
నిన్ను కోరి సీరియల్ లో నేటి ఎపిసోడ్ లో విరాట్ కి జ్వరం వస్తుంది. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో విరాట్ శ్రీరాజ్ పై ఫైర్ అవుతాడు. వారి మధ్య జరిగిన గొడవ వల్ల వరదరాజులు కుటుంబాల మధ్య గొడవ మరింత పెరుగుతుంది.
Key Points
విరాట్ కు జ్వరం వచ్చి చంద్రకళ టాబ్లెట్ ఇస్తుంది.
గవర్నమెంట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో విరాట్, శ్రీరాజ్ పై ఫైర్ అవుతాడు.
వరదరాజులు కుటుంబాల మధ్య గొడవ పెరుగుతుంది.
విరాట్ మరియు చంద్రకళ మధ్య రొమాన్స్
నిన్ను కోరి సీరియల్ నేటి ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్‍లో ఏం జరిగిదంటే.. జ్వరం వచ్చిన విరాట్ దగ్గరకిి చద్రకళ వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకోవాలని ఇస్తుంది. చంద్రకళ చేయి పట్టుకొని దగ్గరిగా వస్తాడు విరాట్. ఇద్దరూ రొమాంటిక్‍గా చూసుకుంటారు. ఏంటి అదంతా అని చంద్రకళ దూరం జరుగుతుంది.
విరాట్ కంపెనీకి రావాల్సిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ విషయంపై ఆదితో నిర్లక్ష్యంగా మాట్లాడతాడు శ్రీరాజ్. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన విషయాన్ని విరాట్‍కు ఫోన్ చేసి చెబుతాడు ఆది. దీంతో విరాట్ షాక్ అవుతాడు. శ్రీరాజ్ లైట్‍గా తీసుకొని వెళ్లిపోయాడని ఆది చెప్పడంతో విరాట్ కోప్పడతాడు. అంతా సరిగా చేశాం.. కదా ఎందుకు క్యాన్సిల్ అయిందని విరాట్‍ను చంద్రకళ అడుగుతుంది. అదే అర్థం కావడం లేదంటాడు విరాట్. హడావుడిగా ఆఫీస్‍కు బయలుదేరతాడు.
ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్ మరియు విరాట్ యొక్క కోపం
ఇంతలో ఆఫీస్‍కు వస్తాడు విరాట్. శ్రీరాజ్.. శ్రీరాజ్ అని గట్టిగా అరుస్తాడు. ఆఫీస్‍లో లేడని చంద్రకళ అడుగుతుంది. శ్రీరాజ్ కంపెనీకే మచ్చతెచ్చాడని విరాట్ ఆగ్రహంగా అరుస్తాడు. ఇంతలో శ్రీరాజ్ అక్కడికి వస్తాడు.
నీవల్లే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారని శ్రీరాజ్‍పై కార్తీక్ కోప్పడతాడు. ఎంతకావాలో చెబితే ఇస్తానని తాను ఇన్‍స్పెక్షన్‍కు వచ్చిన అధికారులతో చెప్పానని అది తప్పా బావా అని శ్రీరాజ్ అంటాడు. దీంతో రగిలిపోయిన విరాట్.. బుద్ధి ఉందా నీకు అసలు అంటూ శ్రీరాజ్ కాలర్ చొక్కా పట్టుకుంటాడు. ఆఫీస్‍లో ఉన్న వారంతా చూస్తారు. కావాలనే ఇలా చేశానని, గొడవ పెద్దది చేస్తానని మనసులో అనుకుంటాడు శ్రీరాజ్. ఇద్దరి మధ్య మాటల హోరు సాగుతుంది. అవమానించాలనే ఇలా చేశావని శ్రీరాజ్ అంటాడు.
వరదరాజులు కుటుంబాల మధ్య గొడవ
తాను ఆఫీసర్లతో మాట్లాడి ఒప్పిస్తానని విరాట్‍తో చంద్రకళ అంటుంది. శ్రీరాజ్‍ను నువ్వే తీసుకొచ్చావని అందుకే ఇలా జరిగిందంటూ విరాట్ ఫైర్ అవుతాడు. చంద్రపై కొట్టేందుకు చేయి ఎత్తుతాడు. ఆఫీసర్ ఎంత నీచంగా మాట్లాడాడో తెలుసా.. వెళ్లిపో అంటాడు. దీంతో చందు ఏడ్చేస్తుంది.
శ్రీరాజ్‍ను విరాట్ తిట్టి, చొక్కా పట్టుకున్నాడని ఇంట్లో గొడవ చేస్తాడు వరదరాజులు. అడిగే వాళ్లు లేరనా అని అంటాడు. తాను ఊరిలోనే ఉండనని శ్రీరాజ్ అంటాడు. రెండు కుటుంబాల మధ్య మరింత దూరం పెంచేలా మాట్లడతాడు. శ్రీరాజ్ కావాలనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని షాలినీ కూడా అంటుంది. శ్రీరాజ్‍ను విరాట్ తిట్టడం కరెక్ట్ కాదని వాళ్ల ఇంట్లో జగదీశ్వరి అంటుంది. శ్రీరాజ్ వల్లే ఇదంతా జరిగిందని చంద్రకళ చెబుతుంది. వద్దనా శ్రీరాజ్‍కు పార్ట్‌షిప్ ఇచ్చి తప్పు చేశారని తల్లితో విరాట్ అంటాడు. అన్న శ్రీరాజ్‍దే తప్పని వాళ్ల ఇంట్లో చంద్రకళ చెబుతుంది. దీంతో నిన్ను కోరి సీరియల్ నేటి (ఏప్రిల్ 30) ఎపిసోడ్ ముగిసింది. చంద్రనే విరాట్‍ను తప్పుపట్టేలా చేస్తానని శ్రీరాజ్‍తో కలిసి వరదరాజులు ప్లాన్ చేయడం తదుపరి ఎపిసోడ్‍లో ఉండనుంది.
శ్రీరాజ్ ప్రవర్తన వల్ల రెండు కుటుంబాల మధ్య విభేదాలు మరింత పెరిగి, కథనం ఆందోళనకరమైన స్థితిలో ముగుస్తుంది. విరాట్ మరియు శ్రీరాజ్ మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయా అనేది ఆసక్తికరంగా ఉంది.


