
📌 Key Points
- సునంద ప్లాన్ బెడిసికొట్టింది, పోలీసులకే క్రాంతి వార్నింగ్!
- చంద్రకళకు అత్తమామల నుండి ఊహించని గిఫ్ట్!
- విరాట్‌ను బెంగళూరు పంపేందుకు శాలిని కుట్ర!
- క్రాంతి సీరియస్ వార్నింగ్: శాలిని ఇంటి నుండి అవుట్!
నిన్ను కోరి సీరియల్‌లో ఊహించని మలుపులు! సునంద కుట్రలు ఫలిస్తాయా? క్రాంతి తన కుటుంబాన్ని కాపాడతాడా? అసలు ఏం జరగబోతుందో చూడాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే!
పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన క్రాంతి!
Ninnu Kori Serial March 10th Episode: నిన్ను కోరి సీరియల్ మార్చి 14 ఎపిసోడ్‌లో రఘురాం ఇంటికి పోలీసులను పంపించి విరాట్‌ను విచారణ జరిపించేలా సునంద, శాలిని ప్లాన్ వేస్తారు. కానీ, అది బెడిసికొడుతుంది. రివర్స్‌లో పోలీసులకే వార్నింగ్ ఇప్పిస్తాడు క్రాంతి. చంద్రకళకు అత్తమామలు మొదటి గిఫ్ట్ ఇస్తారు.
Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మాయ తమలో కలిసిపోయినందుకు జగదీశ్వరి అంటుంది. మీరే నన్ను కలుపుకున్నారు ఆంటీ అని మాయ అంటుంది. ఇక్కడ అందరు తనను ఇన్‌స్పైర్ చేస్తున్నారు అక్క అని చంద్రకళను పిలుస్తుంది మాయ.
కానీ, ఆ విరాట్ ఇంట్లో లేడు అని శాలిని అంటుంది. ఆ పోలీసులే విరాట్‌ను పిలిపిస్తారు. ఆ ఇల్లంతా బాధతో కుమిలిపోతుంది. ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఈ ల్యాండ్ ఇష్యూని అడ్డుపెట్టుకుని వాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేద్దామని సునంద అంటుంది. తర్వాత విరాట్ కోసం పోలీసులు వస్తారు. ఇంట్లో విరాట్ లేడని క్రాంతి చెబుతాడు.
సునంద ప్లాన్ బెడిసికొట్టిందా?
నకిలి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ల్యాండ్ కొన్నారు. మాకు కంప్లైంట్ వచ్చింది. అందుకే విచారిద్దామని వచ్చామని పోలీస్ అంటాడు. అసలు మీకు వారెంట్ ఉందా. మీరు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారా అని రఘురాం, తప్పుడు డాక్యుమెంట్స్ ఉన్న వాళ్లు లంచం ఇస్తే వచ్చినట్లున్నారని జగదీశ్వరి అంటారు.
కేసు బుక్ అవ్వకుండా ఇంటికి ఎలా వస్తారు. నేను మాట్లాడుతానను అని అతను మాట్లాడుతాడు. ఏంటయ్యా ఇద్దరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మీరెలా ఇన్వాల్వ్ అవుతారు. అది కోర్టు చూసుకుంటుంది. మీరు ఇన్వాల్వ్ అయితే నేను మినిస్టర్‌ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుందని అతను పోలీసులకు వార్నింగ్ ఇస్తాడు. దాంతో సారీ చెప్పేసి పోలీసులు వెళ్లిపోతారు.
ఇదంతా ఎవరో కావాలనే చేయిస్తున్నట్లుందని రఘురాం అంటాడు. మన శత్రువులు ఇంట్లోనే ఉన్నారని, మీ అమ్మే కదా ఇదంతా చేస్తుంది. ఆ డాక్యుమెంట్స్ కొట్టేసింది నువ్వే కదా అని క్రాంతి అంటాడు. శాలిని డ్రామా చేస్తుంది. దీని వెనుక మీ అమ్మ ఉందని నా నమ్మకం. అది తెలిసినరోజు నువ్వు ఇంట్లో ఉండవు అని క్రాంతి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
చంద్రకళకు అత్తమామల ప్రేమతో గిఫ్ట్!
మన ప్లాన్ బెడిసికొట్టిందమ్మా. పోలీసులు రావడంతో విరాట్‌కు బెంగళూరు వెళ్లాలన్న ఆలోచన కూడా వచ్చింది అని తల్లి సునందకు చెబుతుంది శాలిని. అక్కడ విరాట్‌కు ఏదైనా చేస్తే అని సునంద అంటే.. వద్దని చెప్పిన శాలిని ముందు క్రాంతిని డైవర్ట్ చేయాలంటుంది. ముందు విరాట్ సైన్ తీసుకోకుండా ఆపాలి అని సునంద అంటుంది. ఏం జరిగినా మన పేర్లు రాకుండా చూసుకో అని శాలిని చెబుతుంది.
విరాట్ వెళ్తాడు. చంద్రకళకు జాగ్రత్తలు చెబుతాడు. చంద్రకళను జాగ్రత్తగా చూసుకుంటానని, తనను కాపాడినందుకు రుణం తీర్చుకుంటానని మాయ చెబుతుంది. విరాట్ వెళ్లిపోతాడు. మాయ ఏదో రాసి ఈ పాయింట్స్ చంద్రతో డిస్కస్ చేయాలనుకుంటుంది. ఇంతలో హాల్లోకి చంద్రకళను పిలిచిన జగదీశ్వరి నెక్లెస్ చూపిస్తుంది. అది చాలా బాగుందని చంద్ర అంటే.. నీకోసమే తీసుకున్నామని చెబుతాడు రఘురాం.
ఇష్టమైనవి సొంతం అవడమే కష్టం అని కామాక్షి వెళ్లిపోతుంది. గదిలోకి వెళ్లి విరాట్ ఫొటో ముందు నెక్లెస్ చూపిస్తూ అత్త మామ నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇది. నువ్వు వచ్చాకా నీతో చేయించే మొదటి పని ఇది నీ చేత్తో మెడలో వేయించుకోవడమే అని చంద్రకళ చెబుతుంది. నెక్లెస్ బెడ్‌పైనే పెట్టి పైన ఆరేసిన బట్టలు తీసుకురావాలని వెళ్లిపోతుంది చంద్రకళ .
నిన్ను కోరి సీరియల్‌లో రోజుకో ట్విస్ట్! క్రాంతి ఏం చేస్తాడు? విరాట్ పరిస్థితి ఏంటి? మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి!


