|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి జూన్ 16 ఎపిసోడ్: శ్యామలకు తెలిసిపోయిన నిజం- కోపంతో రగిలిపోయిన అత్త- చంద్రకళకు ప్రశ్నలు-ప్లేట్ తిప్పిన శాలిని

Published: 16-06-2025, 12:14 AM
నిన్ను కోరి జూన్ 16 ఎపిసోడ్: శ్యామలకు తెలిసిపోయిన నిజం- కోపంతో రగిలిపోయిన అత్త- చంద్రకళకు ప్రశ్నలు-ప్లేట్ తిప్పిన శాలిని

నిన్ను కోరి సీరియల్‌లోని ఈరోజు ఎపిసోడ్‌లో శ్యామలకు విరాట్ మరియు చంద్రకళ మధ్య రహస్యం తెలుస్తుంది. చంద్రకళకు శాలిని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. శాలిని తన ప్రయోజనాల కోసం పరిస్థితిని తిప్పికొడుతుంది.

Key Points

1

శ్యామలకు విరాట్ మరియు చంద్రకళ రహస్యం తెలుస్తుంది.

2

చంద్రకళకు శాలిని నుండి తీవ్రమైన ప్రశ్నలు.

4

శోభనం విషయంపై కుటుంబంలో ఉద్రిక్తత.

శ్యామలకు వెల్లడి అయిన నిజం

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శోభనం గదిలో పాల గ్లాస్ కిందపడటంతో శ్యామలకు అనుమానం వస్తుంది. దాంతో డోర్ దగ్గరే ఉండి విరాట్, చంద్రకళ మాటలు వింటుంది. అది డైవర్ట్ చేయడానికి చంద్రకళ పుష్ప 2 సాంగ్ పెడుతుంది. ఆ పాటకు శ్యామల డ్యాన్స్ చేస్తుంది. అక్కడి నుంచి శ్యామల తీసుకెళ్లడానికి వచ్చిన కామాక్షిని కూడా డ్యాన్స్ చేసేలా చేస్తుంది శ్యామల.

శోభనం గదిలో విరాట్‌పై పడుతు ముద్దులు పెడుతుంటుంది చంద్రకళ. ఈ క్రమంలో బెడ్ మీద పడిపోతారు చంద్రకళ, విరాట్. దాంతో మంచం విరిగిన సౌండ్ వస్తుంది. అది విని శ్యామల సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది. దుష్ట త్రయం షాక్ అవుతారు. విరాట్‌ నడుముకు దెబ్బ తగలడంతో బామ్ రాస్తుంది చంద్రకళ. విరాట్‌నే ప్రేమగా చూస్తూ పడుకుంటుంది చంద్రకళ.

మరోవైపు చంద్రకళ ఇచ్చిన సజెషన్స్‌తో క్రాంతి డిజైన్స్ వేస్తాడు. అక్కడికి వచ్చిన శాలిని చంద్రకళ మీద కోపంగా ఉంటుంది. శాలినికి క్రాంతి డిజైన్స్ చూపిస్తే శాలిని చిరాకు పడుతుంది. నాకు ఇంట్లో ప్రశాంత లేకుండా పోయిందని అంటుంది. దానికి అంతలా రియాక్ట్ అవడం ఏంటీ. మూడ్ లేదని సింపుల్‌గా చెబితే సరిపోతుందని తన పని తాను చేసుకుంటాడు క్రాంతి.

మరుసటి రోజు ఉదయం చంద్ర కంటే ముందు విరాట్ లేచి కూర్చుంటాడు. చంద్ర నిద్ర లేస్తుంది. ఫస్ట్ నైట్ జరిగినట్లు తెలియాలని చంద్రకళ బొట్టు, లిప్‌స్టిక్ చెరిపేస్తాడు విరాట్. చంద్రకళ బయటకు వస్తుంది. అక్కడే టెన్షన్ పడుతున్న శ్రుతి చూసి షాక్ అవుతుంది. కామాక్షి, శాలిని కూడా అవాక్కవుతారు. చంద్రక సిగ్గుపడుతూ వచ్చి శోభనం జరిగిపోయిందని చెబుతుంది.

చంద్రకళపై శాలిని ఆగ్రహం

అందరిని ఒప్పించేదాక శోభనం చేసుకోను అని ఎవరో అన్నట్లు గుర్తు. మాట మీద నిలబడనప్పుడు ఎందుకు అనడం సిగ్గు లేకపోతే సరి అని శాలిని అంటుంది. నా మాట నిజంగానే నమ్మినదానివి అయితే పాలల్లో మత్తు మందు ఎందుకు కలిపావ్ శాలిని తిరిగి ప్రశ్నిస్తుంది చంద్రకళ. జగదీశ్వరి అత్తయ్య ఒప్పుకుంటేనేగా శోభనం జరిగింది. ఇక ఇంటి కోడలు అయినట్లేగా. ఫస్ట్ నైట్ జరుపుకుంటే తప్పేంటీ అని చంద్రకళ అంటుంది.

ఫస్ట్ నైట్ అయిందంటే నేను నమ్మను అని శ్రుతి అంటుంది. ఇంతలో వచ్చిన విరాట్ ఫస్ట్ నైట్ జరిగినట్లుగా మాట్లాడుతాడు విరాట్. పెళ్లి ఇష్టం లేదని చెప్పి శోభనం మాత్రం బాగా చేసుకున్నావా బాబు అని కామాక్షి అంటుంది. నేను చెప్పేది అంటూ అనబోయిన విరాట్ శ్యామల రావడంతో ఆగిపోతుంది. ఇన్నిరోజులకు పరిపూర్ణ దంపతులు అయినట్లున్నారు అని శ్యామల అంటుంది.

అసలే అలసిపోయావ్ అని విరాట్‌ను అంటుంది శ్యామల. దాంతో శ్రుతి, శాలిని, కామాక్షి అదోలా చూస్తారు. నన్ను అలా చీప్‌గా చూడకండే. నేను నెప్పే. నేనేం కమిట్ అవ్వలేదే అని లోపల బాధపడుతాడు విరాట్. దుష్ట త్రయం వెళ్లిపోతుంది. తర్వాత ఇంటికి క్రాంతిని కలవడానికి స్పాన్సర్స్ వస్తారు. ఇంట్లో అందరిని పిలుస్తాడు క్రాంతి. స్పాన్సర్స్‌కు తను వేసిన డిజైన్స్ నచ్చినట్లు విరాట్‌కు చెబుతాడు క్రాంతి.

అవి తను వేసిన ఫస్ట్ డిజైన్స్ అని అందుకే ఇంట్లో అందరికి చెప్పడానికి స్పాన్సర్స్‌ను ఇంటికి పిలిపించినట్లు వాళ్లకు చెబుతాడు క్రాంతి. డిజైన్స్ చూసి విరాట్ సూపర్ అంటూ మెచ్చుకుంటాడు. ఇంత తక్కువ టైమ్‌లో ఎలా వేశావురా అని విరాట్ అడుగుతాడు. మొదటిసారి వేశానంటున్నారు చాలా క్వాలిటీగా వేశారు. మీరు ఎంత అడిగిన ఇవ్వడానికి వచ్చామని స్పాన్సర్స్ అంటారు.

శోభనం తర్వాత కుటుంబంలో ఉద్రిక్తత

దాంతో క్రాంతిని పొగుడుతూ గర్వంగా ఉందంటుంది శాలిని. ఎంతైనా ఇస్తామనేసరికి ఎలా అంటుందో చూడు. అసలు ఏనాడైనా క్రాంతిని మనిషిలా చూసిందా. జగజ్జంత్రి ఇది. ప్లేట్ మార్చేసింది చూడు అని శ్రుతితో కామాక్షి అంటుంది. శాలిని హడావిడి చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. అది మీ భార్య అనుకుంటా అని స్పాన్సర్స్ అంటే.. లేదండి. నన్ను నడిపించింది మా వదినమ్మా అని క్రాంతి అంటాడు.

అంతా షాక్ అవుతారు. ఆవిడ నాకు అమ్మతో సమానం అండి. ఈ అమ్మ ముందడుకు ఎలా వేయాలో నేర్పింది అని అందరిముందు చంద్రకళను పొగుడుతాడు క్రాంతి. తర్వాత ఇంటికి కొంతమంది వచ్చి రఘురాం యాక్సిడెంట్ గురించి మాట్లాడుతారు. అది విని అన్నయ్యకు ఆ యాక్సిడెంట్ చేయించింది వరదరాజులే కదా. ఆ ఇంటి కాకి కూడా ఈ ఇంటి మీద వాలకూడదు అని కోప్పడుతుంది శ్యామల.

చంద్రకళ నీ తల్లిదండ్రులు అలాంటి వాళ్లు కాదు కదా అని శ్యామల ప్రశ్నిస్తుంది. దాంతో చంద్రకళ తెగ భయపడిపోతుంది. రఘురాంకు యాక్సిడెంట్ అయిందనే నిజం శ్యామలకు తెలియడంతో కోపంతో ఊగిపోతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరికి, శోభనం విషయంపై కుటుంబంలో పెద్ద గొడవ జరుగుతుంది. శ్యామల, చంద్రకళ, శాలిని మధ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయి. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.