది విన్న శ్రుతి, కామాక్షి షాక్ అవుతారు. విరాట్ ఏంటీ చంద్రకళపై ప్రేమ చూపిస్తున్నాడని డౌట్ పడతారు. మరోవైపు క్రాంతితో ప్రేమగా మాట్లాడేందుకు శాలిని ప్రయత్నిస్తుంది. కానీ, క్రాంతి మాత్రం శాలినిని పక్కన పెడతాడు.

ఏంటీ డల్‌గా ఉన్నావ్. నీ మూడ్ సెట్ కావాలంటే ఈరోజు మనం సినిమాకు వెళ్దాం అని శాలిని అంటుంది. నేను నీతో ఎక్కడికి రాను. నిన్ను వదిలించుకోడానికి నేను మన విడాకులకు అప్లై చేశాను. ఇంకా కొద్దిరోజులు అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని క్రాంతి చెబుతాడు. దాంతో శాలినికి దిమ్మతిరిగిపోతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

విరాట్‌కు అమ్మవారు తగ్గడంతో కుటుంబంలో సంతోషం నెలకొంది. కానీ, క్రాంతి శాలినికి విడాకులు ఇవ్వాలనుకోవడం, శ్రుతి, కామాక్షి షాక్ అవ్వడం తో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.