|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 11: దుష్టత్రయానికి అదిరిపోయే ట్విస్ట్.. ఒకరికొకరు తినిపించుకున్న చంద్ర, విరాట్

Published: 11-06-2025, 1:32 AM
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 11: దుష్టత్రయానికి అదిరిపోయే ట్విస్ట్.. ఒకరికొకరు తినిపించుకున్న చంద్ర, విరాట్

నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్‌లో చంద్రకళ, విరాట్‌ల మధ్య ఆహారం పంచుకోవడం, దుష్టత్రయం చేసిన కుట్ర, చంద్ర ప్రతీకారం వంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం.

Key Points

1

చంద్రకళ, విరాట్ ఒకరికొకరు ముద్దలు తినిపించుకుంటారు.

2

దుష్టత్రయం (శాలినీ, కామాక్షి, శృతి) కారం ఎక్కువగా కలిపిన కూర తింటారు.

4

దుష్టత్రయం చంద్ర ప్రతీకారానికి బలవుతుంది.

భోజన సమయంలో ట్విస్ట్

నిన్ను కోరి సీరియల్ నేటి (జూన్ 11) ఎపిసోడ్‍లో.. ఏవండోయ్ శ్రీవారు భోజనం చేసేందుకు రండి, మీకు ఇష్టమైనవే చేశానని విరాట్‍ను చంద్రకళ పిలుస్తుంది. వినపడలేదని విరాట్ అంటాడు. అయితే శ్యామల పిన్ని వచ్చి పిలుస్తుందని చంద్ర అంటుంది. దీంతో భయపడిన విరాట్.. వస్తున్నా అంటాడు. తాము కారం ఎక్కువగా కలిపిన కూర ఎక్కువ తింటే రచ్చరచ్చే అని ‘దుష్టత్రయం’ శాలినీ, కామాక్షి, శృతి అనుకుంటారు. వాళ్లకు చంద్ర కౌంటర్లు ఇస్తుంది.

మీ ఆయన పక్కన కూర్చో చంద్ర అని శ్యామల అంటుంది. మేం వడ్డిస్తామని కామాక్షి చెబుతుంది. ఒకరికొకరు తినిపించుకోండని విరాట్, చంద్రకళ కు శ్యామల చెబుతుంది. మొన్న తినిపించుకున్నాం కదా అని విరాట్ అంటాడు. ఇప్పుడు సంప్రదాయం కోసం అని శ్యామల సర్దిచెబుతుంది. ఎగిలి ముద్ద తినిపించుకోవాలని అంటుంది. అలా మూడు ముద్దలు తినిపించుకోవాలని, కచ్చితంగా చేయాల్సిందేనని చెబుతుంది.

ముందు విరాట్ ఓ ముద్ద తింటాడు. ఇదేంటి విరాట్ బావకు ఏమీ కాలేదని శాలినీ షాక్ అవుతుంది. కామాక్షి, శృతి కూడా ఆశ్యర్యపోతారు. వారికి అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. విరాట్, చంద్ర ఒకరికొకరు ముద్దలు తినిపించుకుంటారు. అందరూ ఆనందంగా తింటుంటే చంద్ర దుష్టత్రయం అని పిలుచుకునే శాలిని, కామాక్షి, శృతి షాకై చూస్తుంటారు.

దుష్టత్రయం యొక్క కుట్ర

మీరు కూడా కూర్చొని తినండని శాలిని, కామాక్షి, శృతికి శ్యామల చెబుతుంది. వారి కోసం తాను సపరేట్‍గా వండానని చంద్ర అంటుంది. ఏమైంది.. ఎవరికీ ఏం కాలేదు అని శృతి అంటే.. నాకు అర్థం కావడం లేదని కామాక్షి చెబుతుంది. మీకోసం స్పెషల్‍గా చేసిన కర్రీ అని ఆ ముగ్గురికి చంద్ర వడ్డిస్తుంది. అది వారు ఎక్కువగా కారం, ఉప్పు వేసిన కూరలు అయి ఉంటాయి. వాటిని ఆ ముగ్గురితోనే తినిపించి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది చంద్ర.

వాళ్ల కూరలో కారం కలిపిన విషయాన్ని చంద్ర వీడియో తీసి ఉంటుంది. దాన్ని చూపిస్తుంది. నోరు మూసుకొని తినకపోతే వీడియోను శ్యామల పిన్నికి చూపిస్తానని బెదిరిస్తుంది. ఉప్పు, కారం సరిగ్గా సరిపోయినట్టు ఉన్నాయంటూ కామాక్షి, శాలినీ, శృతిని మరింత ఉడికిస్తుంది చంద్ర. మరింత కర్రీ వేస్తుంది శ్యామల. తినలేక ఆపలేక ఆపసోపాలు పడతారు ఆ ముగ్గురు.

ఎలా ఉంది నా ఘాటు దెబ్బ, దిమ్మతిరిగి బొమ్మ కనపడినట్టు ఉంది అని శాలిని, కామాక్షి, శృతికి కౌంటర్లు వేస్తుంది చంద్ర. వీడియో చూపిస్తానంటూ బెదిరిస్తుంది. వీడియో డిలీట్ చేయాలని శృతి అడుగుతుంది. శ్యామలకు చూపిచ్చొద్దని వేడుకుంటుంది. మరోసారి తన పనులకు అడ్డువచ్చినా, విరాట్ బావ మధ్య దూరం పెంచాలని చూసినా నా రియాక్షన్ వేరుగా ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది.

చంద్ర యొక్క ప్రతీకారం

కొత్త డిజైన్‍ల గురించి స్పాన్సర్‌తో ఫోన్‍లో మాట్లాడుతుంటాడు క్రాంతి. టైమ్‍లో డిజైన్స్ చేస్తానని చెబుతాడు. నేను కొత్త స్పాన్సర్లతో మాట్లాడానని, డిజైన్స్ నచ్చితే స్పాన్సర్‌షిప్‍కు ఒప్పుంటారని శాలినీతో క్రాంతి చెబుతాడు. డిజైన్స్ వేయాలని అంటాడు. అంతా నేనే చేస్తే నువ్వెందుకు అని భర్త క్రాంతిని అవమానించేలా శాలినీ మాట్లాడుతుంది. నువ్వేం కష్టపడవా అంటూ తిడుతుంది.

నల్లపూసల ఫంక్షన్, తల్లి జగదీశ్వరి మాటలు తలుచుకొని బాధగా ఉంటాడు విరాట్. మనస్సాక్షే లేదా అని చంద్రను చిరాకుగా అడుగుతాడు. నల్లపూసల వేడుక జరిగినందుకు సంతోషంగా ఉన్నానని చంద్ర అంటుంది. అమ్మ మాత్రం చాలా బాధగా ఉందని విరాట్ అంటాడు. జగదీశ్వరి అత్తయ్య మన పెళ్లిని అంగీకరించిందని చంద్ర సర్ది చెప్పేలా మాట్లాడుతుంది.

చివరికి దుష్టత్రయం తమ కుట్రకు తగిన శిక్ష పొందుతుంది. చంద్ర యొక్క తెలివితేటలు, ప్రతీకారం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నిన్ను కోరి సీరియల్ ఇంకా ఆసక్తికరంగా సాగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.