|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి సీరియల్: క్రాంతి ప్రాజెక్ట్‌కు షాక్! శాలిని డేంజర్ ప్లాన్, విరాట్ చిక్కుల్లో!

Published: 31-01-2026, 1:35 AM
నిన్ను కోరి సీరియల్: క్రాంతి ప్రాజెక్ట్‌కు షాక్! శాలిని డేంజర్ ప్లాన్, విరాట్ చిక్కుల్లో!
  • విరాట్‌కు మంత్రి పీఏ కాల్: క్రాంతి ల్యాండ్ ప్రపోజల్ పంపమని ఆదేశం, ప్రాజెక్ట్ గోవిందా!
  • శాలిని కుట్ర: విరాట్ చెప్పినా క్రాంతికి ల్యాండ్ విషయం చెప్పని శాలిని, ట్విస్ట్ మామూలుగా లేదు!
  • చంద్రకళపై రఘురాం అనుమానం: మల్లెపూలు చూసి సీన్ క్రియేట్, ఫ్యామిలీ షాక్!
  • రాజ్ vs తల్లి: శ్రుతిని, అత్తగారిని అంటే ఊరుకునేది లేదని వార్నింగ్, హై డ్రామా!

నిన్ను కోరి సీరియల్ అభిమానులకు గుడ్ న్యూస్! జనవరి 31 ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. క్రాంతి ప్రాజెక్ట్‌కు అడ్డంకులు, శాలిని కుట్రలు, ఫ్యామిలీ డ్రామాతో ఎపిసోడ్ అదిరిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

క్రాంతి ప్రాజెక్ట్‌కు బ్రేక్ వేసిన శాలిని!

నిన్ను కోరి సీరియల్ జనవరి 31 ఎపిసోడ్‌లో విరాట్‌కు కాల్ చేసిన మంత్రి పీఏ క్రాంతి ల్యాండ్ ప్రపోజల్ పంపించమని చెబుతుంది. అదే విషయం క్రాంతికి చెప్పబోతుంటే శాలిని ఎదురుపడుతుంది. క్రాంతికి చెప్పమని శాలినికి చెబుతాడు విరాట్. కానీ, శాలిని చెప్పదు. విరాట్ ల్యాండ్‌కు జీహెచ్ఎంసీ పర్మిషన్ వస్తుంది.

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ కోసం విరాట్ తెచ్చిన మల్లెపూలను సోఫాలో చూస్తాడు రఘురాం. నీకోసమేగా వీడు పూలు కొన్నది అని రఘురాం అంటాడు. దాంతో డైనింగ్ టేబుల్‌పై ఉన్న గ్లాస్ కింద పడేస్తుంది చంద్రకళ. దాంతో జరిగింది మర్చిపోతాడు రఘురాం. ఇంతలో అంతా వస్తారు. చేతిలో మల్లెపూలు ఏంటని శ్యామల అడుగుతుంది.

అయితే రూమ్‌లో అను అన్నయ్య అని రఘురాం, జగదీశ్వరిని గదిలోకి పంపించేస్తారు శ్యామల, కామాక్షి. ప్రకాష్ ఉండుంటే నాకు కూడా ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఉండేవని శ్యామల అంటుంది. సరేలే నేను కొనిస్తాలే మల్లెపూలు అని కామాక్షి అంటుంది. బతికిపోయామని విరాట్ అనుకుంటాడు. చంద్రకళ తెగ నవ్వుతుంది. మల్లెపూల మీద చంద్రకళ కవిత్వం చెబుతుంది.

మల్లెపూలతో రచ్చకెక్కిన రఘురాం!

నా ప్లాన్ ఫెయిల్ అయిందని ఏడుస్తుంటే ఎటకారం చేస్తావా అని చంద్ర వెంట పడతాడు. ఇంతలో మంత్రి పీఏ విరాట్‌కు కాల్ చేసి ల్యాండ్ ప్రపోజల్స్ గురించి చెబుతుంది. క్రాంతి ఐడియాను ఎగ్జిక్యూట్ చేయాలని, ల్యాండ్‌కు ప్రపోజల్ పంపించమని, నచ్చితే వెంటనే లాక్ చేస్తారని పీఏ చెబుతుంది. దాంతో విరాట్ సంతోషిస్తాడు. అదే చంద్రకళకు చెబుతాడు విరాట్.

నువ్వు మీ అమ్మ రాకాసి తెగకు చెందినవాళ్లు అని రాజ్ తల్లి అంటుంది. శ్రుతి పుట్టింటికి వెళ్తానని బెదిరిస్తే రాజ్ బతిమిలాడుతాడు. నా భార్యను, అత్తగారిని అంటే ఊరుకునేది లేదని రాజ్ తల్లిని మందలిస్తాడు. రేపటి నుండి అది మార్కెట్‌కు రాకూడదు అని తల్లి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం చంద్రకళ పూజ చేస్తుంది.

విరాట్ హారతి అయిష్టంగా తీసుకుంటాడు. ఇంకా చంద్ర మీద కోపం పోలేదా అని రఘురాం నిలదీస్తాడు. అలా అడగండి అని చంద్ర అంటే.. నా కూతురు విషయంలో మూటగట్టుకున్న పాపం ఊరికే పోతుందా అని కామాక్షి నిందిస్తుంది. ఎంత తిట్టిన దులుపేసుకుంటావ్. సిగ్గులేకుండా అని శ్యామల అంటుంది. మీరు మాత్రం వెళ్లారా. అంత ఒకే కుంపటి అని చంద్రకళ రివర్స్ పంచ్ ఇస్తుంది.

ఫ్యామిలీ డ్రామాలో రాజ్ సీరియస్ వార్నింగ్!

అంతా విరాట్‌కు కంగ్రాట్స్ చెబుతారు. ఈ న్యూస్ వాడుకుని క్రాంతిని రెచ్చగొట్టాలని శాలిని అనుకుంటుంది. క్రాంతి చాలా సంతోషంగా ఉంటాడు. ఒక్క పర్మిషన్ వస్తే చాలు సక్సెస్ సాధించినట్లే అని క్రాంతి అంటాడు. మీ అన్నయ్య ఆల్రెడీ సక్సెస్ సాధించిన సంతోషంలో ఉన్నాడు. ఎప్పుడో కొన్న ల్యాండ్‌కు రేట్ పెరిగిందని, కోట్లల్లో లాభాలు వస్తాయని పొంగిపోతున్నారని శాలిని అంటుంది.

త్వరలో నేను కూడా సక్సెస్ సాధిస్తే అంతా సంతోషిస్తారు అని క్రాంతి అంటాడు. బావ గారు నీ పని చూస్తూనే తన పని చేసుకుని సక్సెస్ అయ్యారు. నువ్వు కూడా సొంతంగా పనులు చేయడం నేర్చుకో. అప్పుడే సక్సెస్ అవుతావ్. బావగారు బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. మినిస్టర్ గారి పీఏతో నువ్వే డైరెక్ట్ మాట్లాడు. నీకు క్లారిటీ వస్తుందని శాలిని అంటుంది.

అదే విషయం వెళ్లి విరాట్‌ను అడుగుతాడు క్రాంతి . నిన్నే నీకు చెప్పాను కదా అని శాలినిని విరాట్ అంటాడు. నాకు ఎప్పుడు చెప్పారు అని అబద్ధం చెబుతుంది శాలిని. అలా తమ్ముడి దగ్గర విరాట్‌ను ఇరికిస్తుంది శాలిని. దాంతో విరాట్ , చంద్ర షాక్ అవుతారు. ఇక బిజినెస్ లో అన్న సక్సెస్ అయితే తమ్ముడు ఫెయిల్ అవుతాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

నిన్ను కోరి సీరియల్‌లో రోజుకో ట్విస్ట్! క్రాంతి ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా? శాలిని ప్లాన్ ఫలిస్తుందా? రాజ్ ఫ్యామిలీ గొడవలు ఎక్కడికి దారితీస్తాయి? మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.